Megastar Chiranjeevi: మెగాస్టార్ సినీ జర్నీకి 45 సంవత్సరాలు.. గ్లోబల్ స్టార్ అభినందనలు

ABN , First Publish Date - 2023-09-22T19:28:35+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి చిత్ర సీమలోకి ప్రవేశించి 45 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తూ ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Megastar Chiranjeevi: మెగాస్టార్ సినీ జర్నీకి 45 సంవత్సరాలు.. గ్లోబల్ స్టార్ అభినందనలు

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ అభిమానులకు పరిచయం అక్కరలేని పేరు. సామాన్యుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా మెగాస్టార్‌గా చిరంజీవి (Mega Star Chiranjeevi) ఎదిగారు. కొన్ని కోట్ల మందికి స్ఫూర్తినిస్తూ తన అలుపెరుగని ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన చిత్ర సీమలోకి ప్రవేశించి 45 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు.

‘‘సినీ పరిశ్రమలో 45 సంవత్సరాల మెగా జర్నీని పూర్తి చేసుకున్న మన ప్రియమైన మెగాస్టార్‌ (Megastar)కి హృదయపూర్వక అభినందనలు. ఆయన ప్రయాణం ఎంతో గొప్పది. ప్రాణం ఖరీదుతో ప్రారంభమైన ఈ జర్నీలో ఆయన మనల్ని ఇప్పటికీ అబ్బురపరుస్తూనే ఉన్నారు. వెండితెరపై అద్భుతమైన నటనతో, బయట మానవత్వంతో కూడిన మీ కార్యకలాపాలను కొనసాగిస్తూ కొన్ని కోట్ల మందిని ఇన్‌స్పైర్ చేస్తూనే ఉన్నారు. క్రమశిక్షణ, కష్టించే తత్వం, అంకిత భావం వంటి విలువలతో పాటు వాటన్నింటినీ మించి మాలో కరుణను పెంపొందించిన నాన్న మెగాస్టార్ చిరంజీవిగారికి ధన్యవాదాలు’’ అని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో తెలియజేస్తూ.. మెగాస్టార్ సినీ జర్నీకి సంబంధించిన CDPని విడుదల చేశారు. (Ram Charan Post on Mega Star Chiranjeevi 45 Years Cine Journey)


Chiru-1.jpg

రామ్ చరణ్ (Ram Charan) సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన వారంతా మెగాస్టార్‌కు అభినందనలు తెలుపుతూ.. చిరంజీవి ఎలా వారిలో స్ఫూర్తి నింపారో తెలియజేస్తున్నారు. మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్‌ని కూడా తండ్రికి తగ్గ తనయుడు (చిరుత) అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Agent: ఎప్పుడెప్పుడా అనుకుంటున్న ‘ఏజెంట్’ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడోచ్..

*********************************

*Perarasu: అలా చేయడం వల్ల కోలీవుడ్ సినీ కార్మికులు నష్టపోతున్నారు

*********************************

*Tiger Nageswara Rao: అందరినీ భయపెట్టే చీకటినే భయపెడతాడు.. ‘వీడు’

********************************

*Vijay Antony: ‘నా కూతురి చావుతోనే, నేనూ చనిపోయా’.. కన్నీళ్లు పెట్టిస్తోన్న విజయ్ ఆంటోని లేఖ

*******************************

Updated Date - 2023-09-22T19:28:35+05:30 IST