Adipurush: తిరుమలలో ‘ఆదిపురుష్’ డైరెక్టర్, హీరోయిన్‌ల వ్యవహారంపై కేసు

ABN , First Publish Date - 2023-06-08T18:05:13+05:30 IST

దర్శకుడు ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్‌‌ను తిరుమల శ్రీవారి ముఖద్వారం ముందు హగ్ చేసుకుని, కిస్ చేయడంతో.. ఇప్పుడంతటా ఆగ్రహా జ్వాలలు రగులుకున్నాయి. ఎస్వీ యూనివర్సిటీ పిఎస్‌లో డైరెక్టర్ ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్‌పై సనాతధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆదిపురుష్ మరింతగా వివాదంలో చిక్కుకుంది.

Adipurush: తిరుమలలో ‘ఆదిపురుష్’ డైరెక్టర్, హీరోయిన్‌ల వ్యవహారంపై కేసు
Complaint on Adipurush Director and Heroine

అత్యంత వైభవంగా ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకున్న ‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రం.. ఆ వేడుక జరిగిన మరుసటి రోజే పెద్ద వివాదంలో చిక్కుకుంది. దర్శకుడు ఓం రౌత్ (Om Raut).. హీరోయిన్ కృతి సనన్‌ (Kriti Sanon)ను తిరుమల శ్రీవారి ముఖద్వారం ముందు హగ్ చేసుకుని, కిస్ చేయడంతో.. అంతటా ఆగ్రహా జ్వాలలు రగులుకున్నాయి. శ్రీవారి సన్నిధిలో ఇలాంటి తిక్క చేష్టలు ఏమిటంటూ ప్రతి ఒక్కరూ గరం గరం అవుతున్నారు. ఇప్పుడీ వ్యవహారం పోలీసు కేసు వరకు చేరింది. ఈ ఘటనపై సనాతధర్మ పరిరక్షణ సమితి సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎస్వీ యూనివర్సిటీ పిఎస్‌లో డైరెక్టర్ ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్‌పై సనాతధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ఫిర్యాదు చేశారు. తిరుమలలో అసభ్యంగా ప్రవర్తించిన వారిద్దరిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు సనాతధర్మ పరిరక్షణ సమితి సభ్యులు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో ‘ఆదిపురుష్’పై మరింతగా వివాదం ముదిరే అవకాశం ఉంది. మరోవైపు..

Case.jpg

తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఆదిపురుష్ డైరెక్టర్ ఓంరౌత్, హీరోయిన్ కృతి సనన్‌ను కౌగిలించుకొని ముద్దు పెట్టడంపై చిలుకూరు బాలాజీ టెంపుల్ (Chilkur Balaji Temple) ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ (CS Rangarajan) ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలను భూలోక వైకుంఠంగా భావిస్తాం. అటువంటి ప్రదేశంలో ఇలాంటి పనులు ఏంటి? ఆ పనులు సీతారాములను అవమానించడమే అంటూ సీత పాత్రకు కృతి సనన్ సూట్ కాలేదని తెలిపారు. ఇలా అంతటా ‘ఆదిపురుష్’పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకతో ‘ఆదిపురుష్’ ఒక్కసారిగా పాజిటివ్ వైబ్స్‌ని సొంతం చేసుకోగా.. దర్శకుడు, హీరోయిన్ చేసిన చిలిపి చేష్టలతో.. ఇప్పుడా సినిమాపై అంతే స్థాయిలో నెగిటివిటీ పెరిగిపోతోంది.

ఇవి కూడా చదవండి:

************************************************

*Adipurush: దళితులకు ప్రవేశం లేదు.. ఫేక్ పోస్టర్ హల్‌చల్.. స్పందించిన మూవీ టీమ్

*Gandheevadhari Arjuna: వరుణ్ తేజ్ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్సయింది

*Custody: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘కస్టడీ’.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

*Adipurush: తిరుమలలో ఓం రౌత్, కృతి సనన్‌ల హగ్గులు, ముద్దులపై ఎవరెలా రియాక్ట్ అవుతున్నారంటే..?

Updated Date - 2023-06-08T18:05:13+05:30 IST