scorecardresearch

Sharwanand: రిసెప్షన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన శర్వా..

ABN , First Publish Date - 2023-06-08T18:58:27+05:30 IST

టాలీవుడ్ హీరో శర్వానంద్‌- సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రక్షితల వివాహం ఈ నెల 3న జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడీ జంట ఘనంగా రిసెప్షన్‌ను జరుపుకోబోతున్నారు. జూలై 9న హైదరాబాద్‌లో భారీ స్థాయిలో జరగబోతున్న వెడ్డింగ్ రిసెప్షన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను శర్వానంద్ ప్రత్యేకంగా ఆహ్వానించారు.

Sharwanand: రిసెప్షన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన శర్వా..
CM KCR And Sharwanand

టాలీవుడ్ హీరో శర్వానంద్‌ (Sharwanand)- సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రక్షిత (Rakshita)ల వివాహం ఈ నెల 3న జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), సిద్ధార్థ్‌ (Siddharth), అదితిరావు హైదరి (Aditi Rao Hydari)లతోపాటు మరికొందరు సినీ ప్రముఖులు హాజరై, సందడి చేశారు. శర్వా పెళ్లిలో హీరో సిద్ధార్థ్ ఓ పాట కూడా పాడినట్లుగా వీడియో, అలాగే పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లిని అతికొద్ది మంది సమక్షంలో చేసుకున్న శర్వానంద్.. రిసెప్షన్‌ని మాత్రం చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయబోతున్నారు.

KCR-1.jpg

శర్వా, రక్షితల వెడ్డింగ్ రిసెప్షన్ జూలై 9న హైదరాబాద్‌లో భారీ స్థాయిలో జరగబోతోంది. ఈ వేడుకకు తెలంగాణ సీఎం (Telangana CM) కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)ను శర్వానంద్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. సీఎం కేసీఆర్‌ (KCR)ను ప్రగతిభవన్‌లో కలిసి.. రిసెప్షన్‌కు రావాల్సిందిగా శర్వానంద్ కోరారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ను రిసెప్షన్‌కు ఆహ్వానిస్తున్న వీడియో, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇంకా ప్రముఖులెందరినో శర్వానంద్ తన వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.

Sharwa-1.jpg

శర్వానంద్ పెళ్లి విషయానికి వస్తే.. ఆయన పెళ్లాడిని అమ్మాయి పేరు రక్షిత రెడ్డి (Rakshita Reddy). సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఆమె తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె. అంతే కాదు, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు అని కూడా తెలుస్తోంది. జనవరి 26న శర్వానంద్, రక్షిత నిశ్చితార్థం (Engagement) నిరాడంబరంగా జరిగింది. నిశ్చితార్థం ముగిసి నాలుగు నెలలు గడిచినా.. పెళ్లికి సంబంధించి ఎటువంటి వార్తలు బయటికి రాకపోవడంతో.. ఈ మధ్య అనేక రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఆ వార్తలకు బ్రేక్ వేస్తూ.. వెంటనే జూన్ 2,3 తేదీలలో జైపూర్‌లో వివాహం అనేలా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఆ తర్వాత పెళ్లి.. ఇప్పుడు రిసెప్షన్.. ఇది శర్వా పెళ్లి స్టోరి (Sharwanand Marriage Story).

KCR-2.jpg


ఇవి కూడా చదవండి:

************************************************

*Adipurush: తిరుమలలో ‘ఆదిపురుష్’ డైరెక్టర్, హీరోయిన్‌ల వ్యవహారంపై కేసు

*Adipurush: దళితులకు ప్రవేశం లేదు.. ఫేక్ పోస్టర్ హల్‌చల్.. స్పందించిన మూవీ టీమ్

*Gandheevadhari Arjuna: వరుణ్ తేజ్ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్సయింది

*Custody: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘కస్టడీ’.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

*Adipurush: తిరుమలలో ఓం రౌత్, కృతి సనన్‌ల హగ్గులు, ముద్దులపై ఎవరెలా రియాక్ట్ అవుతున్నారంటే..?

Updated Date - 2023-06-08T19:01:59+05:30 IST