VD12: విజయ్ దేవరకొండ 12వ చిత్రం ప్రారంభం.. చిత్ర విశేషాలివే!

ABN , First Publish Date - 2023-05-03T14:15:32+05:30 IST

తాజాగా విజయ్ దేవరకొండ 12వ చిత్రాన్ని మేకర్స్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంతో పాటు చిత్రానికి సంబంధించిన చాలా విషయాలను మేకర్స్ రివీల్ చేశారు. అవేంటంటే..

VD12: విజయ్ దేవరకొండ 12వ చిత్రం ప్రారంభం.. చిత్ర విశేషాలివే!
VD12 Movie Launch

రౌడీ హీరో విజయ్ దేవరకొండ 12వ చిత్రం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ‘మళ్లీ రావా’, ‘జెర్సీ’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Gowtham Tinnanuri) దర్శకత్వంలో ఈ చిత్రం ఉండబోతుందని తెలుపుతూ.. ఇంతకు ముందే ఓ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ పోలీస్ అధికారిగా కనిపించారు. అంటే తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఈ సినిమాలో పోలీస్ అధికారి పాత్ర చేయబోతున్నాడనేది ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా చిత్రాన్ని మేకర్స్ ప్రారంభించారు.

Gowtham.jpg

ఈ ప్రారంభోత్సవంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ(చినబాబు) తన చేతుల మీదుగా స్క్రిప్ట్‌ని చిత్ర బృందానికి అందజేశారు. ముహూర్తపు షాట్‌కి ప్రగతి ప్రింటర్స్ ఎండీ పరుచూరి మహేంద్ర కెమెరా స్విచాన్ చేయగా, హానరరీ కౌన్సిల్ జనరల్ ఆఫ్ సౌత్ కొరియా చుక్కపల్లి సురేష్ క్లాప్ కొట్టారు. ఈ ప్రారంభోత్సవంతో పాటు చిత్రానికి సంబంధించిన చాలా విషయాలను మేకర్స్ రివీల్ చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర విశేషాల్లోకి వెళితే.. (Vijay Deverakonda and Gowtham Tinnanuri Film Launched)

Vijay-1.jpg

హీరోయిన్‌గా శ్రీలీల (Sreeleela):

ఇప్పటికే పలు ప్రాజెక్టులతో క్షణం తీరికలేని తారగా మారిపోయిన శ్రీలీల.. ఈ చిత్రంలోనూ హీరోయిన్‌గా సెలక్ట్ అయింది. ప్రస్తుతం శ్రీలీల పవన్ కల్యాణ్, మహేష్ బాబు, బాలకృష్ణ, రామ్, నితిన్, వైష్ణవ్ తేజ్ వంటి వారి చిత్రాలలో నటిస్తోంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో తెరకెక్కతోబోన్న ఈ ప్రాజెక్ట్‌లో సైతం ఆమెనే హీరోయిన్. చిత్ర ప్రారంభోత్సవానికి కూడా ఆమె హాజరైంది.

Vijay-4.jpg

అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీత సారథ్యం..

ఇంతకు ముందు గౌతమ్ తిన్ననూరి ‘జెర్సీ’ చిత్రానికి సంగీతం అందించిన అనిరుధ్ (Anirudh) ఈ చిత్రానికి కూడా సంగీతం అందించబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంతో అనిరుధ్ ఎటువంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాల్సి ఉంది.

Vijay-3.jpg

రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..

ఈ చిత్ర ప్రారంభోత్సవంలోనే.. సినిమా రెగ్యులర్ షూట్ ఎప్పుడు మొదలవుతుందనే విషయాన్ని మేకర్స్ స్పష్టం చేశారు. జూన్ 2023 నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఖుషి’ (Kushi) సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే శ్రీలీల కూడా ఇప్పుడు బిజీ హీరోయిన్. జూన్‌లో ప్రారంభమయ్యే రెగ్యులర్ షూట్‌లో విజయ్, శ్రీలీల కాంబినేషన్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య (Sai Soujanya) నిర్మాతలు.

Vijay-2.jpg

ఇవి కూడా చదవండి:

************************************************

*Parineeti Chopra: ఆప్ ఎంపీతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం.. ఎప్పుడంటే?

*Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం

*Actress Shalini: నా విడాకులు వారికి అంకితం.. డివోర్స్ ఫొటోషూట్‌తో నటి హల్చల్

*Vimanam: మరో ‘బలగం’ అయ్యే లక్షణాలు పుష్కలంగా కనబడుతున్నాయ్..

*I am Salman: సల్మాన్ ఖాన్ ఇలా మారిపోయాడేంటి? గ్రూట్ ఎంత పని చేశావ్..

*JD Chakravarthy: ఆ టైటిల్ కొట్టేద్దామనుకున్నా..

Updated Date - 2023-05-03T14:26:26+05:30 IST