SamanthaRuthPrabhu: నాగ చైతన్య, శోభిత డేటింగ్ వార్తల మీద క్లారిటీ ఇచ్చిన సమంత

ABN , First Publish Date - 2023-04-04T13:21:37+05:30 IST

సమంత అందరికీ ఒక క్లారిటీ ఇచ్చేసింది. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ డేటింగ్ వ్యవహారం లో సమంత కామెంట్ చేసిందని మీడియా లో వచ్చిన వార్తలపై సమంత క్లారిటీ గా ఏమి చెప్పింది అంటే...

SamanthaRuthPrabhu: నాగ చైతన్య, శోభిత డేటింగ్ వార్తల మీద క్లారిటీ ఇచ్చిన సమంత

ఈమధ్య సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu), నాగ చైతన్య (Naga Chaitanya), శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) వివిధ వార్తలతో వైరల్ అవుతూనే వున్నారు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ డేటింగ్ చేస్తున్నారు అని వాళ్లిద్దరూ వున్న ఫోటోస్ సాంఘీక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అదే విధంగా ఈమధ్య శోభిత తన చెల్లెలు సమంత (Samantha) పెళ్ళికి విశాఖపట్నం వెళ్లి భావోద్వేగానికి గురి అయితే, సమంత అనగానే నాగ చైతన్య మాజీ భార్య సమంత అని చాలామంది అనుకున్నారు.

samantharuthprabhunew2.jpg

ఇదిలా ఉంటే సమంత సినిమా 'శాకుంతలం' (Shaakuntalam) విడుదల సిద్ధంగా వుంది. ఆ సినిమా ప్రచారం లో భాగంగా సమంత చాల నగరాలు తిరుగుతూ చాలామంది మీడియా వాళ్ళతో మాట్లాడుతోంది. అందువలన ఆమె కూడా బాగానే వైరల్ అవుతోంది. ఇలా ఈ ముగ్గురూ ఒకరితో ఒకరు సంబంధం వున్నా కూడా, ఒకరితో ఒకరు తెలియకుండానే సాంఘీక మాధ్యమాల్లో వీళ్ళ ముగ్గురిని లింక్ పెట్టి ఏవేవో వార్తలు వస్తున్నాయి, వైరల్ కూడా అవుతున్నాయి.

samantharuthprabhunew.jpg

అందులో ప్రధానమైన వార్త ఏంటి అంటే, నాగ చైతన్య, శోభిత ధూళిపాళ డేటింగ్ గురించి సమంత (Samantha) మొదటి సారిగా నోరు విప్పింది అని, ఆమె ఏదో కామెంట్ చేసింది అని, వాళ్లిద్దరూ గురించి మాట్లాడింది అని కొన్ని ప్రముఖ వెబ్ సైట్స్, మీడియా వాళ్ళు రాశారు. అయితే వీటన్నిటికీ కూడా సమంత ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఆమె ఒకే ఒక ముక్కతో సాంఘీక మాధ్యమం లో చెప్పేసింది. 'నేను ఇలా ఎప్పుడూ చెప్పలేదు' (I never said this) అని. అంతే దీనితో అందరికీ ఒక క్లారిటీ ఇచ్చినట్టు అయింది.

nagachaitanyashobita1.jpg

ఆమె 'శాకుంతలం' సినిమా ప్రచారం లో భాగంగా అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలు చెపుతోంది. అందులో ఎవరికీ తోచింది వాళ్ళు రాసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ నాగచైతన్య, శోభిత వ్యవహారం మీదా కూడా కామెంట్ చేసింది అని రాసేశారు. ఇప్పుడు ఆమె నేను ఏమి మాట్లాడలేదు అని ఒక క్లారిటీ ఇవ్వటం తో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసినట్టు అయింది.

ఇవి కూడా చదవండి

Upasana: బెస్ట్ ఫ్రెండ్స్ సమక్షంలో బేబీ షవర్ పార్టీ.. పిక్స్ వైరల్

కృష్ణ, విజయనిర్మల అన్నాచెల్లెళ్లుగా నటించిన సినిమా ఏదో తెలుసా...

Updated Date - 2023-04-04T13:21:38+05:30 IST