Devil: సిద్ శ్రీరామ్ పాడిన పాట.. విడుదల ఎప్పుడంటే..

ABN , First Publish Date - 2023-09-14T16:59:08+05:30 IST

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్‌లైన్. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘మాయే చేసే’ విడుదలకు సంబంధించిన వివరాలను మేకర్స్ విడుదల చేశారు. సిధ్ శ్రీరామ్ పాడిన ఈ పాట సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది.

Devil: సిద్ శ్రీరామ్ పాడిన పాట.. విడుదల ఎప్పుడంటే..
Devil Movie Still

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ (Nandamuri Kalyan Ram0 హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’ (Devil). ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్‌లైన్. టైటిల్ వింటుంటేనే హీరో సినిమాలో విల‌న్స్‌ను ఏ రేంజ్‌లో ఓ ఆటాడుకుంటాడ‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. అలాగే యాక్ట‌ర్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌లోని ఓ కొత్త కోణాన్ని ఎలివేట్ చేయ‌నుంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. రీసెంట్‌గా విడుద‌లైన ‘డెవిల్’ టీజ‌ర్‌తో ఈ సినిమాపై అప్ప‌టికే ఉన్న అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. న‌వంబ‌ర్ 24న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘మాయే చేసే..’ (Maaye Chesey) అనే పాట‌ విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌ని మేకర్స్ వదిలారు.

సెప్టెంబ‌ర్ 19న ఈ పాటను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లుగా మేక‌ర్స్ తెలియ‌జేశారు. ఐకాన్ మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాట‌ల‌ను మేకర్స్ విడుద‌ల చేస్తున్నారు. అభిషేక్ నామా (Abhishek Nama) ‘డెవిల్’ మూవీని డైరెక్ట్ చేస్తూ నిర్మించారు. ఈ చిత్రంలోని పాట‌లు ప్రేక్ష‌కుల‌ను మంత్ర ముగ్దుల‌ను చేస్తాయి. అందులో నుంచి ‘మాయే చేసే..’ పాటను సెప్టెంబర్ 19న విడుదల చేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమేనని, ప్రేక్షకులకు ఈ మూవీ మంచి మ్యూజికల్ జర్నీని మరుపురాని అనుభూతినిస్తుందని మేకర్స్ తెలిపారు. ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ (Sid Sriram) పాడిన ఈ పాటకు హర్షవర్ధన్ రామేశ్వర్ (Harshavardha Rameshwar) సంగీతాన్ని అందించారు. సత్య ఆర్.వి పాటను రాశారు.


Kalyan-Ram-Devil.jpg

నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ (Samyuktha Menon) అద్భుతమైన పెర్ఫామెన్స్ చేశారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, సినిమా కథ, కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎన్నో మంచి చిత్రాలను అందించిన అభిషేక్ పిక్చర్స్ (Abhishek Pictures) సంస్థ ఈ సినిమాను రూపొందిస్తోంది. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే, క‌థ‌ను అందించారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు. ఈ అప్‌డేట్‌తో ప్రస్తుతం ‘డెవిల్’ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

============================

*Tamannaah Bhatia: తమన్నాకు ‘జైలర్‌’ నిర్మాత బహుమతి ఏది?

***********************************

*Operation Valentine: మెగా ప్రిన్స్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ తాజా అప్‌డేట్

************************************

*Chota K Naidu: ‘పెదకాపు 1’లో జెండాకర్ర పాతే సీన్.. నేను గర్వంగా చెప్పుకునే ఎపిసోడ్ ఇది

*************************************

Updated Date - 2023-09-14T16:59:08+05:30 IST