SVC: చిన్న దర్శకుడితో దిల్ రాజు చిత్రం.. మ్యాటర్ గట్టిగానే ఉండి ఉంటుంది

ABN , First Publish Date - 2023-09-25T20:13:59+05:30 IST

వైవిధ్యమైన కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ.. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటంలో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. తాజాగా ఆయన ‘రాజావారు రాణిగారు’ చిత్ర దర్శకుడితో ఓ సినిమా చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

SVC: చిన్న దర్శకుడితో దిల్ రాజు చిత్రం.. మ్యాటర్ గట్టిగానే ఉండి ఉంటుంది
Dil Raju, Shirish and Ravi Kiran Kola

వైవిధ్యమైన కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ.. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటంలో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు (Dil Raju), శిరీష్ (Shirish) ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. ఓ వైపు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations) బ్యానర్‌పై స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే.. మరోవైపు దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డిఫరెంట్ సినిమాలను రూపొందిస్తున్నారు. తాజాగా దిల్ రాజు నిర్మాతగా.. ‘రాజావారు రాణిగారు’ (Raja Varu Rani Garu) దర్శకుడు రవి కిరణ్ కోలా (Ravi Kiran Kola)తో ఓ సినిమాను చేయబోతున్నారు. నిజంగా ఇది ఊహించని సినిమా అనే చెప్పుకోవాలి.

ఎందుకంటే.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌‌లో స్టార్ హీరోలు, స్టార్ దర్శకులతో మాత్రం సినిమాలు చేస్తున్న దిల్ రాజు.. ఇప్పుడు రవి కిరణ్‌తో సినిమా అంటే.. మంచి కథ లభించి ఉంటుందని అనుకుంటున్నారు. ‘రాజావారు రాణిగారు’ సినిమా తర్వాత ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాకు షోరన్నర్‌గా రవి కిరణ్ కోలా వ్యవహరించారు. ఇప్పుడు ప్రతిష్టాత్మక బ్యానర్‌లో తెరకెక్కబోయే చిత్రం కోసం ఆయన మరోసారి మెగా ఫోన్ పట్టనున్నారు. (SVC Banner)


Ravi-Kiran-Kola.jpg

ఈ ప్రకటనతో మరో వైవిధ్యమైన కథాంశంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించటానికి దిల్ రాజు, శిరీష్, రవి కిరణ్ కోలా సిద్ధమవుతున్నారనేలా అప్పుడే ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. చూద్దాం.. ఏ హీరోతో ఈ సినిమా ఉంటుందో..


ఇవి కూడా చదవండి:

============================

*Janam: రాజకీయ నాయకులతో పాటు జ‌నానికి కూడా చురకలు వేస్తున్నారట..

****************************************

*P Vasu: మా గాడ్ ఫాదర్ ఎన్టీఆరే..

****************************************

*Rambha: ప్లీజ్ ప్లీజ్ స్వామి.. అంటూ దేవుడ్ని ఏం వేడుకుందో చూశారా? వీడియో వైరల్!

****************************************

*Manchu Lakshmi: నా కష్టం.. నా సంపాదన.. నీకేమిరా నొప్పి?.. మంచు లక్ష్మీ ఫైర్!

*****************************************

*Aakasam Dhaati Vasthaava: ‘ఉన్నానో లేనో..’ ఆకట్టుకుంటోన్న మ్యాజికల్ మెలోడీ..

**********************************************

Updated Date - 2023-09-25T20:13:59+05:30 IST