Anasuya: ఓటమిని ఒప్పుకున్న కేటీఆర్.. ప్రేమలో పడ్డానంటూ అనసూయ ట్వీట్

ABN , First Publish Date - 2023-12-03T16:25:53+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో BRS పార్టీ ఓటమిని ఒప్పుకున్నారు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌. తమ ఓటమిని ఒప్పుకుంటూ.. విజయం దిశగా దూసుకెళుతోన్న కాంగ్రెస్‌కు ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు ‘మీరు నిజమైన నాయకుడు సార్’ అంటూ నటి అనసూయ చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.

Anasuya: ఓటమిని ఒప్పుకున్న కేటీఆర్.. ప్రేమలో పడ్డానంటూ అనసూయ ట్వీట్
KTR And Anasuya

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Elections Results 2023) BRS పార్టీ ఓటమిని ఒప్పుకున్నారు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ (KTR). తమ ఓటమిని ఒప్పుకుంటూ.. విజయం దిశగా దూసుకెళుతోన్న కాంగ్రెస్‌కు ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ.. ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్‌ చేశారు. కేటీఆర్ (KTR) చేసిన ట్వీట్‌కు ఆ పార్టీ సానుభూతి పరులు, అభిమానులు అందరూ.. ఓడినా మీ వెంటే మేము అని కామెంట్స్ చేస్తున్నారు. నటి అనసూయ (Actress Anasuya) కూడా కేటీఆర్ ట్వీట్‌కు కామెంట్ పెట్టారు. మీరు నిజమైన నాయకుడు సార్.. ఎందరికో స్ఫూర్తినిచ్చారు అంటూ ఆమె ఇచ్చిన రిప్లయ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

‘‘ఎందరికో స్ఫూర్తి నిచ్చిన మీరు నిజమైన నాయకుడు సార్. కాకపోతే ఇప్పటి నుండి ప్రతిపక్షంలో ఉండి రాష్ట్ర స్థితిని చూడాల్సి ఉంటుంది అంతే. ఇప్పుడు కూడా బలమైన ప్రతిపక్షంగా ఉండి మీరు చేయాల్సింది చేస్తారని ఆశిస్తున్నాను. నేను హైదరాబాద్‌ (Hyderabad)‌ని ప్రేమించేంత గొప్పగా తీర్చిదిద్దిన మీకు ధన్యవాదాలు!’’ అని అనసూయ తన కామెంట్‌లో పేర్కొంది. ఆమె కామెంట్ చూసిన కొందరు.. ధన్యవాదాలు చెబుతుంటే.. ఈసారి మీకు BRS టికెట్ పక్కా.. అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. (Anasuya Comment on KTR Tweet)


Anu.jpg

ఇంతకీ కేటీఆర్ ఏమని ట్వీట్ చేశారంటే..

‘‘బీఆర్‌ఎస్‌కు వరుసగా రెండుసార్లు అధికారాన్ని అందించినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఫలితం గురించి నేను బాధపడటం లేదు. కానీ.. అది మాకు ఆశించిన స్థాయిలో రాలేదని మాత్రం నిరాశ పడ్డాను. దీన్ని ఒక పాఠంగా తీసుకుని తిరిగి మేము పుంజుకుంటాం. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి (Congress Party) అభినందనలు. మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను’’ అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Shah Rukh Khan: ‘డంకీ’ సాంగ్‌పై షారూక్ భావోద్వేగం

************************************

*Dil Raju: ‘యానిమ‌ల్’ త‌ర‌హా చిత్రాల‌ను నేను కూడా నిర్మిస్తా.. కాకపోతే?

*************************************

*Nithiin: నేను సపోర్ట్ చేస్తే.. పవర్ స్టార్ గెలిచేస్తారా?

***********************************

Updated Date - 2023-12-03T16:29:41+05:30 IST