Chaitu Vs Sam: చైతూ ఏమో బాధలేదంటాడు.. సమంత ఏమో టార్చర్ టైమ్ అంటోంది.. ఏంటి కథ?

ABN , First Publish Date - 2023-05-03T16:23:03+05:30 IST

రీసెంట్‌గా ‘శాకుంతలం’ (Shaakuntalam) సినిమా ఫ్లాప్ టాక్ రావడానికి కారణం చైతూనే అనేలా కొన్ని గాసిప్స్ కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు చైతూ సినిమా వంతొచ్చింది.. ఇక సమంత గేమ్ స్టార్ట్ చేసినట్లుగా..

Chaitu Vs Sam: చైతూ ఏమో బాధలేదంటాడు.. సమంత ఏమో టార్చర్ టైమ్ అంటోంది.. ఏంటి కథ?
Naga Chaitanya and Samantha

అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), సమంత (Samantha)ల మధ్య విడాకుల అనంతరం చైతూ ఏమో గానీ.. సమంత మాత్రం ఒకానొక దశలో వారి బంధంపై ఫైరయింది. ఇద్దరినీ ఒక గదిలో ఉంచితే.. చుట్టూ ఉన్న పరిసరాలలో కత్తులు, కటార్లు లేకుండా చూసుకోవాలి అనేలా బాలీవుడ్‌ (Bollywood)కి చెందిన ఓ షోలో చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి వీరిద్దరి మాత్రం గొడవలకి పెద్ద కారణమే ఉందనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆ కారణం ఏమిటనేది మాత్రం ఇప్పటి వరకు బయటికి రాలేదు. అయితే వీరిద్దరి చర్యలు, ప్రతి చర్యలు ఇప్పటికీ ఒకరినొకరు రెచ్చగొడుతున్నట్లుగానే అనిపిస్తుండటం గమనార్హం. సమంత సినిమా రిలీజ్ టైమ్‌లో చైతూ కామ్‌గా ఉన్నట్లు కనిపించినా.. ఆయన ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియా వేదికగా.. ఆమెపై కౌంటర్స్ సంధిస్తూనే ఉంటారు. ఇదంతా చైతూకి తెలిసే జరుగుతున్నట్లుగా.. సమంత మరియు ఆమె ఫ్యాన్స్ భావిస్తుంటారు. రీసెంట్‌గా ‘శాకుంతలం’ (Shaakuntalam) సినిమా ఫ్లాప్ టాక్ రావడానికి కారణం చైతూనే అనేలా కొన్ని గాసిప్స్ కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు చైతూ సినిమా వంతొచ్చింది.. ఇక సమంత గేమ్ స్టార్ట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి.

నాగ చైతన్య, వెంకట్ ప్రభు (Venkat Prabhu) కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న చిత్రం ‘కస్టడీ’ (Custody). ఈ సినిమా మే 12వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్‌ను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చైతూ ఓ ఇంటర్వ్యూలో ‘‘నా లైఫ్‌లో ఇప్పటివరకు ఎలాంటి బాధాకరమైన సంఘటనలు లేవు (Worries).. బాధపడలేదు. నాకు ఎదురైన ప్రతి సంఘటన నుంచి నేను ఏదో ఒక పాఠం నేర్చుకుంటూనే ఉన్నాను. కానీ కొన్ని సినిమా కథల (Movie Stories) విషయంలో బాధపడ్డా. ఆ సినిమా కథపై సరైన నిర్ణయం తీసుకోలేకపోయానే అని అనుకుంటూ ఉంటాను. అలాగే ఆ సినిమాలతో ఫ్యాన్స్‌ని ఇబ్బంది పెట్టానే.. అని మాత్రం బాధపడుతుంటాను. ముఖ్యంగా ఇది మూడు సినిమాల విషయంలో జరిగింది’’ అని చెప్పుకొచ్చారు. చైతూ చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్న సందర్భంలో.. సమంత తన ఇన్‌స్టా వేదికగా ‘టార్చర్ టైమ్’ (Torture Time) అంటూ ఓ పోస్ట్ చేసింది. దీంతో వీరిద్దరి మధ్య కవ్వింపు చర్యలు (Cold War) తగ్గలేదనేలా టాక్ మొదలైంది.

Samantha.jpg

సమంత తన ఇన్‌స్టాలో ‘ఇట్స్ టార్చర్ టైమ్’ అంటూ.. ఐస్ బాత్ రికవరీ పేరుతో ఐస్ ట్యూబ్స్ ఉన్న టబ్‌లో తను మునిగిపోయి ఉన్న పిక్‌ని షేర్ చేసింది. అయితే ఇది తనకున్న మయోసైటీస్ (Myositis) వ్యాధి రికవరీ నిమిత్తం చేసిందా? లేదంటే ప్రస్తుతం తను నటిస్తున్న ‘సిటాడెల్’ కోసం చేసిందా అనేది తెలియదు. ఎందుకంటే ‘సిటాడెల్’ (Citadel)లో ఆమె కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లలో నటిస్తోన్న విషయం తెలిసిందే. మరి దేని కోసం అనేది క్లారిటీ లేదు కానీ.. ‘యాక్షన్ మోడ్ ఆన్’ (Action Mode On) అంటూ రెండు బాంబ్‌ ఎమోజీలను కూడా జత చేయడంతో.. ఇది ఖచ్చితంగా చైతూని ఉద్దేశించే అనేలా చైతూ ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తున్నారు. చైతూ మాటలు మీడియాలో బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో సమంత ఇలా కౌంటర్ ఇచ్చిందనేలా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్‌గా ‘చెవులలో జుత్తు’ అంటూ ఆమె ఇన్‌డైరెక్ట్‌గా కొందరిపై పంచ్‌లు పేల్చింది. ఇప్పుడు బాధ లేదంటూ చైతూ అనడం.. ఇంకా అతని సినిమాకు సంబంధించి మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూలు జరగాల్సి ఉండటంతో.. దీనిని ఆమె టార్చర్ టైమ్‌గా పోల్చిందని అంటున్నారు. మరి దీనిపై చైతూ ఫ్యాన్స్ (Chaitu Fans) ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

************************************************

*Hero Shanthanu Bhagyaraj: ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..

*VD12: విజయ్ దేవరకొండ 12వ చిత్రం ప్రారంభం.. చిత్ర విశేషాలివే!

*Parineeti Chopra: ఆప్ ఎంపీతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం.. ఎప్పుడంటే?

*Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం

*Actress Shalini: నా విడాకులు వారికి అంకితం.. డివోర్స్ ఫొటోషూట్‌తో నటి హల్చల్

Updated Date - 2023-05-03T16:23:03+05:30 IST