Tamannaah Bhatia: తమన్నాకు ‘జైలర్‌’ నిర్మాత బహుమతి ఏది?

ABN , First Publish Date - 2023-09-14T15:52:35+05:30 IST

నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా సన్‌ పిక్చర్స్‌ బ్యానరుపై వచ్చిన ‘జైలర్‌’ చిత్రం మెగా బ్లాక్‌బస్టర్‌ సాధించింది. ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టడంతో ఆ చిత్రం నిర్మాత కళానిధి మారన్‌ ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఈ సంతోషంలో హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడికి కార్లు గిఫ్ట్‌గా ఇచ్చారు. కానీ తమన్నా, రమ్యకృష్ణలకు ఏ బహుమతి ఇవ్వకపోవడంతో.. నిర్మాతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tamannaah Bhatia: తమన్నాకు ‘జైలర్‌’ నిర్మాత బహుమతి ఏది?
Tamannaah Bhatia In Jailer

నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Super Star Rajinikanth) హీరోగా సన్‌ పిక్చర్స్‌ బ్యానరుపై వచ్చిన ‘జైలర్‌’ (Jailer) చిత్రం మెగా బ్లాక్‌బస్టర్‌ సాధించింది. ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టడంతో ఆ చిత్రం నిర్మాత కళానిధి మారన్‌ (Kalanithi Maran) ఎంతో హ్యాపీగా ఉన్నారు. అదేసమయంలో ‘జైలర్‌’లో నటించిన నటీనటులతో టెక్నీషియన్లకు బహుమతులు ఇచ్చారు. హీరో రజనీకి కోటిన్నర రూపాయల విలువ చేసే బీఎండబ్ల్యూఎక్స్‌7 సిరీస్‌ లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చారు.

ఇదే విధంగా దర్శకుడు నెల్సన్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్‌కు కూడా లగ్జరీకార్లు ఇచ్చారు. తాజాగా ఆ చిత్రంలో నటించిన నటీనటులకు, టెక్నీషియన్లకు ‘జైలర్‌’ బంగారు నాణేలను బహూకరించారు. అయితే, ఇందులో ప్రత్యేక గీతంలో తన అందచందాలు ఆరబోసి నర్తించిన మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia)కు ఎలాంటి బహుమతి ఇవ్వకపోగా, ఆమెను అస్సలు పట్టించుకోలేదనే ప్రచారం సాగుతుంది. అదేవిధంగా హీరోయిన్‌గా నటించిన రమ్యకృష్ణన్‌ (Ramyakrishnan)కు నిర్మాత బహుమతి ఇవ్వలేదు.


Tamanna-Pic.jpg

దీంతో నిర్మాతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం వారు అందుబాటులో లేక ఎటువంటి బహుమతి (Gift) పంపలేదా? లేదంటే, కావాలనే వాళ్లని సైడ్ పెట్టేశారా? అని కోలీవుడ్ (Kollywood) మీడియాలో సైతం వార్తలు వినిపిస్తుండటం విశేషం. దీనిపై నిర్మాత ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే ఈ విషయంలో నిర్మాణ సంస్థపై గట్టిగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

============================

*Operation Valentine: మెగా ప్రిన్స్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ తాజా అప్‌డేట్

************************************

*Chota K Naidu: ‘పెదకాపు 1’లో జెండాకర్ర పాతే సీన్.. నేను గర్వంగా చెప్పుకునే ఎపిసోడ్ ఇది

*************************************

*A R Rahman: రెహ్మాన్‌కు మద్దతు

************************************

Updated Date - 2023-09-14T16:07:05+05:30 IST