Ugram Twitter Review: సినిమా బాగుందంటున్నారు కానీ..

ABN , First Publish Date - 2023-05-05T10:49:31+05:30 IST

అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న చిత్రం నేడు థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే..

Ugram Twitter Review: సినిమా బాగుందంటున్నారు కానీ..
Ugram Movie Still

‘నాంది’ (Naandhi)తో విజయవంతమైన కాంబినేషన్‌గా పేరొందిన అల్లరి నరేష్ (Allari Naresh), విజయ్ కనకమేడల (Vijay Kanakamedala).. మరోసారి కలిసి చేసిన చిత్రం ‘ఉగ్రం’ (Ugram). అప్పటి వరకు కామెడీ పాత్రలతో అలరిస్తూ వస్తున్న అల్లరి నరేష్‌ను పూర్తిగా మార్చేసిన చిత్రం ‘నాంది’. ఇప్పుడు ‘ఉగ్రం’తో మరోసారి నరేష్‌‌ని విజయ్ సరికొత్త యాంగిల్‌లో చూపించబోతున్నట్లుగా ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌ తెలియజేసింది. దీంతో సినిమాపై భారీగానే క్రేజ్ ఏర్పడింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ (Shine Screens)పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మించిన ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా మీనన్ (Mirnaa Menon) కథానాయికగా నటించింది. నేడు (మే 5) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్స్ పడ్డాయి. ఈ సినిమాని చూసిన నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ‘ఉగ్రం’పై తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. వారి అభిప్రాయాల ప్రకారం ‘ఉగ్రం’ సినిమా ఎలా ఉందంటే..

అల్లరి నరేష్ ఇందులో అద్భుతంగా నటించాడనేలా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. సినిమాలో అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేసి సినిమా ఫ్లోని నాశనం చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. అలాగే పాటలు ఈ సస్సెన్స్ థ్రిల్లర్‌కి ప్రధాన మైనస్‌గా చెబుతున్నారు. ఓవరాల్‌గా అయితే ఈ సినిమాకు ప్రస్తుతం యావరేజ్ టాకే వినబడుతోంది.

అల్లరి నరేష్ ర్యాంప్ ఆడేశాడు. ఎటువంటి అర్థం పర్థం లేని కథతో సినిమా మొదలవుతుంది. రన్ టైమ్ చాలా క్రిస్పీగా ఉంది. కొన్ని సన్నివేశాల్లో కెమెరా పనితనం చాలా బాగుంది. అలాగే ఇంట్రో ఫైట్, ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సన్నివేశాలలో లైటింగ్ వర్క్ అద్భుతంగా ఉంది. సెకండాఫ్‌కి వచ్చే సరికి పాట పెద్ద స్పీడ్ బ్రేకర్‌గా ఉంది. సినిమా నడిచే ప్రధాన పాయింట్‌తో ముడిపెట్టిన ఫ్యామిలీ సన్నివేశాలు బాగానే ఉన్నాయి కానీ.. ఆ సన్నివేశాలు అంత గొప్పగా చిత్రీకరించబడలేదు. ప్రీ క్లైమాక్ష్ వరకు కథ బాగానే నడిచింది కానీ.. ఆ తర్వాత కమర్షియల్ ఎలిమెంట్స్ ఇరికించి.. సినిమాని ముగించారు. ఇది సినిమాకు పెద్ద మైనస్. ఇటువంటి కథలు చాలా ఉత్కంఠభరితంగా, ఎంగేజింగ్‌గా ఉండాలి. ఆ కోణంలో అంతగా ఈ సినిమా వర్కవుట్ కాలేదు. ఓవరాల్‌గా అయితే.. నరేష్ నటన కోసం ఈ సినిమాని ఒక్కసారి చూడవచ్చు అని ఓ నెటిజన్ సినిమాపై సుధీర్ఘ రివ్యూ ఇచ్చారు. (Ugram Movie Twitter Talk)


