Kannappa: మంచు విష్ణు ‘కన్నప్ప’కు ‘జవాన్, బాహుబలి’ టచ్..

ABN , First Publish Date - 2023-11-04T17:56:08+05:30 IST

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా మరోసారి పాన్ ఇండియా స్థాయిలో ట్రెండ్ అవుతోంది. ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి భారీ తారాగణంతో ఇప్పటికే ‘కన్నప్ప’ పాన్ ఇండియాని చేరగా.. ఇప్పుడు అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఈ సినిమా కోసం రంగంలోకి దిగారు. ‘బాహుబలి, జవాన్, పొన్నియిన్ సెల్వన్’ వంటి భారీ ప్రాజెక్టు‌లకు ఫైట్స్ కంపోజ్ చేసిన కెచా.. ఈ సినిమాకు వర్క్ చేయబోతున్నారు.

Kannappa: మంచు విష్ణు ‘కన్నప్ప’కు ‘జవాన్, బాహుబలి’ టచ్..
Kannappa Location Pic

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) సినిమా మరోసారి పాన్ ఇండియా స్థాయిలో ట్రెండ్ అవుతోంది. ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి భారీ తారాగణంతో ఇప్పటికే ‘కన్నప్ప’ పాన్ ఇండియాని చేరగా.. ఇప్పుడు అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఈ సినిమా కోసం రంగంలోకి దిగారు. ‘బాహుబలి, జవాన్, పొన్నియిన్ సెల్వన్’ వంటి భారీ ప్రాజెక్టు‌లకు ఫైట్స్ కంపోజ్ చేసిన కెచా.. ఇప్పుడీ సినిమాకు పోరాట సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కెచా (Kecha Khamphakdee) కంపోజ్ చేసిన పోరాట సన్నివేశాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిన విషయం తెలియంది కాదు.

గతంలో కెచా చేసిన పోరాట సన్నివేశాల కంటే.. ‘కన్నప్ప’ కోసం ఆయన కంపోజ్ చేయబోయే సీక్వెన్సులు ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెట్టేస్తాయని చిత్ర బృందం తెలుపుతోంది. మంచు విష్ణు ఈ కన్నప్ప సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ప్రాచీన యుద్దాలను మళ్లీ తెరపైకి తీసుకురానున్నారు. నాడు వాడిన ఆయుధాలు, జరిగిన పోరాటాలు, హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌తో కన్నప్పను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ప్రేక్షకులను థ్రిల్ చేసే పోరాట సన్నివేశాలెన్నో ఈ చిత్రంలో ఉంటాయని.. వాటిని కెచా అద్భుతంగా కంపోజ్ చేయబోతున్నారని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (Kannappa Latest Update)


Kecha.jpg

కెచా రాకతో ‘కన్నప్ప’ మరోస్థాయికి వెళ్లిందని.. ఈ సినిమాను చూసే ప్రేక్షకులకు కచ్చితంగా కొత్త అనుభూతి కలుగుతుందని కన్నప్ప టీమ్ బల్లగుద్ది మరీ చెబుతోంది. థాయ్ లాండ్, హాంకాంగ్ వంటి దేశాల నుంచి 80 మంది ఫైటర్లు ఈ సినిమా కోసం పనిచేయబోతున్నారట. వారందరితో కెచా కంపోజ్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు మాస్టర్ పీస్‌లా ఉండి, ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేయనున్నాయని అంటున్నారు. కాగా.. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. (Kannappa Movie)


ఇవి కూడా చదవండి:

========================

*Karthi: ‘ఖైదీ’ ఎలా సర్‌ప్రైజ్ చేసిందో.. ‘జపాన్’ కూడా అంతే..

***************************************

*Satyabhama: ‘సత్యభామ’గా కాజల్.. టీజర్ ఎప్పుడంటే?

***************************************

*Bharateeyudu 2: భారతీయుడు ఈజ్ బ్యాక్.. ఇక లంచగొండులకు మూడినట్టే!

**************************************

Updated Date - 2023-11-04T17:56:09+05:30 IST