Shah Rukh Khan: ‘డంకీ’ సాంగ్‌పై షారూక్ భావోద్వేగం

ABN , First Publish Date - 2023-12-03T15:03:00+05:30 IST

‘డంకీ’ సినిమా నుంచి ‘నికలె ది కబీ హమ్ ఘర్ సే..’ పాటను డంకీ డ్రాప్ 3 అంటూ తాజాగా మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఆ పాట నా తల్లిదండ్రులను, నా స్నేహితులను, డిల్లీలో నేను గడిపిన నాటి రోజులను గుర్తుకు చేసింది. చాలా ఎమోషనల్ అయ్యానంటూ షారుక్ ఈ పాటపై స్పందించారు.

Shah Rukh Khan: ‘డంకీ’ సాంగ్‌పై షారూక్ భావోద్వేగం
Dunki Movie Still

‘డంకీ’ (Dunki Movie) సినిమా నుంచి ‘నికలె ది కబీ హమ్ ఘర్ సే..’ పాటను డంకీ డ్రాప్ 3 అంటూ తాజాగా మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఇదే స్పందన #AskSrk సెషన్‌లోనూ ప్రత్యేకంగా కనిపించింది. మంచి అవకాశాల కోసం, భవిష్యత్ కోసం.. కుటుంబం, అయిన వారిని విడిచిపెట్టి దేశం దాటి విదేశాల్లో ఉంటున్న వారందరికీ ‘నికలె ది కబీ హమ్ ఘర్ సే’ పాట కనెక్ట్ అయ్యింది. ఇంటికి దూరమైన వారికి స్వదేశానికి వచ్చిన అనుభూతిని కలిగిస్తుండటం విశేషం. ఈ పాట ఇప్పుడందరికీ ఎంతో ప్రత్యేకంగా మారింది. ఈ పాటకు వస్తున్న స్పందన చూసి.. #AskSrk సెషన్‌లో అభిమానులు, నెటిజన్స్‌తో ముచ్చటించేటప్పుడు సోనూ నిగమ్, జావెద్ అక్తర్, ప్రీతమ్‌లకు షారూక్ (Shah Rukh Khan) ధన్యవాదాలు తెలియజేశారు. ‘నికలే ది కబీ హమ్ ఘర్ సే’ పాట డంకీ సినిమాకు ఆత్మలాంటిదని కింగ్ ఖాన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో అభిమానులు ఆయన్ని డంకీ గురించి, నికలే.. పాట గురించి ప్రశ్నలు అడిగారు.

‘సోనూ నిగమ్‌తో కలిసి పని చేయటం ఎలా అనిపించింది’ అని అభిమాని అడిగిన ప్రశ్నకు ‘సోనూ గొంతు బంగారం’ అంటూ షారూక్ బదులిచ్చారు. ‘మీరు నికలే.. పాటతో మమ్మల్ని ఎంతో భావోద్వేగానికి గురయ్యేలా చేశారు. మరి మీ ఎమోషనల్ వీక్ పాయింట్ ఏంటి?’ అని ఓ అభిమాని అడిన ప్రశ్నకు ‘నా కుటుంబం.. నాకే కాదు అందరికీ కుటుంబమే వీక్ పాయింట్ కాదంటారా?’ అని కింగ్ ఖాన్ సమాధానం చెప్పారు. ‘సార్ నికలే.. పాటను విన్నప్పుడు నాకు ముందుగా మా ఇల్లు గుర్తుకొచ్చింది. మీరు తొలిసారి ఈ పాట విన్నప్పుడు అలాగే ఫీలయ్యారా?’ అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు ‘అవును ఆ పాట నా తల్లిదండ్రులను, నా స్నేహితులను, డిల్లీలో నేను గడిపిన నాటి రోజులను గుర్తుకు చేసింది. చాలా ఎమోషనల్ అయ్యాను’ అని బాద్ షా బదులిచ్చారు.


Srk.jpg

‘మీరు ఎప్పుడు ఎంతో వినయంగా ఉంటారు. అందుకు కారణమేంటి?’ అని మరొకరు అడిగిన ప్రశ్నకు ‘ఈ భూమిపై పుట్టి పెరిగిన మనం ఇక్కడే కన్నుమూయాలి. కాబట్టి మన కాళ్లు నేలపై ఉండేలా చూసుకుంటే బావుంటుంది. .. కష్టపడి పని చేయాలి’’ అని షారూక్ బదులిచ్చారు. ‘డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు. ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21న గ్రాండ్‌గా ఈ సినిమా రిలీజ్ కానుంది.


ఇవి కూడా చదవండి:

====================

*Dil Raju: ‘యానిమ‌ల్’ త‌ర‌హా చిత్రాల‌ను నేను కూడా నిర్మిస్తా.. కాకపోతే?

*************************************

*Nithiin: నేను సపోర్ట్ చేస్తే.. పవర్ స్టార్ గెలిచేస్తారా?

***********************************

Updated Date - 2023-12-03T15:03:01+05:30 IST