Naga Chaitanya: చైతూ చెప్పింది.. ‘ఏజెంట్’ రిజల్ట్ గురించేనా?

ABN , First Publish Date - 2023-05-04T15:18:20+05:30 IST

ఈ మధ్యకాలంలో అక్కినేని హీరోల సినిమాలు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోతున్నాయి.. దీనిపై మీరేం చెబుతారు? అని చైతూని అడగగా..

Naga Chaitanya: చైతూ చెప్పింది.. ‘ఏజెంట్’ రిజల్ట్ గురించేనా?
Akkineni Naga Chaitanya

అక్కినేని ఫ్యామిలీ హీరోల (Akkineni Family Heroes) నుంచి ఈ మధ్య వరుసగా వస్తున్న ఫ్లాప్స్‌తో.. ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. కింగ్ నాగార్జున (King Nagarjuna) నటించిన ‘ది ఘోస్ట్’ (The Ghost), యువ సామ్రాట్ నాగ చైతన్య ‘థ్యాంక్యూ’ (Thank You).. రీసెంట్‌గా అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన ‘ఏజెంట్’ (Agent).. ఈ మూడు చిత్రాలు ఫ్యాన్స్‌ని, ప్రేక్షకులను అనుకున్నంత గొప్పగా మెప్పించలేకపోయాయి. దీంతో నిరాశలో ఉన్న అక్కినేని అభిమానుల (Akkineni Fans) ఆశలన్నీ ఇప్పుడు నాగ చైతన్య (Naga Chaitanya), వెంకట్ ప్రభు (Venkat Prabhu) కాంబినేషన్‌లో రూపొందిన ‘కస్టడీ’ (Custody)పైనే ఉన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం మే 12న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌‌పై దృష్టి పెట్టారు. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో నాగచైతన్యకు అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది. ఈ మధ్యకాలంలో అక్కినేని హీరోల సినిమాలు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోతున్నాయి.. దీనిపై మీరేం చెబుతారు? అని చైతూని మీడియా అడిగింది.

దీనికి నాగ చైతన్య (Naga Chaitanya) సమాధానమిస్తూ.. ‘‘ఫ్యాన్స్‌కు అలాగే ప్రేక్షకులకు మేము మంచి సినిమాలనే ఇవ్వాలని చూస్తుంటాం. మేం కావాలని ఫ్లాప్స్ కోరుకోం కదా. అభిమానులు చూపించే ప్రేమ, అభిమానానికి తిరిగి ఏదైనా ఇవ్వగలం అంటే అది ఖచ్చితంగా మంచి సినిమానే. ఈ మధ్య మా ఫ్యామిలీ నుంచి వచ్చిన చిత్రాలు వారిని మెప్పించలేకపోయాయి. కానీ ఎప్పుడూ ఇలాగే ఉండదు. హిట్స్, ఫ్లాప్స్ సహజం.. అలాగే ప్రతి నటుడి కెరీర్‌లో అప్ అండ్ డౌన్స్ కూడా సహజమే. మళ్లీ మంచి రోజులు వస్తాయి. మా ఫ్యామిలీ హీరోల చిత్రాలు మెప్పిస్తాయి. నా వరకు నేను.. రాబోయే ‘కస్టడీ’ చిత్రం ఖచ్చితంగా అందరినీ మెప్పిస్తుందనే నమ్మకంతో ఉన్నాను..’’ అని చెప్పుకొచ్చారు.

Akhil.jpg

అయితే చైతూ చెప్పిన సమాధానం విన్నవారంతా.. అఖిల్ ‘ఏజెంట్’ (Akhil Agent) రిజల్ట్ గురించే చైతూ ఇలా మాట్లాడి ఉంటాడని అనుకుంటున్నారు. ‘ఏజెంట్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసింది. నిర్మాత కూడా సరైన స్ర్కిప్ట్ ఎంచుకోకుండానే ఈ సినిమా చేశాం అని చెబుతూ.. అందరికీ క్షమాపణలు చెప్పారు. ఈ సినిమా రిజల్ట్ చూసి అఖిల్ కూడా నిరాశలో ఉన్నాడు. ఇక్కడుంటే ‘ఏజెంట్’ జ్ఞాపకాలు వెంటాడుతాయని.. ఆయన ఫారెన్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు తన తమ్ముడిని ఓదార్చే ప్రక్రియలో నాగ చైతన్య (Naga Chaitanya about Akhil Agent) ఇలా మాట్లాడి ఉంటాడనేలా అంతా మాట్లాడుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Vijay Antony: నా ప్రాణాలను నా హీరోయిన్‌ కాపాడింది

*Dimple Hayathi: గుడి కట్టాలనుకుంటున్న అభిమానికి షాకిచ్చిన హయాతి

*Chaitu Vs Sam: చైతూ ఏమో బాధలేదంటాడు.. సమంత ఏమో టార్చర్ టైమ్ అంటోంది.. ఏంటి కథ?

*Hero Shanthanu Bhagyaraj: ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..

*VD12: విజయ్ దేవరకొండ 12వ చిత్రం ప్రారంభం.. చిత్ర విశేషాలివే!

Updated Date - 2023-05-04T15:18:20+05:30 IST