Devil: ‘డెవిల్’ స్టన్నింగ్‌ పోస్టర్‌.. సీక్రెట్‌ ఏజెంట్‌ ఏం ఉన్నాడులే..

ABN , First Publish Date - 2023-10-24T19:17:55+05:30 IST

నందమూరి కల్యాణ్‌రామ్‌ చేస్తున్న మరో వైవిధ్యభరిత చిత్రం ‘డెవిల్’. అభిషేక్‌ నామా నిర్మించడంతో పాటు దర్శకుడిగానూ పరిచయం అవుతున్నారు. దసరా ఫెస్టివల్‌ను పురస్కరించుకుని.. తాజాగా ఈ సినిమాలోని ఓ స్టన్నింగ్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌తో ‘డెవిల్’ టైటిల్ ట్రెండ్ అవుతోంది.

Devil: ‘డెవిల్’ స్టన్నింగ్‌ పోస్టర్‌.. సీక్రెట్‌ ఏజెంట్‌ ఏం ఉన్నాడులే..
Nandamuri Kalyan Ram in Devil Movie

వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ.. హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని కల్యాణ్‌రామ్‌ సొంతం చేసుకున్నారు. పాత్రలను, కథలను ఆయన ఎంపిక చేసుకునే విధానం అందరినీ మెస్మరైజ్‌ చేస్తుంది. కెరీర్‌ బిగినింగ్‌ నుంచే ప్రయోగాలకు వెనకాడకుండా, ఆత్మస్థైర్యంతో తనదైన అభిరుచిని ప్రదర్శిస్తూ స్కిప్ట్‌లు సెలక్ట్ చేసుకుంటుంటారు నందమూరి కల్యాణ్‌రామ్‌ (Nandamuri Kalyan Ram). ఇప్పుడు ‘డెవిల్‌’ (Devil)తోనూ ఆ విషయాన్ని మరోసారి నిరూపించడానికి సిద్ధమవుతున్నారు. డెవిల్‌ అనే ఫెరోషియస్‌ టైటిల్‌తో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించేశారు కల్యాణ్‌రామ్‌. ద బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ అనే ట్యాగ్‌లైన్‌తో దూసుకొచ్చేస్తోంది డెవిల్‌. అభిషేక్‌ నామా నిర్మాతగా, దర్శకుడిగా తెరకెక్కుతున్న చిత్రం డెవిల్‌.

ఇటీవల విడుదలైన డెవిల్‌ టీజర్‌ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అనేలా అంచనాలు పెంచేసింది. ఈ ఏడాది నవంబర్‌ 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇటీవల మాళవిక నాయర్‌, ఎల్నాజ్‌ నరౌజి పోస్టర్లు విడుదలయ్యాయి. ప్రతి పోస్టర్ సినిమాపై క్రేజ్ పెంచగా.. తాజాగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఓ స్పెషల్‌ పోస్టర్‌ వదిలారు. ఈ పోస్టర్‌లో కల్యాణ్‌రామ్‌ డైనమిక్‌గా కనిపిస్తున్నారు. పార్టీకి రెడీ అయినట్టు స్పెషల్‌ టుక్సెడోలో అదుర్స్ అనిపిస్తున్నారు. ‘చెడుపై మంచి సాధించిన విజయాన్ని పర్వదినంగా జరుపుకుందాం. అందరికీ దసరా పర్వదిన శుభాకాంక్షలు. అందరి జీవితాల్లోనూ ఆనందాలు, శుభాలు వెల్లివిరియాలి’ అని ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపారు. (Stunning Poster From Devil Out)


Devil.jpg

టాలీవుడ్ టాప్ బ్యానర్స్‌లో ఒకటిగా పేరొందిన అభిషేక్‌ పిక్చర్స్ ఈ ‘డెవిల్‌’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో.. గ్రాండ్‌గా తెరకెక్కిస్తోంది. సినిమా చూసే ప్రేక్షకులకు నయనానందం కలిగించడానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌ గాంధీ నడికుడికార్‌ క్రియేట్‌ చేసిన విజువల్స్ స్టన్నింగ్‌గా అనిపిస్తాయి. అత్యద్భుతమైన దృశ్యాలను చూసిన అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుందని అంటున్నారు మేకర్స్. సౌందర రాజన్‌.యస్‌. కెమెరా పనితనం, తమ్మిరాజు ఎడిటింగ్‌ సినిమాకు సిల్వర్‌ స్క్రీన్‌ మీద గొప్ప జీవం పోసేలా ఉంటాయి. పీరియడ్‌ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ ‘డెవిల్‌’కు సంబంధించి త్వరలోనే మరిన్ని విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంటామని అంటున్నారు మేకర్స్. (Devil Movie)


ఇవి కూడా చదవండి:

============================

*Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’ సక్సెస్‌పై బాలకృష్ణ ఏమన్నారంటే..

*********************************************

*Saripodhaa Sanivaaram: వాడ్ని ఎవరైనా ఆపాలని అనుకోగలరా? అనుకున్నా.. ఆపగలరా?

********************************************

*Game Changer: హమ్మయ్యా.. ఎట్టకేలకు ‘గేమ్ ఛేంజర్’ అప్‌డేట్

*******************************************

Updated Date - 2023-10-24T19:17:59+05:30 IST