Kumari Srimathi: నిత్యా మీనన్.. ఈ శ్రీమతి ఇంకా కుమారే.. ఆకర్షణీయంగా ట్రైలర్

ABN , First Publish Date - 2023-09-22T22:03:56+05:30 IST

ఓటీటీ స్పేస్‌లో హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని ప్రేక్షకులకు అందివ్వబోతోంది స్వప్న సినిమా బ్యానర్. ఈ బ్యానర్ నిర్మాణంలో అమెజాన్ ప్రైమ్ సిరీస్‌గా ‘కుమారి శ్రీమతి’ రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని ఆవిష్కరించారు. ట్రైలర్ ఆకర్షణీయంగా ఉంది.

Kumari Srimathi: నిత్యా మీనన్.. ఈ శ్రీమతి ఇంకా కుమారే.. ఆకర్షణీయంగా ట్రైలర్
Kumari Srimathi Web Series Still

ఓటీటీ స్పేస్‌లో హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని ప్రేక్షకులకు అందివ్వబోతోంది స్వప్న సినిమా బ్యానర్. ఈ బ్యానర్ నిర్మాణంలో అమెజాన్ ప్రైమ్ సిరీస్‌గా ‘కుమారి శ్రీమతి’ (Kumari Srimathi) రూపుదిద్దుకుంటోంది. వెరీ ట్యాలెంటెడ్, అవార్డ్ విన్నింగ్ నటి నిత్యా మీనన్ (Nithya Menen) ఈ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్‌తో పాటు టీజర్‌ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) విడుదల చేశారు.

ట్రైలర్‌ని బట్టి చూస్తే.. కుమారి శ్రీమతి (నిత్యామీనన్ పేరు శ్రీమతి) తన జీవితంలో ఒక బలమైన ఆశయం కోసం ప్రయత్నించే ధైర్య సాహసాలు కలిగిన మహిళగా కనిపిస్తోంది. జీవితంలో సక్సెస్ కావాలనే తన బలమైన ఆశయాన్ని నెరవేర్చుకునే ప్రక్రియలో ఆమె తన కుటుంబం, గ్రామంలోని పడికట్టు ఆలోచనలని బ్రేక్ చేస్తుంది. ఈ తరానికి చెందిన ఆధునిక మహిళగా నిత్యా మీనన్ మరోసారి తన సహజ నటనను ప్రదర్శించింది. గౌతమి, నరేష్, తాళ్లూరి రామేశ్వరి, మురళీ మోహన్, నిరుపమ్, ప్రణీత పట్నాయక్, తిరువీర్ వంటి ప్రముఖ నటీనటులు ఈ సిరీస్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. (Kumari Srimathi Trailer Out)


దర్శకుడు, నటుడు శ్రీనివాస్ అవసరాల (Srinivas Avasarala) ఈ వెబ్ సిరీస్‌కి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించగా.. గోమటేష్ ఉపాధ్యాయే దర్శకత్వం వహించారు. 7-ఎపిసోడ్స్‌ల సిరీస్‌‌కు స్టాకాటో, కమ్రాన్ పాటలు అందించారు. మోహన కృష్ణ సినిమాటోగ్రాఫర్. లతా నాయుడు ప్రొడక్షన్ డిజైనర్‌గా, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా పని చేశారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించడానికి ‘కుమారి శ్రీమతి’ సెప్టెంబర్ 28న ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రసారం కానుంది. (Kumari Srimathi Movie)


ఇవి కూడా చదవండి:

============================

*Producer Atluri Narayana Rao: అక్రమ కేసులు పెట్టి, జైల్లో పెట్టిన బాబును వెంటనే రిలీజ్ చేయాలి

*************************************

*Megastar Chiranjeevi: మెగాస్టార్ సినీ జర్నీకి 45 సంవత్సరాలు.. గ్లోబల్ స్టార్ అభినందనలు

***************************************

*Agent: ఎప్పుడెప్పుడా అనుకుంటున్న ‘ఏజెంట్’ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడోచ్..

*********************************

*Perarasu: అలా చేయడం వల్ల కోలీవుడ్ సినీ కార్మికులు నష్టపోతున్నారు

*********************************

Updated Date - 2023-09-22T22:03:56+05:30 IST