Nani: అసలు సిసలు పాన్ ఇండియా యాక్టర్ అతను మాత్రమే.. నాని అలా అనేశాడేంటి?

ABN , First Publish Date - 2023-08-14T11:41:22+05:30 IST

‘పాన్ ఇండియా అనే మాట నాకు పెద్దగా నచ్చదు కానీ నాకు తెలిసిన యాక్టర్స్‌లో పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారా? అంటే అది దుల్కర్‌ సల్మాన్ మాత్రమే..’ అంటూ మరో కాంట్రవర్సీకి నాని తెరలేపాడు. దుల్కర్‌ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా మాస్ ఎంటర్‌టైనర్ ‘కింగ్‌ ఆఫ్‌ కోత’. ఆగస్ట్ 24న ఈ సినిమా విడుదల కాబోతోన్న సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Nani: అసలు సిసలు పాన్ ఇండియా యాక్టర్ అతను మాత్రమే.. నాని అలా అనేశాడేంటి?
Natural Star Nani

‘పాన్ ఇండియా (Pan India) అనే మాట నాకు పెద్దగా నచ్చదు కానీ నాకు తెలిసిన యాక్టర్స్‌లో పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారా? అంటే అది దుల్కర్‌ సల్మాన్ (Dulquer Salmaan) మాత్రమే..’ అంటూ మరో కాంట్రవర్సీకి నాని తెరలేపాడు. దుల్కర్‌ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా మాస్ ఎంటర్‌టైనర్ ‘కింగ్‌ ఆఫ్‌ కోత’. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటించగా.. అభిలాష్ జోషి దర్శకత్వంలో జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రీసెంట్‌గా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్‌లో వుంది. ఆగస్ట్ 24న గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల కాబోతోన్న నేపధ్యంలో తాజాగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హ్యాండ్సమ్ హల్క్ రానా దగ్గుబాటి (Rana Daggubati), నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ.. దుల్కర్‌ తన తెలుగు కెరీర్ స్టార్ట్ చేసినదాంట్లో నా వాయిస్ (ఓకే బంగారం) ప్రముఖ పాత్ర వహించింది. తెలుగులో తన కెరీర్ నెక్స్ట్ లెవల్‌కి వెళుతున్న ఈ తరుణంలో నేను ఈ వేడుకలో వుండటం చాలా ఆనందంగా వుంది. దుల్కర్ జర్నీలో నేను కూడా ఒక భాగం అనే ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది. దుల్కర్‌ చేస్తున్న చిత్రాలని చూస్తుంటే చాలా గర్వంగా వుంది. పాన్ ఇండియా అనే మాట నాకు పెద్దగా నచ్చదు కానీ నాకు తెలిసిన యాక్టర్స్‌లో పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారా.. అంటే అది దుల్కర్‌ మాత్రమే. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం దర్శకులు దుల్కర్ కోసం కథ రాసుకుంటారు. పాన్ ఇండియా యాక్టర్ అనే మాటకు ఇది నిజమైన నిర్వచనమని భావిస్తున్నాను. ఈ సినిమాతో తను నెక్స్ట్ లెవల్‌కి వెళ్లాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. (Nani Speech at King Of Kotha Pre Release Event)

Natural.jpg

అయితే నాని మాట్లాడిన.. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ అనే పదంపై ఆయన మాట్లాడిన తీరు టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులను హర్ట్ చేసింది. దీంతో నానిపై అంతా ఫైర్ అవుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆస్కార్ లెవల్‌కి తీసుకెళ్లిన హీరోలు ఉండగా.. బాహుబలితో ప్రపంచ సినిమా తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన హీరో ఉండగా.. పాన్ ఇండియా అంటే కేవలం దుల్కర్‌కు మాత్రమే వర్తిస్తుందనేలా నాని మాట్లాడటం ఏమంత బాగాలేదంటూ తెలుగు సినిమా అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజమే మరి.. ఇప్పుడు ప్రపంచ సినిమానే తెలుగు సినిమా వైపు చూస్తుందంటే.. అందులో హీరోల పాత్ర ఎంతో కొంత ఉండే ఉంటుంది. అలాంటిది.. పాన్ ఇండియా హీరో, నిర్వచనం అంటూ నాని ఏదేదో మాట్లాడటం తెలుగు సినిమా ఇండస్ట్రీని అవమాన పరిచినట్లే అని ఇండస్ట్రీలోని వారు కూడా మాట్లాడుకుంటుండటం గమనార్హం.


ఇవి కూడా చదవండి:

***************************************

*Vishwak Sen: జీవితంలో మరో కొత్త దశలోకి.. పబ్లిసిటీ స్టంటా లేక నిజంగానే పెళ్లా..?


***************************************

*Renu Desai: రేణు దేశాయ్ విజ్ఞప్తిపై అంబటి రియాక్షన్.. ఫ్యాన్స్ అస్సలు తగ్గట్లే!

***************************************

*SS Rajamouli: అందుకే యూత్‌కు న‌చ్చుతుంది

***************************************

*Vishal Marriage: ఆ హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్నట్లుగా వస్తున్న వార్తలపై విశాల్ క్లారిటీ..

***************************************

Updated Date - 2023-08-14T11:41:22+05:30 IST