Game Changer: హమ్మయ్యా.. ఎట్టకేలకు ‘గేమ్ ఛేంజర్’ అప్‌డేట్

ABN , First Publish Date - 2023-10-23T21:31:41+05:30 IST

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’. ఎన్నో సూప‌ర్ డూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను రూపొందించిన నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ఈ మూవీని నిర్మిస్తోంది. ద‌స‌రా సంద‌ర్భంగా మేక‌ర్స్ ‘గేమ్ ఛేంజ‌ర్’ సినిమాకు సంబంధించి స‌రికొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. దీపావళికి ఫస్ట్ సింగిల్ ‘జరగండి’ని విడుదల చేయబోతున్నారు.

Game Changer: హమ్మయ్యా.. ఎట్టకేలకు ‘గేమ్ ఛేంజర్’ అప్‌డేట్
Ram Charan in Game Changer

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Global Star Ram Charan) హీరోగా సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ (Shankar) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’ (Game Changer). ఎన్నో సూప‌ర్ డూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను రూపొందించిన నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ (SVC) బ్యాన‌ర్ ఈ మూవీని నిర్మిస్తోంది. భారీ బ‌డ్జెట్‌తో నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ అన్ కాంప్ర‌మైజ్డ్‌గా అంచ‌నాల‌కు ధీటుగా గేమ్ చేంజ‌ర్‌ను నిర్మిస్తున్నారు. RRR వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) చేస్తోన్న సినిమా కావ‌టంతో గేమ్ ఛేంజ‌ర్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే ఈ సినిమా అప్‌డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. నిర్మాతకు రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. కానీ, అప్‌డేట్ విషయంలో సెలెన్సే నెలకొంది. అప్‌డేట్ అంటూ అడిగి అడిగి ఫ్యాన్స్‌కు కూడా నీరసం వచ్చేసింది. కనీసం సినిమా విడుదల ఎప్పుడు ఉంటుందో చెప్పండి అంటూ ఫ్యాన్స్ గోల గోల చేస్తుంటే.. ఇటీవల దిల్ రాజు.. అది శంకర్ చేతిలో ఉందంటూ దాటవేశారు. ఇక ఫ్యాన్స్ కోసం ఎట్టకేలకు ఓ అప్‌డేట్‌ను ఈ దసరాను పురస్కరించుకుని మేకర్స్ తెలియజేశారు.

ద‌స‌రా (Dussehra) సంద‌ర్భంగా మేక‌ర్స్ ‘గేమ్ ఛేంజ‌ర్’ సినిమాకు సంబంధించి స‌రికొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. దీంతో పాటు మ‌రో అమేజింగ్ అప్‌డేట్‌ను అందించారు. దీపావ‌ళి (Diwali) సంద‌ర్బంగా ‘గేమ్ ఛేంజ‌ర్’ సినిమా నుంచి తొలి సాంగ్‌ ‘జరగండి’ని విడుద‌ల చేయబోతున్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌ల‌తో పాటు మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ క‌లిసి తొలిసారి వ‌ర్క్ చేస్తున్న గేమ్ ఛేంజ‌ర్ సినిమా నుంచి పాట‌ను పాన్ ఇండియా రేంజ్‌లో దీపావళికి గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేస్తూ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. (Game Changer 1st Single Release Update)


Charan.jpg

ఈ పోస్టర్ కలర్‌ఫుల్‌గా ఉంది. అంతేకాదు, ఇందులో రామ్ చరణ్‌ని బ్యాక్‌సైడ్ నుండి చూపించారు. ట్రెడిషనల్ డ్రస్‌లో రామ్ చరణ్ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. సౌత్ ఇండియ‌న్ సినిమా రేంజ్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లిన సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ మేకింగ్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వసరం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న తెర‌కెక్కించిన సినిమాల‌ను మించేలా ‘గేమ్ ఛేంజ‌ర్‌’ను శంకర్ రూపొందిస్తున్నట్లుగా నిర్మాత దిల్ రాజు చెబుతున్నారు. లార్జ‌ర్ దేన్ లైఫ్ క్యారెక్ట‌ర్‌తో రామ్ చ‌ర‌ణ్‌ను ప్రెజెంట్ చేస్తున్నారు శంక‌ర్‌. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది. త్వరలోనే విడుదలకు సంబంధించిన అప్‌డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది. (Ram Charan Game Changer)


ఇవి కూడా చదవండి:

============================

*Raj Dasireddy: ద్విభాషా చిత్రానికి సిద్ధమవుతోన్న ‘భద్రం బి కేర్‌ఫుల్ బ్రదరూ’ హీరో!

*******************************

*Dussehra: ఉపాస‌న - రామ్‌చ‌ర‌ణ్ దంప‌తులు దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూశారా?

************************************

*Shalini Pandey: ‘అర్జున్ రెడ్డి’ భామకు ఆ తరహా పాత్రలు చేయాలనుందట..

************************************

*Prabhas: శత శతమానం భవతి.. ‘కన్నప్ప’ టీమ్ ‌గ్రాండ్‌గా విషెస్

****************************************

Updated Date - 2023-10-23T21:38:08+05:30 IST