ఓవరాల్‌గా ఉగ్రం సినిమా అల్లరి నరేష్ ఉగ్ర ప్రదర్శనతో ఒక డీసెంట్ థ్రిల్లర్‌గా నిలిచింది. అల్లరి నరేష్ నటన, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వేల్యూస్, యాక్షన్ సీన్స్‌తో డీసెంట్‌గా ఉంది. అల్లరి నరేష్ ఇంకాస్త బెటర్‌గా చేసే ఛాన్స్ ఉంది. సినిమా మైనస్‌ల విషయానికి వస్తే.. స్ర్కీన్‌ప్లే, ముందే తెలిసిపోయే సీన్లు ఈ సినిమాకి మైనస్. మొత్తంగా నరేష్ నటన కోసం ఈ సినిమా చూడవచ్చు అంటూ ఓ నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు. (Allari Naresh Ugram Talk)


ఉగ్రంలో గూస్‌బంప్స్ స్టఫ్ ఉంది. అల్లరి నరేష్ అన్న నటన సూపర్బ్‌గా ఉంది. సెకండాఫ్‌లో వచ్చే క్లైమాక్స్, హిజ్రా ఫైట్ అయితే అరుపులే. సినిమాటోగ్రఫీ, బీజీఎమ్, ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. ఈ పర్ఫెక్ట్ మిస్టరీ డ్రామాకు నా రేటింగ్ 4 అంటూ ఓ నెటిజన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. (Ugram Movie Report)


ఉగ్రం సినిమా ఒక ఆర్డినరీ సస్పెన్స్ థ్రిల్లర్ అంతే. సినిమాకు అల్లరి నరేష్ నటన, బీజీఎమ్, సస్పెన్స్ సీన్స్ పాజిటివ్స్ అయితే.. ఫస్టాఫ్‌లో వచ్చే లవ్ ట్రాక్, ఎమోషనల్ కంటెంట్ లేకపోవడం, సెకండాఫ్ సాగదీతగా ఉండటం, క్లైమాక్స్, స్టోరీ పెద్దగా లేకపోవడం ఈ సినిమాకు నెగిటివ్స్ అంటూ ఓ నెటిజన్ 2.25 రేటింగ్ ఇచ్చారు.


ఓవరాల్‌గా అయితే.. ఈ సినిమాకు ప్రస్తుతం యావరేజ్ అంటూ టాక్.. 2.5 రేటింగ్ పడుతున్నాయి. నరేష్ నటన, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలెట్ అనేలా వినబడుతుంది. ముఖ్యంగా సినిమా చూసిన వారంతా బాగుందనే అంటున్నారు. ఈ టాక్‌తో సినిమా నిలబడే అవకాశాలు బాగానే ఉన్నాయి కాబట్టి.. యూనిట్ ఊపిరి పీల్చుకోవచ్చు. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి సమాచారం కాసేపట్లో వచ్చే రివ్యూలో.. (Ugram Movie Report)

ఇవి కూడా చదవండి:

************************************************

*Rama Banam Twitter Review: ఆ లిస్ట్‌లోకి ఇంకో సినిమా చేరినట్టే..

*Vanitha Vijay Kumar: రిలేషన్‌ మాత్రమే.. పెళ్ళి జరగలేదు.. దయచేసి అలా రాయవద్దు

*Parineeti and Raghav: క్రికెట్ స్టేడియంలో ప్రేమికులు హల్చల్

*Nandi Awards: నంది అవార్డుల వివాదంపై మంత్రి తలసాని రియాక్షన్ ఇదే..

*Naga Chaitanya: చైతూ చెప్పింది.. ‘ఏజెంట్’ రిజల్ట్ గురించేనా?

*Vijay Antony: నా ప్రాణాలను నా హీరోయిన్‌ కాపాడింది

Updated Date - 2023-05-05T11:21:36+05:30 IST