Operation Valentine: మెగా ప్రిన్స్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ తాజా అప్‌డేట్

ABN , First Publish Date - 2023-09-13T21:37:45+05:30 IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా.. తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను మొదలెట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Operation Valentine: మెగా ప్రిన్స్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ తాజా అప్‌డేట్
Mega Prince Varun Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) హీరోగా.. తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine). వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ని మేకర్స్ వదిలారు. బుధవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ (Dubbing) కార్యక్రమాలు ప్రారంభమైనట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, వీఎఫ్ఎక్స్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న విడుదల చేయనున్నారు. ప్రేక్షకులకు అత్యుత్తమ అవుట్‌పుట్, గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించడం కోసం టీమ్ అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా నిర్మాతలు తెలుపుతున్నారు. అక్టోబర్ 8 ఎయిర్‌ఫోర్స్‌డే రోజున ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. (Mega Prince Varun Tej Operation Valentine Update)


Operation.jpg

హిందీ, తెలుగు భాషలలో విడుదల కానున్న ఈ విజువల్ వండర్‌తో వరుణ్ తేజ్ హిందీలో అడుగుపెడుతున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా (Shakti Pratap Singh Hada) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మానుషి చిల్లర్ (Manushi Chhillar) రాడార్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Chota K Naidu: ‘పెదకాపు 1’లో జెండాకర్ర పాతే సీన్.. నేను గర్వంగా చెప్పుకునే ఎపిసోడ్ ఇది

*************************************

*A R Rahman: రెహ్మాన్‌కు మద్దతు

************************************

Updated Date - 2023-09-13T21:37:45+05:30 IST