Dunki: 2023 టాప్ గ్రాస‌ర్ క్ల‌బ్‌లో షారూక్ ‘డంకీ’... వ‌ర‌ల్డ్ వైడ్‌గా కలెక్షన్స్ ఎంతంటే?

ABN , Publish Date - Dec 27 , 2023 | 07:51 PM

కింగ్ ఖాన్ షారూక్‌, రాజ్‌కుమార్ హిరాని క‌ల‌యిక‌లో రూపొందిన చిత్రం ‘డంకీ’. వ‌ర‌ల్డ్ వైడ్ ఈ చిత్రం క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 21న రిలీజైన సంగ‌తి తెలిసిందే. విడుద‌లైన రోజు నుంచి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకుంటూ ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకెళుతోంది. ఓవ‌ర్ సీస్‌లోనూ మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తోన్న ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 283.13 కోట్లను సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

Dunki: 2023 టాప్ గ్రాస‌ర్ క్ల‌బ్‌లో షారూక్ ‘డంకీ’... వ‌ర‌ల్డ్ వైడ్‌గా కలెక్షన్స్ ఎంతంటే?
Dunki Movie Still

కింగ్ ఖాన్ షారూక్‌ (Shah Rukh Khan), రాజ్‌కుమార్ హిరాని (Rajkumar Hirani) క‌ల‌యిక‌లో రూపొందిన చిత్రం ‘డంకీ’ (Dunki). వ‌ర‌ల్డ్ వైడ్ ఈ చిత్రం క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 21న రిలీజైన సంగ‌తి తెలిసిందే. విడుద‌లైన రోజు నుంచి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకుంటూ ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకెళుతోంది. ఓవ‌ర్ సీస్‌లోనూ మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తోన్న ఈ చిత్రం.. తాజాగా బాక్సాఫీస్ వ‌సూళ్ల ప‌రంగా మ‌రో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రూ.250 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను దాటేసి.. 2023 టాప్ గ్రాసర్ క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 283.13 కోట్లను వసూలు చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు. (Dunki Worldwide Collections)

2023లో ‘ప‌ఠాన్‌, జ‌వాన్‌’.. ఇప్పుడు ‘డంకీ’ చిత్రాల‌తో షారూక్ న‌టించిన మూడు సినిమాలు వంద‌కోట్ల మార్క్ క్రాస్ చేయ‌టం విశేషం. ఆదివారం రోజునే ఈ చిత్రం రూ.29.25 కోట్ల నుంచి రూ.30.25 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌టంతో ఇండియా వైడ్‌గా ఈ చిత్రం రూ.102.50 కోట్ల‌ను రాబట్టుంది. షారూక్ న‌టించిన చిత్రాల్లో ‘డంకీ’ సినిమా వంద‌కోట్ల వ‌సూళ్ల‌ను సాధించ‌టంతో ఆయ‌న అభిమానులు హ్యాపీగా ఉన్నారు. ఇది ఆయ‌న కెరీర్‌లో వంద కోట్ల వ‌సూళ్ల‌ను దాటిన ప‌ద‌వ చిత్రం కావ‌టం విశేషం. (Dunki Indiawide Collections)


SRK.jpg

‘డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లుగా వ‌ర్క్ చేశారు. (Dunki Movie)


ఇవి కూడా చదవండి:

====================

*Saripodhaa Sanivaaram: మళ్లీ యాక్షన్‌లోకి న్యాచురల్ స్టార్..

****************************

*Naveen Medaram: ‘డెవిల్’ సినిమాపై ఎటువంటి చట్టపరమైన చర్యలకి వెళ్లడం లేదు

**************************

*Ravi Teja: ‘హను-మాన్’కి ‘ఈగల్’ సపోర్ట్

***************************

Updated Date - Dec 27 , 2023 | 07:51 PM