Prabhas: ప్రభాస్ సత్తా ఏంటో చూపిన ‘సలార్’.. కేవలం 6 రోజుల్లో ఎన్ని కోట్ల వసూళ్లంటే?

ABN , Publish Date - Dec 28 , 2023 | 05:39 PM

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన ‘బాహుబలి’ సిరీస్ చిత్రాల తర్వాత.. ప్రభాస్ స్టామినా ఇది.. అని చెప్పే చిత్రం ఒక్కటీ బాక్సాఫీస్ దగ్గర పడలేదు. తాజాగా వచ్చిన ‘సలార్’ చిత్రం ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేస్తోంది. ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే 500 కోట్ల క్లబ్‌లోకి చేరినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Prabhas: ప్రభాస్ సత్తా ఏంటో చూపిన ‘సలార్’.. కేవలం 6 రోజుల్లో ఎన్ని కోట్ల వసూళ్లంటే?
Prabhas in Salaar Movie

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హీరోగా చేసిన ‘బాహుబలి’ (Bahubali) సిరీస్ చిత్రాల తర్వాత.. ప్రభాస్ స్టామినా ఇది.. అని చెప్పే చిత్రం ఒక్కటీ బాక్సాఫీస్ దగ్గర పడలేదు. ‘బాహుబలి’ తర్వాత ‘సాహో’, ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’ చిత్రాల్లో ప్రభాస్ నటించారు. ‘సాహో’ (Sahoo) హిందీ బెల్ట్ వరకు పర్లేదు అనుకుంటే.. మిగతా సినిమాలు మాత్రం ప్రభాస్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేశాయి. దీంతో అభిమానుల ఆశలన్నీ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ‘సలార్’పైనే పడ్డాయి. ఈ సినిమా విడుదల విషయంలో వాయిదాలు పడి, రకరకాలుగా వార్తలు వినిపించినా.. విడుదల తర్వాత మాత్రం దాదాపు బాక్సాఫీస్ వద్ద సునామీనే సృష్టిస్తోంది. అందుక్కారణం ప్రభాస్‌కి ఎలాంటి కంటెంట్ పడాలో.. అలాంటి కంటెంట్‌ని ప్రశాంత్ నీల్ సిద్ధం చేశారు. అందుకే ప్రభాస్‌ని రాజమౌళి, ప్రశాంత్ నీల్ వాడినట్లుగా ఎవరూ వాడలేకపోయారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ‘సలార్’ (Salaar) సినిమా విడుదలై 6 రోజులు (బుధవారానికి) మాత్రమే అవుతుంది. ఈ ఆరు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ తెలిస్తే.. ఇది కదా.. ప్రభాస్ స్టామినా అని అంతా అనక మానరు.

Salaar-Prabhas.jpg

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ ‘సలార్ పార్ట్ 1, సీజ్ పైర్’ బాక్సాఫీస్ వద్ద మరో రేర్ ఫీట్ సాధించింది. ఈ నెల 22న రిలీజైన ఈ సినిమా ఆరు రోజుల్లోనే 500 కోట్ల రూపాయల (Rs. 500 Cr) వసూళ్ల మార్క్ టచ్ చేసింది. ‘సలార్’తో ప్రభాస్ స్టార్ డమ్ మరోసారి ప్రూవ్ అయ్యింది. బాహుబలి 1, బాహుబలి 2 సినిమా తర్వాత సలార్‌తో ప్రభాస్ మరోసారి 500 కోట్ల రూపాయల వసూళ్ల క్లబ్‌లో చేరారు. ఈ ఇయర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే 1 కలెక్షన్స్ సాధించిన సలార్.. నేషనల్ చైన్స్‌లో షారుఖ్ ఖాన్ ‘డంకీ’ (Shah Rukh Khan Dunki) సినిమా గట్టి పోటీ ఇచ్చినా.. ప్రతి రోజూ తన బాక్సాఫీస్ నెంబర్స్ పెంచుకుంటూనే వచ్చింది.


Prabhas.jpg

ఈ ట్రెండ్ చూస్తుంటే సలార్ కలెక్షన్స్‌లో ఓవర్సీస్ సహా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది. సలార్‌లో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ (Prudhviraj Sukumaran) నటనకు అంతటా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాలో శృతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్‌గా నటించింది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మొత్తంగా చూస్తే.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ విషయంలో ప్రభాస్ మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం పక్కా అంటూ ట్రేడ్ నిపుణులు చెబుతుండటం విశేషం.


ఇవి కూడా చదవండి:

====================

*Vaishnavi Chaitanya: ‘బేబి’ హీరోయిన్‌కు మరో ఛాన్స్.. హీరో ఎవరంటే?

**************************

*Tenant: ‘నా క‌థ‌లో నువ్వున్నావా? నీ క‌థ‌నే నేను అయ్యానా?’ అంటోన్న సత్యం రాజేష్!

***************************

*Dunki: 2023 టాప్ గ్రాస‌ర్ క్ల‌బ్‌లో షారూక్ ‘డంకీ’... వ‌ర‌ల్డ్ వైడ్‌గా కలెక్షన్స్ ఎంతంటే?

***************************

Updated Date - Dec 28 , 2023 | 05:39 PM