సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Varun Tej: ఎంగేజ్‌మెంట్ తర్వాత లావణ్యతో కలిసి.. వరుణ్ తేజ్ చేసిన పోస్ట్ వైరల్

ABN, First Publish Date - 2023-06-13T21:52:29+05:30

తాజాగా మెగా హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. వీరి ఎంగేజ్‌మెంట్ అనంతరం పెళ్లి ఎప్పుడు? అనే వార్త బయటికి రాలేదు కానీ.. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటో షేర్ చేసి.. సోషల్ మీడియా వేదికగా వరుణ్ తేజ్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Varun Tej and Lavanya Tripathi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రీసెంట్‌గా మెగా ఫ్యామిలీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) నిశ్చితార్థం హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)తో జరిగిన విషయం తెలిసిందే. ఈ నిశ్చితార్థపు వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు.. అతి దగ్గర బంధువులు మాత్రమే హాజరయ్యారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థాన్ని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) దంపతులు దగ్గరుండి మరి జరిపించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ వంటి వారంతా ఈ వేడుకలో భాగమయ్యారు. అయితే.. నిశ్చితార్థం పూర్తయిన తర్వాత ఫొటోలు అయితే బయటకు వచ్చాయి కానీ.. పెళ్లి ఎప్పుడనేది మాత్రం ఇంత వరకు మెగాబ్రదర్ నాగబాబు (Mega Brother Nagababu) ప్రకటించలేదు. అలాగే లావణ్య కుటుంబ సభ్యులు కూడా ఈ ఎంగేజ్‌మెంట్‌పై ఎక్కడా రియాక్ట్ కాలేదు. దీంతో వరుణ్, లావణ్య (VarunLav)ల పెళ్లి ఎప్పుడు? అంటూ మెగా ఫ్యాన్స్ (Mega Fans), నెటిజన్లు అందరూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఇరు ఫ్యామిలీల నుంచి పెళ్లి విషయమై ఎటువంటి ప్రకటనా రాలేదు కానీ.. తాజాగా వరుణ్ తేజ్ మాత్రం సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటో షేర్ చేసి.. అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ‘మాకు శుభాకాంక్షలు అందచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ అని వరుణ్ తేజ్ (Varun Tej) సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అయితే ఈ మెసేజ్‌తో పాటు ఆయన పోస్ట్ చేసిన ఫొటో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో వరుణ్ తేజ్, లావణ్య ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. నిశ్చితార్థం అయిన రెండు రోజులకే ఫారిన్‌లో ఈ జంట ఇలా కనిపించే సరికి అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఇక వరుణ్ తేజ్ చేసిన ఈ పోస్ట్‌‌కు నెటిజన్లు కూడా రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇంతకు ముందు కొందరు సెలబ్రిటీల మ్యారేజ్‌ని గుర్తు చేసుకుంటూ.. వారిలా కాకుండా హాయిగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీ ఇద్దరి విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాం అన్నా.. పెళ్లి ఎప్పుడు? అంటూ మెగాభిమానులు (Mega Fans) రియాక్ట్ అవుతున్నారు. ఇలా అందరూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేస్తున్న కామెంట్స్‌తో.. వరుణ్, లావణ్యల (Varun Tej and Lavanya Tripathi) పేరు ట్రెండ్ అవుతోంది. కాగా.. వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘గాంఢీవధారి అర్జున’ చిత్రంలో నటిస్తుంటే.. లావణ్య త్రిపాఠి అన్నపూర్ణ స్టూడియోస్‌‌పై తెరకెక్కి హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్న వెబ్ సిరీస్‌లోనూ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్న ఓ చిత్రంలోనూ.. అలాగే అథర్వ హీరోగా తెరకెక్కుతోన్న తమిళ చిత్రంలోనూ నటిస్తోంది.


ఇవి కూడా చదవండి:

**************************************

*Kaliveerudu: ‘కాంతార’ తరహాలో మరో కన్నడ చిత్రం.. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా?


**************************************

*Adipurush: ఆదిపురుష్‌ టీమ్‌కు కేసీఆర్ సర్కార్ తియ్యటి శుభవార్త.. ఈ విషయం సినీ ప్రేక్షకులు, ఫ్యాన్స్‌కు తెలిస్తే..!

**************************************

*Sai Dharam Tej: కంటతడి పెట్టిన సాయిధరమ్ తేజ్.. కారణమదే..

**************************************

*Vijay Anthony: ‘బిచ్చగాడు 2’ తర్వాత పవర్‌ఫుల్‌ టైటిల్‌తో..

**************************************

*Manoj Bajpayee: పవన్ కల్యాణ్ ఆల్రెడీ చేశారు.. మహేష్ బాబు అయితే బెటర్!

**************************************

*Ravi Teja: పెయింటరా? లేక పత్తి పండించే రైతా?.. మాస్ రాజా ఖాతాలో మరొకటి!

**************************************

Updated Date - 2023-06-13T21:59:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!