CP CV Anand: టాలీవుడ్‌లో మళ్లీ డ్రగ్స్ ప్రకంపనలు.. ‘బేబీ’ టీమ్‌కు నోటీసులు.. పరారీలో హీరో!

ABN , First Publish Date - 2023-09-14T19:08:34+05:30 IST

ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ‘బేబీ’ సినిమాపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ ప్రోత్సహించే విధంగా బేబీ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని.. ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్‌లో రైడ్ చేసినప్పుడు ఉన్న సీన్ చూస్తే.. సేమ్ టు సేమ్ ‘బేబీ’ సినిమాలో ఉన్నట్లే కనిపించాయని సిపి ఆనంద్ ఫైర్ అయ్యారు.

CP CV Anand: టాలీవుడ్‌లో మళ్లీ డ్రగ్స్ ప్రకంపనలు.. ‘బేబీ’ టీమ్‌కు నోటీసులు.. పరారీలో హీరో!
CP CV Anand

ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ‘బేబీ’ (Baby) సినిమాపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ (CV Anand) ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ ప్రోత్సహించే విధంగా బేబీ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని.. ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్‌లో రైడ్ చేసినప్పుడు ఉన్న సీన్ చూస్తే.. సేమ్ టు సేమ్ ‘బేబీ’ సినిమాలో ఉన్నట్లే కనిపించాయని సిపి ఆనంద్ ఫైర్ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సినిమా చూసే నిందితులు ఆ విధంగా పార్టీ చేసుకున్నారు. సినిమాలలో ఇలాంటి సన్నివేశాలు పెట్టి కనీసం హెచ్చరిక కూడా చేయకుండా డైరెక్ట్‌గా ప్లే చేశారు. మేము హెచ్చరించిన తర్వాత యూనిట్ ‘హెచ్చరిక’ లైన్ వేశారు. ఇపుడు ‘బేబీ’ సినిమా ప్రొడ్యూసర్‌కి నోటీసులు ఇస్తాము. ‘బేబీ’ (Baby) సినిమాలో డ్రగ్స్ ఏవిధంగా వినియోగదారుల ఉపయోగించాలనే దృశ్యాలను చూపించారు. ఇలాంటి దృశ్యాలను చిత్రీకరించవద్దని సినిమా రంగానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక నుంచి అన్ని సినిమాలపై మా ఫోకస్ ఉంటుంది. డ్రగ్స్‌కు సంబంధించిన సన్నివేశాలు ఉంటే ఊరుకునేదే లేదు’’ అని తెలుపుతూ.. ‘బేబీ’ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను ప్లే చేసి మరీ సీపీ వివరించారు.


టాలీవుడ్‌లో డ్రగ్స్ ప్రకంపనలు

ఇంకా CP ఆనంద్ మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్లంతా బయటకు వస్తున్నారు. తాజాగా మాదాపూర్‌లో నార్కోటిక్ టీమ్ భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసి.. వారి వద్ద స్వాధీనం చేసుకోన్న సెల్ ఫోన్స్‌ని సీజ్ చేశాము. ఈ కేసులో మొత్తం డ్రగ్స్ బెంగళూరు నుండి వచ్చిందని తెలిసింది. ఒక ప్రత్యేక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోని డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. వీసా గడువు ముగిసినా దేశంలో ఉన్నారు. డ్రగ్స్ కోనుగోలు చేస్తున్న వారిలో వరంగల్ చెందిన వ్యక్తి ఉన్నారని గుర్తించాము. సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నారు. ఇలా విక్రమాలు జరుపుతున్న మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్ రావు‌ని అరెస్ట్ చేశాము. బెంగళూరు (Bangalore)లో 18 మంది నైజీరియన్స్‌ని గుర్తించాము. ఈ కేసులో వినియోగదారుడిగా ఉన్న హీరో నవదీప్ (Navdeep).. ప్రస్తుతం పరారీలో ఉన్నారు’’ అని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

============================

*Devil: సిద్ శ్రీరామ్ పాడిన పాట.. విడుదల ఎప్పుడంటే..

***********************************

*Tamannaah Bhatia: తమన్నాకు ‘జైలర్‌’ నిర్మాత బహుమతి ఏది?

***********************************

*Operation Valentine: మెగా ప్రిన్స్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ తాజా అప్‌డేట్

************************************

*Chota K Naidu: ‘పెదకాపు 1’లో జెండాకర్ర పాతే సీన్.. నేను గర్వంగా చెప్పుకునే ఎపిసోడ్ ఇది

*************************************

Updated Date - 2023-09-14T19:08:38+05:30 IST