Nithiin: నేను సపోర్ట్ చేస్తే.. పవర్ స్టార్ గెలిచేస్తారా?

ABN , First Publish Date - 2023-12-02T18:13:16+05:30 IST

పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్స్ కాదు.. భక్తులు ఉంటారని అంతా అంటుంటారు. అలాంటి భక్తులలో మొదటి వరుసలో ఉండే వ్యక్తి హీరో నితిన్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఆయనకి అంత ఇష్టం. ఈ విషయం ఆయనని ఎప్పుడు అడిగినా చెబుతారు. తాజాగా ఆయన నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ప్రమోషనల్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ప్రశ్నలకు నితిన్ ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు.

Nithiin: నేను సపోర్ట్ చేస్తే.. పవర్ స్టార్ గెలిచేస్తారా?
Nithiin and Pawan Kalyan

పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)కు ఫ్యాన్స్ కాదు.. భక్తులు ఉంటారని అంతా అంటుంటారు. అలాంటి భక్తులలో మొదటి వరుసలో ఉండే వ్యక్తి హీరో నితిన్ (Nithiin). పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఆయనకి అంత ఇష్టం. ఈ విషయం ఆయనని ఎప్పుడు అడిగినా చెబుతారు. అంతేకాదు, పవన్ కల్యాణ్‌ని అనుకరిస్తూ పాటలు, సన్నివేశాలు కూడా తన సినిమాలలో చేస్తుంటారు నితిన్. నితిన్ సినిమా విడుదల అవుతుందీ అంటే చాలు.. అందులో పవన్ కల్యాణ్‌కి సంబంధించి ఏదో ఒక రిఫరెన్స్ ఉంటుందని అభిమానులు భావిస్తుంటారు. అలా ఇప్పుడు నితిన్ చేస్తున్న ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ (Extra Ordinary Man) సినిమాలో కూడా ప‌వ‌న్‌, నితిన్ క‌లిసి కనిపించినట్లుగా ఓ సీన్ సీజీ ద్వారా క్రియేట్ చేస్తున్నారనేలా టాక్ వినబడుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్‌కు సంబంధించి నితిన్‌ను మీడియా కొన్ని ప్రశ్నలు అడిగింది. ఆ ప్రశ్నలకు నితిన్ చాలా తెలివిగా సమాధానమిచ్చారు. (Nithiin About Pawan Kalyan)

పవన్ కల్యాణ్‌కు మీరు వీరాభిమాని కదా.. ఆయన పార్టీకి మీ సపోర్ట్ ఉంటుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకి.. ‘‘కల్యాణ్ గారికి నా సపోర్ట్ అవసరం లేదు. నేను సపోర్ట్ చేస్తే గెలిచేస్తారా? ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు.. ఎవరి సపోర్ట్ లేకుండానే ఆయన విజయం సాధిస్తారు’’ అని నితిన్ చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ క్రేజ్‌ని మీరు బాగా వాడుతుంటారని ప్రశ్నించగా.. ‘‘నేను వాడడం ఏంటి.. కల్యాణ్‌గారి అభిమానిని నేను. నా కంటే కళ్యాణ్‌‌గారి క్రేజ్‌ (Pawan Kalyan Craze)ని వాడుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. మీడియా కూడా థంబ్స్‌తో వాడుకుంటుందిగా’’ అని నితిన్ పంచ్ వేశారు.


Nithiin.jpg

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా వస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘ఇప్పుడు కల్యాణ్‌గారు పొలిటికల్‌గా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ టైమ్‌లో ఆయనని ఇబ్బంది పెట్టలేం’’ అని నితిన్ మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ గురించి నితిన్ మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Extra Ordinary Man Promotions)


ఇవి కూడా చదవండి:

====================

*Pindam Movie: సినిమాకు ‘పిండం’ అని టైటిల్ పెట్టడానికి కారణమిదేనట..

***************************************

*SS Karthikeya: ‘యానిమల్’‌ని చూసిన ఎస్.ఎస్. రాజమౌళి తనయుని రియాక్షన్ ఇదే..

*************************************

Updated Date - 2023-12-02T18:13:17+05:30 IST