Bhagavanth Kesari: జూన్ 10న బాలయ్య ఫ్యాన్స్‌కి మాస్ ట్రీట్.. ఇక్కడా 108కి లింక్!

ABN , First Publish Date - 2023-06-08T19:53:55+05:30 IST

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్‌ బ్యానర్‌పై నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది.. నిర్మిస్తోన్న చిత్రం ‘భగవంత్ కేసరి’. బాలయ్య పుట్టినరోజు (జూన్ 10)ని పురస్కరించుకుని.. అదే రోజు ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.

Bhagavanth Kesari: జూన్ 10న బాలయ్య ఫ్యాన్స్‌కి మాస్ ట్రీట్.. ఇక్కడా 108కి లింక్!
NBK in Bhagavanth Kesari

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్‌ (Shine Screens) బ్యానర్‌పై నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది.. నిర్మిస్తోన్న చిత్రానికి ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. జూన్ 10న బాలయ్య పుట్టినరోజును (Balakrishna Birthday) పురస్కరించుకుని రెండు రోజుల ముందే చిత్ర టైటిల్, ఫస్ట్‌‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రానికి ‘ఐ డోంట్ కేర్’ అనేది ట్యాగ్‌‌లైన్. ఈ టైటిల్ పోస్టర్‌‌ అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంటూ ట్రెండ్ అవుతుండగా.. ఇప్పుడు మేకర్స్ మరో మాస్ ట్రీట్‌ని అనౌన్స్ చేశారు.

ఈ సినిమా టీజర్‌‌ను బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న విడుదల చేయనున్నారు. టైటిల్ పోస్టర్‌లాగే టీజర్ విషయంలో కూడా అదే స్ట్రాటజీని మేకర్స్ ఫాలో అవుతున్నారు. టీజర్ ప్రపంచవ్యాప్తంగా 108+ థియేటర్లలో ప్రదర్శించబడుతుందని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే టైటిల్ పోస్టర్‌‌తో సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్‌కి ఈ న్యూస్ మరింత కిక్ ఇవ్వనుంది. నటసింహం (Nata Simham) పుట్టినరోజు అంటే నందమూరి అభిమానులకు పండగే. ఆ పండగరోజు వచ్చే టీజర్‌‌తో అభిమానులు ఆనందానికి అవధులే లేకుండా చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. సంగీత దర్శకుడు థమన్ (S Thaman), అనిల్ రావిపూడిల ట్విట్టర్ సంభాషణను పరిశీలిస్తే.. 10న ఫ్యాన్స్‌కి పూనకాలు ఖాయమని అనిపిస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణను అనిల్ రావిపూడి ఎలా చూపించబోతున్నాడనేది ఇంకా ఆసక్తికరంగా మారింది. (Bhagavanth Kesari Teaser Update)

Bhagavanth-Kesari.jpg

యూనిక్ స్క్రిప్ట్‌‌తో సరికొత్త యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘భగవంత్ కేసరి’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌ (Hyderabad)‌లో జరుగుతోంది. ఇందులో కోర్ టీమ్ పాల్గొంటుంది. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల (Sreeleela) కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun Rampal) ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో ఆయన విలన్‌గా నటిస్తున్నారు. ఈ ‘భగవంత్ కేసరి’ని విజయదశమి (దసరా)కి థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Sharwanand: రిసెప్షన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన శర్వా..

*Adipurush: తిరుమలలో ‘ఆదిపురుష్’ డైరెక్టర్, హీరోయిన్‌ల వ్యవహారంపై కేసు

*Adipurush: దళితులకు ప్రవేశం లేదు.. ఫేక్ పోస్టర్ హల్‌చల్.. స్పందించిన మూవీ టీమ్

*Gandheevadhari Arjuna: వరుణ్ తేజ్ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్సయింది

*Custody: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘కస్టడీ’.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

Updated Date - 2023-06-08T19:53:55+05:30 IST