Agent: ఎప్పుడెప్పుడా అనుకుంటున్న ‘ఏజెంట్’ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడోచ్..

ABN , First Publish Date - 2023-09-22T18:13:47+05:30 IST

అఖిల్‌ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ‘ఏజెంట్‌’ చిత్రం ఎట్టకేలకు ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఆల్రెడీ ఒకసారి స్ట్రీమింగ్ డేట్‌ని ప్రకటించి కూడా.. కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా సెప్టెంబర్ 29 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్‌కి సిద్ధమైనట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

Agent: ఎప్పుడెప్పుడా అనుకుంటున్న ‘ఏజెంట్’ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడోచ్..
Agent Movie Still

అఖిల్‌ అక్కినేని (Akhil Akkineni), స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ‘ఏజెంట్‌’ (Agent) చిత్రం ఎట్టకేలకు ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఆల్రెడీ ఒకసారి స్ట్రీమింగ్ డేట్‌ని ప్రకటించి కూడా.. కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. దీంతో అసలీ సినిమా ఓటీటీలో విడుదల అవుతుందా? అనేలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎంతకీ ఈ సినిమా ఓటీటీ వివరాలను మేకర్స్, ఓటీటీ సంస్థ వారు చెప్పకపోవడంతో.. ‘ఏజెంట్’ ఓటీటీ విడుదల గురించి అంతా మరిచిపోయారు కూడా. మరి అంతా మరిచిపోయిన వేళ.. సడెన్‌గా ‘ఏజెంట్’ స్ట్రీమింగ్ డేట్‌ని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం.. సోనీలివ్‌ (SonyLiv) ఓటీటీలో ఈ నెల 29 నుంచి ‘ఏజెంట్’ స్ట్రీమింగ్‌ కాబోతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ వివరాలతో సోనీలివ్‌ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఓ ట్రైలర్‌ను విడుదల చేసింది (Agent Streaming Date Out). దీంతో అంతా.. ఎట్టకేలకు ‘ఏజెంట్’ ఓటీటీ విడుదలకు మోక్షం లభించింది అన్నట్లుగా రెస్పాండ్ అవుతున్నారు. వాస్తవానికి ఈ సినిమా థియేటర్లలో పెద్దగా విజయం సాధించలేదు. ఏప్రిల్‌లో థియేటర్లలోకి వచ్చిన ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసింది.


Akhil.jpg

ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్‌ని సొంతం చేసుకోవడంతో.. జనాలు పెద్దగా ఈ సినిమాని చూసేందుకు ఇంట్రెస్ట్ పెట్టలేదు. అయితే.. అదే టైమ్‌లో ఓటీటీలో వచ్చి ఉంటే మాత్రం.. ‘ఏజెంట్’కు మంచి ఆదరణ దక్కేది. ఎందుకంటే.. ‘ఏజెంట్’ ఓటీటీ విడుదల కోసం జనాలు అలా వేచి చూశారు. కానీ, సోనీలివ్ మొదట అనౌన్స్ చేసిన తేదీకి ఈ సినిమా ఓటీటీలో విడుదల కాలేదు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి ఏవో మార్పులు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి చర్చలు నడిచాయి. కానీ సినిమా మాత్రం విడుదల కాలేదు. దీంతో అంతా ఈ సినిమా ఓటీటీ విడుదల విషయాన్ని వదిలేశారు. మరి చాలా గ్యాప్ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు వస్తున్న ఈ సినిమా.. ఎలాంటి ఆదరణను పొందుతుందో వేచి చూడాల్సిందే. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో స్టార్ హీరో మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటించారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మించారు.


ఇవి కూడా చదవండి:

============================

*Perarasu: అలా చేయడం వల్ల కోలీవుడ్ సినీ కార్మికులు నష్టపోతున్నారు

*********************************

*Tiger Nageswara Rao: అందరినీ భయపెట్టే చీకటినే భయపెడతాడు.. ‘వీడు’

********************************

*Vijay Antony: ‘నా కూతురి చావుతోనే, నేనూ చనిపోయా’.. కన్నీళ్లు పెట్టిస్తోన్న విజయ్ ఆంటోని లేఖ

*******************************

*Cable Reddy: ‘కేబుల్ రెడ్డి’ ఫస్ట్ లుక్ చూశారా..

*******************************

Updated Date - 2023-09-22T18:13:47+05:30 IST