SS Rajamouli: అందుకే యూత్‌కు న‌చ్చుతుంది

ABN , First Publish Date - 2023-08-11T13:12:29+05:30 IST

‘అబ్బాయిలు వాళ్ల ఫ‌స్ట్ ల‌వ్‌నైనా మ‌ర‌చిపోతారు కానీ.. ఫ‌స్ట్ బైక్‌ను మ‌ర‌చిపోరని’ అన్నారు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. బైక్ నేపథ్యంలో యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి హీరోగా న‌టించిన చిత్రం ‘ఉస్తాద్’. కావ్యా క‌ళ్యాణ్ రామ్ హీరోయిన్‌. ఆగస్ట్ 12న విడుదలకాబోతోన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను గురువారం మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

SS Rajamouli: అందుకే యూత్‌కు న‌చ్చుతుంది
SS Rajamouli

‘అబ్బాయిలు వాళ్ల ఫ‌స్ట్ ల‌వ్‌నైనా మ‌ర‌చిపోతారు కానీ.. ఫ‌స్ట్ బైక్‌ను మ‌ర‌చిపోరని’ అన్నారు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. బైక్ నేపథ్యంలో యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి (Sri Simha Koduri) హీరోగా న‌టించిన చిత్రం ‘ఉస్తాద్’ (Ustaad). కావ్యా క‌ళ్యాణ్ రామ్ (Kavya Kalyan Ram) హీరోయిన్‌. వారాహి చ‌ల‌న‌చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై ఫ‌ణిదీప్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఆగ‌స్ట్ 12న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ సంద‌ర్భంగా గురువారం చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, నేచుర‌ల్ స్టార్ నాని హాజరయ్యారు. (SS Rajamouli about Ustaad Movie)


Rajamouli.jpg

ఈ కార్యక్రమంలో ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి (SS Rajamouli) మాట్లాడుతూ.. ‘‘అబ్బాయిలు వాళ్ల ఫ‌స్ట్ ల‌వ్‌నైనా మ‌ర‌చిపోతారు కానీ.. ఫ‌స్ట్ బైక్‌ను మ‌ర‌చిపోరు. బైక్‌ను చూడ‌గానే రెక్క‌లు వ‌చ్చిన ఫీలింగ్ వ‌స్తుంది. అందుకే యూత్‌కు బైక్ న‌చ్చుతుంది. ఫ‌ణిదీప్ రాసుకున్న తీరు చ‌క్క‌గా ఉంది. అకీవా మ్యూజిక్ బావుంది. సాంగ్స్ నేను రోజూ వింటున్నాను. రూ. 30-35 కోట్లు సినిమాలాగా అనిపిస్తుంది. న‌టీన‌టుల‌తో పాటు టెక్నీషియ‌న్స్ చాలా బాగా చేశారు. కావ్యా క‌ళ్యాణ్ రామ్ మ‌న ప‌క్కింటి అమ్మాయిలాగా ఉంది. సింహా క‌ష్ట‌మైన రూట్‌ను ఎంచుకున్నాడు. త‌ను ఈజీ రూట్‌ను ఎంచుకోవాల‌నుకోలేదు. త‌న‌ని నేను ద‌గ్గ‌ర నుంచి చూస్తున్నాను. సింహా మూడు షేడ్స్‌లో అద్భుతంగా న‌టించాడ‌ని అంద‌రూ అంటున్నారు. పెద్ద చెట్లు నెమ్మ‌దిగా ఎదుగుతాయి. అలాగే సింహా కూడా త‌న ల‌క్ష్యాన్ని సాధిస్తాడ‌ని అనుకుంటున్నాను. ఉస్తాద్ టీమ్‌కి అభినంద‌న‌లు’’ అన్నారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*Vishal Marriage: ఆ హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్నట్లుగా వస్తున్న వార్తలపై విశాల్ క్లారిటీ..

***************************************

*Bholaa Shankar Twitter Talk: ‘భోళా శంకర్’ బొమ్మ పరిస్థితి ఏంటో తెలిసిపోయింది..

***************************************

*OG: పవర్ ‌స్టార్ బర్త్‌డేకి హీట్ వేవ్‌ని ఎదుర్కొనేందుకు సిద్ధమా..

***************************************

*Bholaa Shankar: భారీ కటౌట్, ర్యాలీ.. సినిమా ప్రచారానికి కాదు బాబాయ్..!

***************************************

Updated Date - 2023-08-11T13:12:29+05:30 IST