Vishal: న్యాయస్థానం కంటే గొప్ప వ్యక్తిగా భావించొద్దు.. విశాల్‌కు హైకోర్టు చురకలు

ABN , First Publish Date - 2023-09-23T11:23:43+05:30 IST

తనను తాను న్యాయస్థానాల కంటే గొప్ప వ్యక్తిగా విశాల్‌ భావించవద్దని, కోర్టుల విషయంలో ప్రతి ఒక్కరూ సమానమేనని హైకోర్టు హితవు పలికింది. శుక్రవారం విశాల్ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి పీటీ ఆషా... కోర్టు ఆదేశం మేరకు ఆస్తుల జాబితాను సమర్పించని విశాల్‌పై ఎందుకు చర్యలు తీసుకోకూడదు అంటూ ప్రశ్నించారు.

Vishal: న్యాయస్థానం కంటే గొప్ప వ్యక్తిగా భావించొద్దు.. విశాల్‌కు హైకోర్టు చురకలు
Hero Vishal

తనను తాను న్యాయస్థానాల కంటే గొప్ప వ్యక్తిగా విశాల్‌ (Vishal) భావించవద్దని, కోర్టుల విషయంలో ప్రతి ఒక్కరూ సమానమేనని హైకోర్టు హితవు పలికింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ (Lyca Productions)కు విశాల్‌ చెల్లించాల్సిన రూ. 21.29 కోట్లను తిరిగి చెల్లించే వ్యవహారం ఇప్పుడు కోర్టులో సాగుతోంది. ఈ కేసుల విచారణలో భాగంగా తొలుత రూ. 15 కోట్లు డిపాజిట్‌ చేయాలని, విశాల్‌ తన ఆస్తుల జాబితాను కోర్టుకు సమర్పించాలంటూ గతంలో హైకోర్టు ఆదేశించింది. కానీ, ఆయన పట్టించుకోలేదు. అదే సమయంలో గత విచారణకు విశాల్‌ లేదా ఆయన తరపు న్యాయవాదులు కూడా హాజరుకాలేదు. దీంతో ఈనెల 22వ తేదీ విశాల్‌ స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది.

ఇందులో భాగంగా, శుక్రవారం ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి పీటీ ఆషా (Justice PT Asha)... కోర్టు ఆదేశం మేరకు ఆస్తుల జాబితాను సమర్పించని విశాల్‌పై ఎందుకు చర్యలు తీసుకోకూడదు అంటూ ప్రశ్నించారు. విశాల్‌.. కోర్టుల కంటే గొప్ప వ్యక్తిగా తనను తాను ఊహించుకోరాదని, న్యాయస్థానాల విషయంలో ప్రతి ఒక్కరూ సమానమేనని స్పష్టం చేశారు. ఆ సమయంలో విశాల్‌ తరపు న్యాయవాదులు కల్పించుకుని... పూర్తి వివరాలు పొందేందుకు ఆలస్యమైందని, కోర్టు కోరిన దస్తావేజులను గురువారం ఆన్‌లైన్‌లో సమర్పించినట్టు పేర్కొన్నారు. అప్పుడు జోక్యం చేసుకున్న న్యాయమూర్తి.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అప్‌లోడ్‌ చేయని పక్షంలో తనను కలవాల్సి ఉంటుందని హెచ్చరించారు. (High Court Serious on Vishal)


Vishal-2.jpg

అదే సమయంలో విశాల్‌ తరపున మూడు కార్లు, ఒక బైక్‌, రెండు బ్యాంక్ ఖాతాలు ఉన్నట్టు కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా, విశాల్‌కు సంబంధించిన చర, స్థిర ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా సమర్పించారు (Actor Vishal Assets). 75 యేళ్ళ తండ్రి గ్రానైట్‌ వ్యాపారంలో వచ్చిన నష్టం కారణంగా ఆయన ఇంటి అప్పును కూడా విశాల్‌ తీర్చుతున్నారని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అన్ని దస్తావేజులను సేకరించి కోర్టుకు సమర్పించేందుకు ఆరు రోజుల సమయం కావాలని కోరారు. అయితే, కోర్టు మాత్రం ఈ నెల 25వ తేదీకి కేసు విచారణను వాయిదా వేస్తూ, ఆ విచారణ సమయంలో విశాల్‌ వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపునిచ్చింది.


ఇవి కూడా చదవండి:

============================

*Devil: ‘డెవిల్’లోని ‘మాయే చేసి’ పాట కోసం ఎలాంటి వాయిద్యాలు వాడారో చూశారా?

**************************************

*Kumari Srimathi: నిత్యా మీనన్.. ఈ శ్రీమతి ఇంకా కుమారే.. ఆకర్షణీయంగా ట్రైలర్

************************************

*Producer Atluri Narayana Rao: అక్రమ కేసులు పెట్టి, జైల్లో పెట్టిన బాబును వెంటనే రిలీజ్ చేయాలి

*************************************

*Megastar Chiranjeevi: మెగాస్టార్ సినీ జర్నీకి 45 సంవత్సరాలు.. గ్లోబల్ స్టార్ అభినందనలు

***************************************

*Agent: ఎప్పుడెప్పుడా అనుకుంటున్న ‘ఏజెంట్’ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడోచ్..

*********************************

Updated Date - 2023-09-23T11:23:43+05:30 IST