సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Hero Siddharth: ఓ పెద్దావిడను చూసి భోరున ఏడ్చేసిన సిద్ధార్థ్.. ఆమె ఎవరో తెలుసా?

ABN, First Publish Date - 2023-06-08T21:57:48+05:30

హీరో సిద్ధార్థ్‌ నటించిన చిత్రం ‘టక్కర్’. కార్తీక్ జీ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సిద్ధు సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా జూన్ 9న భారీగా విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సిద్ధార్థ్‌ పాల్గొన్న వేడుకకు ఓ పెద్దావిడ హాజరవగా.. ఆమెను చూసి సిద్ధార్థ్ ఎమోషనల్ అయ్యాడు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది.

Hero Siddharth with Sujatha Rangarajan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాలా గ్యాప్ తర్వాత హీరో సిద్ధార్థ్‌ (Siddharth) నటించిన చిత్రం ‘టక్కర్’ (Takkar). ఈ సినిమా జూన్ 9న భారీగా విడుదల కాబోతోంది. కార్తీక్ జీ క్రిష్ (Karthik G Krish) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సిద్ధు సరసన దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik) హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై అంచనాలను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సిద్ధార్థ్‌ పాల్గొన్న ఈవెంట్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. ఇందులో హీరో సిద్ధార్థ్‌.. ఒక పెద్దావిడను చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు. వెంటనే లేచి ఆమె కాళ్లపై పడి.. భోరున ఏడ్చేశాడు (Siddharth Gets Emotionaled). ఇంతకీ ఎవరా పెద్దావిడ? ఏమా కథ అనే విషయానికి వస్తే..

ఆ పెద్దావిడ పేరు సుజాత రంగరాజన్. సిద్ధార్థ్‌‌ను ‘బాయ్స్’ (Boys) సినిమాలో హీరోగా తీసుకోవాలని శంకర్‌ (Shankar)కు రికమెండ్ చేసింది ఆవిడే. ఈ విషయం ఆమెను చూసిన అనంతరం స్వయంగా సిద్ధార్థే చెప్పుకొచ్చారు. ఆమె కనుక ఆ రోజు రికమెండ్ చేయకపోతే.. ఈ రోజు నా జీవితం ఎలా ఉండేదో ఊహించుకుంటుంటే ఏదోలా ఉంది. ఆమె వల్లే ఈరోజు నేనీ స్థాయిలో ఉన్నానంటూ సిద్ధార్థ్‌ బాగా ఎమోషనల్ అయ్యాడు. ఇటీవల అల్లు అర్జున్‌ (Allu Arjun)కి కూడా ఇటువంటి సంఘటనే ఎదురైంది. అల్లు అర్జున్ తన స్కూల్ డేస్ టీజర్‌ని చూసి.. ఒక్కసారిగా షాకయ్యాడు. ఆ తర్వాత ఆమె ఎవరో, తన విషయంలో ఆమె ఎంతగా సపోర్ట్ అందించిందో తెలియజేశారు. ఇప్పుడు సిద్ధార్థ్‌ కూడా.. అంతకు మించి అనేలా.. సుజాత రంగరాజన్ (Sujatha Rangarajan) విషయంలో స్టన్ అయ్యాడు.

ఇక అల్లు అర్జున్ గురించి ఆయన టీచర్ చెప్పినట్లే.. ఇప్పుడు సిద్ధార్థ్‌ గురించి సుజాత రంగరాజన్ కూడా కొన్ని విషయాలు షేర్ చేశారు (Sujatha Rangarajan about Siddharth). ‘‘మొదటి నుంచి సిద్ధార్థ్‌ దర్శకుడు కావాలని కలలు కంటూ ఉండేవాడు. ఆ సమయంలో ‘బాయ్స్’ సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఆ సినిమాలో హీరోగా సిద్ధార్థ్‌‌ని తీసుకోవాలని నేను శంకర్‌ని కోరాను. ఆయన ఓకే చెప్పి.. ఫొటోషూట్‌కి రమ్మన్నారు. సిద్ధార్థ్‌ వెళ్లడానికి ఇష్టపడలేదు.. నేనే బలవంతంగా ఒప్పించి పంపించాను. అతనని చూసిన వెంటనే ఆ సినిమాలో హీరోగా తీసుకున్నారు..’’ అని సుజాత రంగరాజన్ తెలిపారు. ఇలా ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతో హీరో అయిన సిద్ధార్థ్‌.. ఈరోజు తన కున్న మల్టీ టాలెంట్‌ను ప్రదర్శిస్తూ.. మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇక సుజాత రంగరాజన్‌ను చూసి.. సిద్ధార్థ్‌ రియాక్ట్ అయిన తీరు మాత్రం నెటిజన్లతో ప్రశంసల వర్షం కురిపిస్తోంది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి:

************************************************

*Adipurush: సెన్సార్ పూర్తి.. ఏం సర్టిఫికేట్ వచ్చిందో తెలుసా?

*Bhagavanth Kesari: జూన్ 10న బాలయ్య ఫ్యాన్స్‌కి మాస్ ట్రీట్.. ఇక్కడా 108కి లింక్!

*Sharwanand: రిసెప్షన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన శర్వా..

*Adipurush: తిరుమలలో ‘ఆదిపురుష్’ డైరెక్టర్, హీరోయిన్‌ల వ్యవహారంపై కేసు

*Adipurush: దళితులకు ప్రవేశం లేదు.. ఫేక్ పోస్టర్ హల్‌చల్.. స్పందించిన మూవీ టీమ్

Updated Date - 2023-06-08T21:57:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!