Kushi Song: ‘ఆరాధ్య.. నువ్వేలేని ఏదీ వద్దు ఆరాధ్య’.. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా..

ABN , First Publish Date - 2023-07-12T19:00:45+05:30 IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ బ్యూటీ సమంత కలిసి నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. ఈ సినిమాకు సంబంధించి రీసెంట్‌గా ఫస్ట్ సింగిల్ ‘నా రోజా నువ్వే’ అంటూ వచ్చిన సాంగ్ ప్రేమికులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ‘ఆరాధ్య’ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట కూడా మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంది.

Kushi Song: ‘ఆరాధ్య.. నువ్వేలేని ఏదీ వద్దు ఆరాధ్య’.. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా..
Vijay and Samantha in Kushi

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), టాలెంటెడ్ బ్యూటీ సమంత (Samantha) కలిసి నటిస్తున్న చిత్రం ‘ఖుషి’ (Kushi). ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. ఈ సినిమాకు సంబంధించి రీసెంట్‌గా ఫస్ట్ సింగిల్ ‘నా రోజా నువ్వే’ (Naa Roja Nuvve) అంటూ వచ్చిన సాంగ్ ప్రేమికులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ పాట టాప్‌లోనే ఉండటం విశేషం. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆరాధ్య (Aradhya) అంటూ సాగే ఈ పాట ఇప్పుడు ప్రేమికుల గీతంగా, మళ్లీ మళ్లీ వినాలనిపించేలా సంగీత దర్శకుడు కంపోజ్ చేశారు.


‘‘నాతో రా.. నీలా రా.. ఆరాధ్య

పదము నీవైపిలా.. పరుగు నీదే కదా..

తనువు తెరమీదుగా.. చెరుకో తరమా..

మనసారా, చెలితారా.. నా గుండెను మొత్తం తవ్వి తవ్వి

చందనమంతా చల్లగా దోచావే..

ఏ వందలకొద్ది పండగలున్నా.. వెన్నెల మొత్తం నిండుగ ఉన్నా..

ఆరాధ్య.. నా ఆరాధ్య.. నువ్వేలేనీ ఏదీ వద్దు ఆరాధ్య.. ’’ అంటూ సాగిన ఈ పాటను కూడా దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) తెలుగులో రాయగా.. తమిళంలో మదన్ కార్కీ సాహిత్యాన్ని అందించాడు. తెలుగు, తమిళంలో సిధ్ శ్రీరామ్, చిన్మయి ఆలపించారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన బాణీ శ్రోతలకు వినసొంపుగా ఉంది. ఈ పాటలో సమంత, విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ మరింతగా హైలెట్ అవుతోంది. మరీ ముఖ్యంగా ఈ పాటకి అనుగుణంగా శివ నిర్వాణ కొరియోగ్రఫీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

Vijay-and-Samantha.jpg

మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రతీ అప్డేట్‌ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఈ పాటకు మ్యూజిక్ లవర్స్ అంతా ఫిదా అవుతున్నారు. ఇప్పటికే వచ్చిన ‘నా రోజా నువ్వే’ అనే పాట యూట్యూబ్‌లో వంద మిలియన్లకు చేరువలో ఉంది. ఇప్పుడు ఈ సెకండ్ సింగిల్‌ ‘ఆరాధ్య’తో మరోసారి ‘ఖుషి’ సినిమా టాప్‌లో ట్రెండ్ అవుతోంది. చార్ట్ బస్టర్ లిస్ట్‌లో చేరేలా ఆరాధ్యను స్వరపరిచారు. సెప్టెంబర్ 1న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.


ఇవి కూడా చదవండి:

**************************************

*Gandheevadhari Arjuna: అర్జునుడి రథంలోని అశ్వాల శక్తి సామర్థ్యాలను తెలియజేసేలా..

**************************************

*Mahaveerudu: ‘మహావీరుడు’‌కి మాస్ మహారాజా సపోర్ట్.. ఏం చేశాడో తెలుసా?

**************************************

*Mark Antony: విశాల్ ‘మార్క్ ఆంటోని’ విడుదల తేదీ ఫిక్సయింది

**************************************

*Nani30: ఫస్ట్ లుక్, గ్లింప్స్ వచ్చేది ఎప్పుడంటే..

**************************************

Updated Date - 2023-07-12T19:00:45+05:30 IST