Box Office: బావలు కలిస్తే.. బాక్సాఫీస్ బద్దలే!

ABN , First Publish Date - 2023-04-16T15:47:10+05:30 IST

ఎన్టీఆర్‌ (Jr NTR), బన్నీ (Bunny) ఇద్దరూ ‘బావా.. బావా’ (Baava) అని పిలుచుకొంటారు. వాళ్ల మధ్య అంత అనుబంధం ఉంది. మొన్నామధ్య బన్నీ పుట్టిన రోజున

Box Office: బావలు కలిస్తే.. బాక్సాఫీస్ బద్దలే!
Allu Arjun and Jr NTR

‘మా హీరో గొప్ప’ అంటే... ‘మా హీరోనే గొప్ప’ అంటూ ఫ్యాన్స్‌ కొట్టుకొంటారు కానీ, హీరోలు మాత్రం స్నేహంగానే ఉంటారు. ఈ విషయం చాలా సందర్భాల్లో రుజువు అయ్యింది. ఒకప్పుడు మెగా, నందమూరి హీరోల (Mega and Nandamuri Heroes) మధ్య గట్టి పోటీ ఉండేది. ఫ్యాన్స్‌ వార్స్‌ నడిచేవి. ఇప్పుడు ఆ హీరోలే... దోస్త్‌ మేరా దోస్త్‌ అంటూ ఆప్యాయంగా కలిసిపోతున్నారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు. మొన్నటికి మొన్న ఎన్టీఆర్‌ - రామ్‌ చరణ్‌ (NTR and Ram Charan)లు కలిసి ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ (RRR) చేశారు. ఈ సినిమాతో వీరిద్దరి బాండింగ్‌ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్‌ - అల్లు అర్జున్‌ (NTR and Allu Arjun)లు ఓ సినిమా చేయబోతున్నారని టాలీవుడ్‌ టాక్‌.

ఎన్టీఆర్‌ (Jr NTR), బన్నీ (Bunny) ఇద్దరూ ‘బావా.. బావా’ (Baava) అని పిలుచుకొంటారు. వాళ్ల మధ్య అంత అనుబంధం ఉంది. మొన్నామధ్య బన్నీ పుట్టిన రోజున ‘పార్టీ లేదా బావా’ (Party ledaa Bavaa) అంటూ సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌ (Tarak) ఓ ట్వీట్‌ చేసి, వాళ్ల మధ్య ఉన్న మైత్రిని (Friendship) మరోసారి బయటపెట్టాడు. అప్పటి నుంచీ వీరిద్దరూ వెండి తెరపై కలసి నటిస్తే చూడాలన్న ఆశ అభిమానులలో మరింత పెరిగింది. ఆ ఊహ త్వరలోనే నిజం కాబోతోందన్నది ఇన్‌ సైడ్‌ వర్గాల టాక్‌.

Tarak.jpg

జియో స్డూడియోస్‌ (Jio Studios) సంస్థ బాలీవుడ్‌లో ‘అశ్వద్ధామ’ (Ashwatthama) పేరుతో ఓ భారీ ప్రాజెక్ట్‌ని నిర్మించే పనిలో ఉంది. ఇదో మల్టీస్టారర్‌. విక్కీ కౌశల్‌ (Vicky Kaushal), రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh)లతో ఈ మూవీని పట్టాలెక్కిద్దామనుకొన్నారు. అయితే వాళ్ల ఆలోచనలు మారాయి. ఎన్టీఆర్‌, బన్నీలతో ఈ ప్రాజెక్ట్‌ చేస్తే పాన్‌ ఇండియా పరంగా మంచి క్రేజ్‌ వస్తుందని జియో స్డూడియోస్‌ భావిస్తోంది. ప్రస్తుతం ఓ అగ్ర దర్శకుడి ఆధ్వర్యంలో స్ర్కిప్టు పనులు జరుగుతున్నాయి. అది పూర్తయ్యాకే ఈ ప్రాజెక్టుపై ఓ స్పష్టత వస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం ఈ బావలిద్దరూ కలిస్తే మాత్రం బాక్సాఫీసు బద్దలే. ఈ సమయం కోసం ఇరు హీరోల ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఎన్టీఆర్ డైరెక్ట్ బాలీవుడ్ చిత్రాన్ని ప్రకటించేశారు. ‘వార్ 2’లో ఆయన హృతిక్ రోషన్‌తో కలిసి నటించబోతున్నారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Rakul Preet Singh: రకుల్‌ రీ ఎంట్రీ సాధ్యమేనా?

*Shaakuntalam: ఇక అల్లు అర్జున్ ఫ్యాన్సే.. ఈ ప్రోమో అర్థం అదేనా?

*Vetrimaaran: ‘విడుదల’కు పాజిటివ్ టాక్.. ఛాన్స్ ఇచ్చే టాలీవుడ్ హీరో ఎవరు?

*Tammreddy Bharadwaja: మీ ఫ్యామిలీస్‌‌ని తిట్టినప్పుడు.. ఏమైంది మీ మగతనం? ఇండస్ట్రీ హీరోలకి సూటి ప్రశ్న?

*Actress Prema: రెండో పెళ్లి విషయమై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ప్రేమ..!

*Radhika Apte: నన్ను ఆ సర్జరీ చేయించుకోమన్నారు.. ఇప్పుడలా అంటేనా?

Updated Date - 2023-04-16T15:51:25+05:30 IST