Actress Shalini: నా విడాకులు వారికి అంకితం.. డివోర్స్ ఫొటోషూట్‌తో నటి హల్చల్

ABN , First Publish Date - 2023-05-03T11:19:06+05:30 IST

మీరు ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ చూసుంటారు.. వెడ్డింగ్ ఫొటోషూట్ చూసుంటారు.. కానీ కొత్తగా సీరియల్ నటి షాలిని డివోర్స్ ఫొటోషూట్ అంటూ సోషల్ మీడియాలో సంచలనానికి తెరలేపింది.. విషయం ఏమిటంటే..

Actress Shalini: నా విడాకులు వారికి అంకితం.. డివోర్స్ ఫొటోషూట్‌తో నటి హల్చల్
Shalini Divorce Photoshoot

పెళ్ళి అనేది జీవితంలో ఓ ముఖ్యమైన ఘట్టం. భాగస్వామిపై ఎన్నో ఆశలు పెట్టుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. ఆ తర్వాత భాగస్వామితో మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకుంటారు. అలాంటి వారిలో తమిళ బుల్లితెర నటి, ఫ్యాషన్‌ డిజైనర్‌ షాలిని (Shalini) ఒకరు. ‘ముల్లుం మలరుం’ (Mullum Malarum) అనే సీరియల్‌లో నటించి ఆమె మంచి పాపులర్‌ అయ్యారు. ఈమె తాజాగా తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. ఈ విడాకులు మంజూరు కావడంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కేక్‌ కట్‌చేసి మరీ పండుగ చేసుకున్నారు. అంతటితో ఆగలేదు ఈ మధ్య కొత్తగా వెలిసిన ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్‌లా.. ఈ విడాకులకు సంబంధించి కూడా ఆమె ప్రత్యేక ఫొటో షూట్‌ (Divorce Photoshoot) నిర్వహించారు. ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి.

Shalini-1.jpg

రియాజ్‌ (Riyaz) అనే వ్యక్తిని షాలిని గతంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకుని విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా, అవి తాజాగా మంజూరయ్యాయి. దీంతో పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ షాలిని స్పందించారు. ఇప్పుడామె స్పందన, అలాగే ఆమె షేర్ చేసిన ఫొటోలు.. టాక్ ఆఫ్ ద సోషల్ మీడియా (Talk of the Social Media)గా మారాయి. ఇంతకీ షాలిని ఏం చెప్పిందంటే..

Shalini-2.jpg

‘‘విడాకులు తీసుకున్న మహిళలు గట్టిగా మాట్లాడలేరని భావించే వారికి ఇదో సందేశం. ఇష్టం లేని భాగస్వామి నుంచి విడిపోవడమే సరైనది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండటానికి అర్హులు. మీ జీవితాలను మీ చేతుల్లోకి తీసుకోండి. మీ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వండి. విడాకులు తీసుకోవడం ఒక వైఫల్యం కాదు. జీవితానికి ఇదొక మలుపు. ఇది సానుకూల మార్పులకు దారితీస్తుంది. ఒంటరిగా ఉండాలంటే ఎంతో ధైర్యం కావాలి. కాబట్టి ఒంటరిగా ఉండే మహిళందరికీ నా విడాకులను అంకితం చేస్తున్నాను (Shalini Message)’’ అని అన్నారు. ఈ సందర్భంగా ఆమె ‘డైవర్స్‌’ (Divorce) అనే ఆంగ్ల అక్షరాలను పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. తన భర్తతో కలిసి ఉన్న ఫొటోను చింపేశారు. అలాగే, ‘నాకు 99 సమస్యలున్నాయి. కానీ, భర్త ఒక్కటి కాదు’ అంటూ రాసివున్న బోర్డును పట్టుకుని ఫొటోలు దిగి వీటిని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఇదిలా ఉంటే.. ఇదేం పోయే కాలం.. విడాకులకు కూడా ఫొటోషూట్సా అంటూ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Vimanam: మరో ‘బలగం’ అయ్యే లక్షణాలు పుష్కలంగా కనబడుతున్నాయ్..

*I am Salman: సల్మాన్ ఖాన్ ఇలా మారిపోయాడేంటి? గ్రూట్ ఎంత పని చేశావ్..

*JD Chakravarthy: ఆ టైటిల్ కొట్టేద్దామనుకున్నా..

*Heat Trailer Talk: ప్రత్యర్థిని అంచనా వేసేవాడు.. ప్రెజర్‌ను హ్యాండిల్ చేసేవాడే విన్నర్

* The Kerala Story: కథ నిజమని నిరూపించండి.. కోటీశ్వరులు కండి!

*Naga Chaitanya: నా లైఫ్‌లో ఇప్పటి వరకు నేను బాధపడలేదు

Updated Date - 2023-05-03T11:19:06+05:30 IST