Rama Banam Twitter Review: ఆ లిస్ట్‌లోకి ఇంకో సినిమా చేరినట్టే..

ABN , First Publish Date - 2023-05-05T09:42:57+05:30 IST

మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) హీరోగా.. డైరెక్టర్ శ్రీవాస్ (Sriwass) దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామబాణం’ చిత్రానికి సంబంధించిన ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే..

Rama Banam Twitter Review: ఆ లిస్ట్‌లోకి ఇంకో సినిమా చేరినట్టే..
Rama Banam Movie Poster

మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) హీరోగా.. డైరెక్టర్ శ్రీవాస్ (Sriwass) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రామబాణం’ (Rama Banam). ‘లక్ష్యం’, ‘లౌక్యం’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ మూవీ రూపుదిద్దుకుంది. ‘లక్ష్యం’లో గోపీచంద్ బ్రదర్‌గా నటించిన జగపతిబాబు.. ఈ సినిమాలోనూ ఆయనకు బ్రదర్‌గా నటించారు. గోపీచంద్ సరసన తెలుగమ్మాయ్ డింపుల్ హయాతి (Dimple Hayathi) హీరోయిన్‌గా నటించింది. ఖుష్బు, సచిన్ ఖేడ్కర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్ వంటివారు ఇతర పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Viswa Prasad) నిర్మించారు. ఈ చిత్రం నేడు (మే 5) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్స్ మొదలవడంతో.. సినిమా చూసిన వారు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌‌తో మంచి క్రేజ్‌‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రంపై నెటిజన్ల అభిప్రాయం ఎలా ఉందో చూద్దాం..


ప్రస్తుతానికైతే ‘రామబాణం’ సినిమాకు మిక్స్‌డ్ టాకే వినబడుతోంది. రొటీన్‌గా ఉందంటూ ఎక్కువ శాతం నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘పాతకాలం సినిమాలా ఉంది. కొత్తగా చెప్పిందేం లేదు. గోపీచంద్ ఒక్కడే ఈ సినిమాకు ప్లస్. అవుట్‌డేటెడ్ స్టోరీ, పూర్ స్ర్కీన్‌ప్లే, సాగదీత సీన్లు, ఫస్టాఫ్ మరీ వీక్, డైరెక్షన్ వంటివి ఈ సినిమాకు ప్రధాన మైనస్‌లుగా చెబుతూ ఓ నెటిజన్ ఈ సినిమాకు 2 రేటింగ్ ఇచ్చారు. (Rama Banam Twitter Talk)


ఫ్యామిలీతో కలిసి చూడదగిన చిత్రం ‘రామబాణం’. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. చాలా బాగుంది అంటూ ఓ నెటిజన్ ఫ్యామిలీ ఎమోజీని పోస్ట్ చేస్తున్నారు.


‘రామబాణం’ రొటీన్ సినిమానే.. నా రేటింగ్ 2 అంటూ ఓ నెటిజన్ చిత్ర పోస్టర్‌ని షేర్ చేశారు.


*‘రామబాణం’ సూపర్‌గా ఉంది. ఫస్టాఫ్ వరకు ఎక్స్‌లెంట్‌గా ఉంది. బెస్ట్ ఫైట్ సీన్స్ ఉన్నాయి.

*మస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చావ్ గోపీ అన్న.. థ్యాంక్స్

*ఫస్టాప్ పూర్తయింది. గోపీచంద్ ఇంట్రో సీన్ అదిరిపోయింది

*ఏ డీసెంట్ ఎమోషనల్ డ్రామా ‘రామబాణం’

* రామబాణం ఫస్టాఫ్: ఏ రొటీన్ అవుట్‌డేటెడ్ స్టోరీ.. కొన్ని కామెడీ సన్నివేశాలు, పాటలు బాగున్నాయి. ఎగ్జయిట్ చేసే అంశాలేవీ లేవు.





ఇలా.. మొత్తంగా ట్విట్టర్‌లో అయితే ప్రస్తుతానికి ఈ సినిమా టాక్ వీక్‌గానే ఉంది. ఒకరిద్దరు మినహా.. ఈ సినిమాపై పాజిటివ్‌గా ఎవరూ స్పందించడం లేదు. సినిమాకు సంబంధించిన రియల్ టాక్ ఏంటనేది కాసేపట్లో వచ్చే రివ్యూలో తెలుసుకుందాం. (Rama Banam Movie Twitter Review)

ఇవి కూడా చదవండి:

************************************************

*Vanitha Vijay Kumar: రిలేషన్‌ మాత్రమే.. పెళ్ళి జరగలేదు.. దయచేసి అలా రాయవద్దు

*Parineeti and Raghav: క్రికెట్ స్టేడియంలో ప్రేమికులు హల్చల్

*Nandi Awards: నంది అవార్డుల వివాదంపై మంత్రి తలసాని రియాక్షన్ ఇదే..

*Naga Chaitanya: చైతూ చెప్పింది.. ‘ఏజెంట్’ రిజల్ట్ గురించేనా?

*Vijay Antony: నా ప్రాణాలను నా హీరోయిన్‌ కాపాడింది

*Dimple Hayathi: గుడి కట్టాలనుకుంటున్న అభిమానికి షాకిచ్చిన హయాతి

Updated Date - 2023-05-05T10:12:38+05:30 IST