Renu Desai: రేణు దేశాయ్ విజ్ఞప్తిపై అంబటి రియాక్షన్.. ఫ్యాన్స్ అస్సలు తగ్గట్లే!

ABN , First Publish Date - 2023-08-11T14:01:58+05:30 IST

‘బ్రో’ సినిమా విషయంలో అంబటి రాంబాబు ఏ విధంగా రియాక్ట్ అయ్యారో.. ఆ సినిమా కలెక్షన్స్‌ చెబుతూ.. ‘బ్రో’ సినిమాని, పవన్ కళ్యాణ్‌ని ఎలా విమర్శించారో తెలియంది కాదు. ఇంకా ఈ కాంట్రవర్సీ కొనసాగుతూనే ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా ఓ రిక్వెస్ట్ చేయగా.. దానికి అంబటి రియాక్ట్ అవుతూ.. ఆమెకి కూడా ఓ సజెషన్ ఇచ్చారు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Renu Desai: రేణు దేశాయ్ విజ్ఞప్తిపై అంబటి రియాక్షన్.. ఫ్యాన్స్ అస్సలు తగ్గట్లే!
Renu Desai and Ambati Rambabu

‘బ్రో’ (Bro) సినిమా విషయంలో అంబటి రాంబాబు (Ambati Rambabu) ఏ విధంగా రియాక్ట్ అయ్యారో.. ఆ సినిమా కలెక్షన్స్‌ చెబుతూ.. ‘బ్రో’ సినిమాని, పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)ని ఎలా విమర్శించారో తెలియంది కాదు. ఇంకా ఈ కాంట్రవర్సీ కొనసాగుతూనే ఉంది. ఆ సినిమాని అక్కడితోనే వదిలేశానని పవన్ కళ్యాణ్ చెప్పినా కూడా.. అంబటి మాత్రం వదలడం లేదు. పవన్ కళ్యాణ్ జీవిత చరిత్రతో ఓ నాలుగైదు సినిమాలు చేస్తానని ప్రకటన కూడా చేశారు. అయితే ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న రేణు దేశాయ్ (Renu Desai).. తాజాగా ఓ వీడియోని షేర్ చేసి.. ఏదైనా ఉంటే పొలిటికల్‌గా తన మాజీ భర్తతో తేల్చుకోండి కానీ.. పెళ్లాలు, పిల్లలని పాలిటిక్స్‌లోకి లాగవద్దంటూ విజ్ఞప్తి చేసింది. ఆమె చేసిన విజ్ఞప్తిపై తాజాగా అంబటి ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.


‘అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని!’.. అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘బ్రో’ సినిమాలో పృథ్వీని శ్యాంబాబు పేరుతో చూపించిన విధానంతో హర్టయిన అంబటి.. సినిమా విడుదలైనప్పటి నుంచి ఏదో రకంగా సినిమాపై మీడియా ముందు మండిపడుతూనే ఉన్నారు. ఇప్పుడు రేణు దేశాయ్ రియాక్ట్ అవడంతో.. అంబటి ఇలా చెప్పుకొచ్చారు. అయితే దీనిపై ఫ్యాన్స్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ‘ప్రజా సమస్యలకి సత్వర ప్రతిస్పందన ఉండదు గానీ, ఇలాంటి వాటికి మాత్రం .. తగ్గేదేలే!’, ‘నీ క్యారెక్టర్ అని నువ్వనుకుంటే ఎలా.. మంత్రి పదవిలో ఉండి నీ శాఖ గురించి ఎప్పుడైనా ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టావా?.. ఇలాంటి విషయాలకు మాత్రం ఎగేసుకుని వస్తున్నావ్’ అంటూ నెటిజన్లు అంబటి ట్వీట్‌కు రిప్లయ్ ఇస్తున్నారు. (Reaction on Ambati Rambabu Tweet)

అసలు రేణు దేశాయ్ వీడియోలో ఏం చెప్పిందంటే.. ‘‘ఈ మధ్య విడుదలైన ఓ సినిమాలోని కొన్ని సీన్స్ వివాదం అయ్యాయని తెలిసింది. ఆ సీన్స్‌ ఏంటనేది నాకు తెలియదు కానీ.. ఇప్పుడు కొందరి మాటలు నా దృష్టికి వచ్చాయి. నా మాజీ భర్త జీవితంపై కొందరు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేయాలని అనుకుంటున్నారట. రాజకీయాల్లో భాగంగా మీరు మీరు ఎన్నైనా విమర్శించుకోండి కానీ మీకు అతని మాజీ భార్యలని, పిల్లలను ఇందులోకి మాత్రం లాగకండి. నేను ఒక అమ్మగా మీ అందరినీ వేడుకుంటున్నాను. నా పిల్లల తండ్రి ఒక నటుడు, రాజకీయనాయకుడు, అందుకని వాళ్ళు కూడా సినీ నేపధ్యం నుండి వచ్చినవాళ్లే. వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు, నా పిల్లలే కాదు, అతని ఇంకో భార్య పిల్లలు కూడా చిన్నవాళ్ళే. వాళ్ళని ఎందుకు ఇందులోకి లాగుతారు, వాళ్ళకి ఏమి సంబంధం. మీరు ఏదో సినిమా, వెబ్ సిరీస్ తీస్తామంటున్నారు, అందులో భార్యల, పిల్లల గురించి కూడా ఉంటుంది అంటున్నారు, దయచేసి వాళ్ళని ఇందులోకి లాగకండి. నా పిల్లలే కాదు ఏ పిల్లలని, ఏ ఆడవాళ్ళని కూడా ఇందులోకి లాగొద్దు. రాజకీయంగా మీరూ మీరూ చూసుకోండి’’ అని రేణు దేశాయ్ ఓ వీడియోలో చెప్పుకొచ్చారు. (Renu Desai Comments)


ఇవి కూడా చదవండి:

***************************************

*SS Rajamouli: అందుకే యూత్‌కు న‌చ్చుతుంది

***************************************

*Vishal Marriage: ఆ హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్నట్లుగా వస్తున్న వార్తలపై విశాల్ క్లారిటీ..

***************************************

*Bholaa Shankar Twitter Talk: ‘భోళా శంకర్’ బొమ్మ పరిస్థితి ఏంటో తెలిసిపోయింది..

***************************************

*OG: పవర్ ‌స్టార్ బర్త్‌డేకి హీట్ వేవ్‌ని ఎదుర్కొనేందుకు సిద్ధమా..

***************************************

Updated Date - 2023-08-11T14:05:31+05:30 IST