scorecardresearch

Kaliveerudu: ‘కాంతార’ తరహాలో మరో కన్నడ చిత్రం.. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా?

ABN , First Publish Date - 2023-06-13T20:39:30+05:30 IST

‘కాంతార’ తరహాలోనే కన్నడనాట విజయదుందుభి మోగిస్తోన్న ‘కలివీర’ అనే చిత్రాన్ని ‘కలివీరుడు’ అనే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర తెలుగు హక్కులను డిస్ట్రిబ్యూటర్ ఎమ్. అచ్చిబాబు ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నారు. మినిమం గ్యారంటీ మూవీస్ పతాకంపై జూలైలో ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా ఆయన తెలిపారు.

Kaliveerudu: ‘కాంతార’ తరహాలో మరో కన్నడ చిత్రం.. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా?
Kaliveerudu Movie Still

‘కెజియఫ్’ (KGF) సిరీస్ చిత్రాలతో కాలరెగరేసిన కన్నడ చిత్రసీమ.. ‘కాంతార’ (Kantara) సినిమాతో మరో లెవల్‌కి వెళ్లిపోయింది. ఈ రెండు చిత్రాలతో ఒక్కసారిగా కన్నడ సినీ పరిశ్రమ (Kannada Cine Industry) వైపు యావత్ సినీ పరిశ్రమ‌ను తన వైపు చూసేలా చేసుకుంది. ముఖ్యంగా ‘కాంతార’ చిత్రం చాలా లో-బడ్జెట్‌లో తెరకెక్కి వందల కోట్లను రాబట్టి ఔరా అనిపించింది. ఆ సినిమా సాధించిన విజయం గురించి ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ‘కాంతార’ తరహాలోనే కన్నడనాట విజయదుందుభి మోగిస్తోన్న ‘కలివీర’ (KaliVeera) అనే చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

‘కలివీర’ చిత్రం ప్రస్తుతం కన్నడ సినీ పరిశ్రమలో అనూహ్య విజయం సాధిస్తూ... రికార్డు స్థాయి వసూళ్లతో కన్నడ ఖ్యాతిని మరింత సుస్థిరం చేస్తోందనేలా టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్ ఎమ్.అచ్చిబాబు (M Atchibabu Babu) ఈ చిత్ర హక్కులను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుని.. తన మినిమం గ్యారంటీ మూవీస్ పతాకంపై తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘కలివీరుడు’ (Kaliveerudu)గా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుంది. ‘కాంతార’ చిత్రం ఎలా అయితే తెలుగులోనూ సంచలన విజయాన్ని నమోదు చేసిందో.. ఈ సినిమా కూడా అదే స్థాయి విజయాన్ని అందుకుంటుందని అచ్చిబాబు ఆశిస్తున్నారు.

KaliVeera.jpg

‘కలివీర’ విషయానికి వస్తే.. ‘అవి’ (Avi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రియల్ ఫైట్స్‌కు పెట్టింది పేరైన కన్నడ సెన్సేషన్ ఏకలవ్య (Ekalavya) టైటిల్ రోల్ ప్లే చేయగా.. ఆయన సరసన చిరాశ్రీ (Chirasree) హీరోయిన్‌గా నటించారు. డేని కుట్టప్ప, తబలా నాని, అనితాభట్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. జూలై ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత అచ్చిబాబు సన్నాహాలు చేస్తున్నారు. మరి ‘కాంతార’ చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులు.. అదే కోవలో వస్తున్న ఈ చిత్రాన్ని ఏ మేరకు ఆదరిస్తారో చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

**************************************

*Adipurush: ఆదిపురుష్‌ టీమ్‌కు కేసీఆర్ సర్కార్ తియ్యటి శుభవార్త.. ఈ విషయం సినీ ప్రేక్షకులు, ఫ్యాన్స్‌కు తెలిస్తే..!


**************************************

*Sai Dharam Tej: కంటతడి పెట్టిన సాయిధరమ్ తేజ్.. కారణమదే..

**************************************

*Vijay Anthony: ‘బిచ్చగాడు 2’ తర్వాత పవర్‌ఫుల్‌ టైటిల్‌తో..

**************************************

*Manoj Bajpayee: పవన్ కల్యాణ్ ఆల్రెడీ చేశారు.. మహేష్ బాబు అయితే బెటర్!

**************************************

*Ravi Teja: పెయింటరా? లేక పత్తి పండించే రైతా?.. మాస్ రాజా ఖాతాలో మరొకటి!

**************************************

Updated Date - 2023-06-13T20:39:30+05:30 IST