సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Srikanth Odela: హీరో కాదు.. ‘దసరా’ దర్శకుడికి నిర్మాత కాస్ట్‌లీ గిఫ్ట్

ABN, First Publish Date - 2023-04-04T15:00:55+05:30

హీరో నుంచి ‘దసరా’ దర్శకుడికి గిఫ్ట్ వస్తుందని ఊహిస్తున్న సమయంలో.. చిత్ర నిర్మాత షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే..

Dasara Movie Team
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ మధ్య దర్శకులకి హీరోలు కాస్ట్‌లీ గిఫ్ట్స్ ఇస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు.. ఎప్పటి నుంచో ఉంది. హీరోలే కాదు నిర్మాతలు కూడా.. మరీ ముఖ్యంగా బండ్ల గణేష్ (Bandla Ganesh) ఈ సంస్కృతికి తెరలేపాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తే.. ఆ సినిమా తీసిన దర్శకుడి‌కి సర్‌ప్రైజ్ ఇవ్వడం మన హీరోల, నిర్మాతల వంతుగా వస్తుంది. ఇప్పుడలానే ‘దసరా’ (Dasara)తో బంపర్ హిట్ కొట్టిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)కు కాస్ట్‌లీ గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేశారు నిర్మాత. వాస్తవానికి నానికి గత కొంతకాలంగా సరైన హిట్ లేదు. మంచి సినిమాలను చేస్తున్నాడనే పేరు మాత్రం సంపాదించుకుంటున్నాడు కానీ.. కమర్షియల్‌గా మాత్రం నాని (Natural Star Nani) హిట్ కొట్టలేకపోతున్నాడు. అలాంటి నానికి తొలి చిత్రంతోనే మొమరబుల్ హిట్ ఇచ్చాడు శ్రీకాంత్ ఓదెల.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) స్కూల్ నుంచి వచ్చిన ఈ కుర్రాడు.. మొదటి సినిమానే పాన్ ఇండియాగా తెరకెక్కించి.. అందరి మన్ననలను అందుకుంటున్నాడు. గురువు సుకుమార్‌ నుంచి కూడా అద్భుతమైన ప్రశంసలను అందుకున్న దర్శకుడు శ్రీకాంత్‌ని ఇప్పుడు ‘దసరా’ చిత్ర నిర్మాత ఊహించని గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేశారు. సుమారు రూ. 80 లక్షల విలువ చేసే బీఎండబ్ల్యూ కారుని (BMW Car) గిఫ్ట్‌గా ఇచ్చారట. ఈ విషయం తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. అంతా.. హీరో నుంచి ‘దసరా’ దర్శకుడికి గిఫ్ట్ వస్తుందని ఊహిస్తున్న సమయంలో.. ఇలా నిర్మాత అందరికీ షాకిచ్చారు. అందుకు కారణం లేకపోలేదు.

Read Also- Devi Sri Prasad: పెళ్లి ఫిక్సయిందా? ఆ అమ్మాయేనా?


ఇప్పటి వరకు ఎస్‌ఎల్‌వి సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకోలేక పోయాయి. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తున్నా.. కమర్షియల్‌గా మాత్రం నిర్మాత సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఒక్క సినిమా కూడా వర్కవుట్ కాలేదనే చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో ఈ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి. ఇలాంటి సమయంలో.. తన బ్యానర్‌‌కు పాన్ ఇండియా (Pan India) స్థాయిలో పేరు.. తనకు కమర్షియల్‌కు సక్సెస్ ఇచ్చిన శ్రీకాంత్‌‌ని.. నిర్మాత సుధాకర్ ఇలా సర్‌ప్రైజ్ చేశారని అంటున్నారు. శ్రీకాంత్ ఓదెలకు మాత్రమే కాకుండా.. ఈ సినిమాకు పనిచేసిన కీ మెంబర్స్ అందరికీ తలో 10 గ్రాముల గోల్డ్ కాయిన్స్ (Gold Coins) బహుమతిగా ఇచ్చారనేలా టాక్ నడుస్తుంది. ఇదంతా చూస్తుంటే.. నిర్మాత సుధాకర్ చెరుకూరి ‘దసరా’ సక్సెస్‌తో ఎంత ఆనందంగా ఉన్నారో అర్థమవుతుంది. ఇక ‘దసరా’ విషయానికి వస్తే.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ‘దసరా’ కలెక్షన్ల (Dasara Collections) మోత మోగిస్తుంది. సినిమా విడుదలైనప్పటి నుంచి.. ధూమ్ ధామ్‌గా కలెక్షన్స్ రాబడుతూ.. ఇప్పుడు రూ. 100 కోట్లకు చేరువలో ఉంది. ఈ విజయంతో సినిమా యూనిట్ మొత్తం చాలా హ్యాపీగా ఉంది.

ఇవి కూడా చదవండి:

*********************************

*Upasana: బెస్ట్ ఫ్రెండ్స్ సమక్షంలో బేబీ షవర్ పార్టీ.. పిక్స్ వైరల్

*SamanthaRuthPrabhu: నాగ చైతన్య, శోభిత డేటింగ్ వార్తల మీద క్లారిటీ ఇచ్చిన సమంత

*Rashmika Mandanna: ‘రెయిన్‌బో’.. రష్మికకు ప్రమోషన్

Updated Date - 2023-04-04T15:00:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!