Dil Raju: ‘యానిమ‌ల్’ త‌ర‌హా చిత్రాల‌ను నేను కూడా నిర్మిస్తా.. కాకపోతే?

ABN , First Publish Date - 2023-12-02T19:54:31+05:30 IST

ర‌ణ్‌బీర్ క‌పూర్‌, ర‌ష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘యానిమల్’. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబ‌డుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేసిన నిర్మాత‌, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మీడియాతో ప్ర‌త్యేకంగా మాట్లాడారు.

Dil Raju: ‘యానిమ‌ల్’ త‌ర‌హా చిత్రాల‌ను నేను కూడా నిర్మిస్తా.. కాకపోతే?
Producer Dil Raju

ర‌ణ్‌బీర్ క‌పూర్‌ (Ranbir Kapoor), ర‌ష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరో హీరోయిన్లుగా సందీప్ వంగా (Sandeep Vanga) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘యానిమల్’ (Animal). డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబ‌డుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేసిన నిర్మాత‌, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు (Dil Raju) మీడియాతో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..

‘‘2023 మాకెంతో కలిసొచ్చింది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా చేసిన సినిమాలు మంచి విజ‌యాల‌ను సాధించ‌టం ఎంతో హ్యాపీగా ఉంది. ‘యానిమల్, విరూపాక్ష, జైలర్, దసరా, లవ్ టుడే, మసూద, పొన్నియిన్ సెల్వన్’ వంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాం. ఈ ఏడాది ఇంకా ‘హాయ్ నాన్న’ (Hi Nanna) సినిమాను కూడా డిస్ట్రిబ్యూట్ చేయ‌బోతున్నాం. ‘యానిమల్’ సినిమా విష‌యానికి వ‌స్తే సినిమా బాగా క‌నెక్ట్ కావ‌టంతో తొలి రోజున మూవీ రికార్డ్ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ తొలి రోజు రూ. 15 కోట్ల మేర‌కు గ్రాస్ క‌లెక్ష‌న్స్ (Animal Collections) వ‌చ్చాయి. ఇక ఈరోజు (శని), రేపు (ఆది) కూడా ఫ్లో ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో ఫ‌స్ట్ వీకెండ్‌లో ముప్పై ఐదు నుంచి యాభై కోట్ల రూపాయ‌ల వరకు గ్రాస్ మార్క్‌ను ‘యానిమల్’ సినిమా అందుకుంటుందని అంచనా వేస్తున్నాం. ఈ స‌క్సెస్‌ను టీమ్ ఎంతో ఎంజాయ్ చేస్తుంది. సినిమా గ్లోబల్ అయ్యింద‌న‌టానికి ఇదొక ఎగ్జాంపుల్. మ‌న హీరోలైన ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో మంచి విజ‌యాల‌ను సాధించాయి. ఇప్పుడు అక్క‌డి హీరోలు సినిమాల‌ను కూడా మ‌న ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. అంద‌రికీ క‌నెక్ట్ అయ్యేలా సినిమాలు చేస్తే సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌న‌టానికి ఇదొక ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్ష‌కులు సినిమాలను చూడటానికి ఏమాత్రం ఆలోచించ‌ర‌ని ప్రూవ్ అయ్యింది. ఇది సందీప్ వంగా మేకింగ్ స్టైల్. ‘యానిమ‌ల్’ త‌ర‌హా చిత్రాల‌ను నేను కూడా నిర్మిస్తాను. అయితే నేను సినిమాలు చేస్తే ‘బొమ్మ‌రిల్లు’ (Bommarillu) స్టైల్లో ఉంటుంద‌ని ప్రేక్ష‌కులు భావిస్తున్నారు కాబ‌ట్టి.. నేను ‘యానిమ‌ల్’ వంటి సినిమాలు చేయాలంటే ముందుగానే డైరెక్ట‌ర్ ఇలాగే తీస్తాడ‌ని స్టేట్‌మెంట్ ఇచ్చి మ‌రీ నిర్మిస్తాను.


Animal.jpg

ఇక వ‌చ్చే ఏడాది మా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ (SVC) బ్యాన‌ర్‌లో నాలుగు సినిమాలు చేస్తున్నాం. అలాగే దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ (Dil Raju Productions) బ్యాన‌ర్‌లో మూడు సినిమాలు చేస్తున్నాం. మొత్తంగా ఏడు సినిమాల‌ను స‌రైన స‌మ‌యంలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌టానికి ప్లాన్ చేసుకుంటున్నాం. ‘గేమ్ చేంజ‌ర్’ (Game Changer) సినిమా ఇప్ప‌టికే 80 శాతానికి పైగా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. రాజ‌మౌళి, శంక‌ర్, సుకుమార్‌, సందీప్ వంగా వంటి వారిని టైమ్ అడ‌గ‌కూడ‌దు. శంక‌ర్‌గారు ఆయ‌న ప్లానింగ్ ప్ర‌కారం షూటింగ్ పూర్తి చేసుకుంటూ వ‌స్తున్నారు. సినిమా చిత్రీక‌ర‌ణ ఫైన‌ల్ స్టేజ్‌లో ఉంది. అంతా పూర్త‌యిన త‌ర్వాత ఆయ‌న పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌మ‌యం చెప్పే దాన్ని బ‌ట్టి రిలీజ్ డేట్ చెబుతాం. అలాగే విజయ్ దేవరకొండతో చేస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) రిలీజ్ సంక్రాంతికి కాకుండా మార్చికి వాయిదా వేస్తున్నాం. మరో రెండు రోజుల్లో షూటింగ్ నిమిత్తం.. ‘ఫ్యామిలీ స్టార్’ యూనిట్ అమెరికాకు పయనమవుతుంది.

దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో చేయబోయే మూడు సినిమాలకు ముగ్గరు యంగ్ డైరెక్టర్స్ పరిచయం కాబోతున్నారు. అందులో ‘ఆకాశం దాటి వస్తావా’ ఓ మూవీ, మరో సినిమాను సుహాస్‌తో చేయ‌బోతున్నాం. మ‌రో సినిమాను ఆశిష్‌తో నిర్మిస్తాం’’ అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Nithiin: నేను సపోర్ట్ చేస్తే.. పవర్ స్టార్ గెలిచేస్తారా?

***********************************

*Pindam Movie: సినిమాకు ‘పిండం’ అని టైటిల్ పెట్టడానికి కారణమిదేనట..

***************************************

*SS Karthikeya: ‘యానిమల్’‌ని చూసిన ఎస్.ఎస్. రాజమౌళి తనయుని రియాక్షన్ ఇదే..

*************************************

Updated Date - 2023-12-02T19:54:32+05:30 IST