Tenant: ‘నా క‌థ‌లో నువ్వున్నావా? నీ క‌థ‌నే నేను అయ్యానా?’ అంటోన్న సత్యం రాజేష్!

ABN , Publish Date - Dec 27 , 2023 | 11:01 PM

‘మా ఊరి పొలిమేర‌ 2’ సంచ‌ల‌న విజ‌యంతో న‌టుడిగా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్న క‌థానాయ‌కుడు స‌త్యం రాజేష్ హీరోగా న‌టిస్తున్న మ‌రో చిత్రం ‘టెనెంట్‌’. మేఘా చౌద‌రి క‌థానాయిక‌. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్‌ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ చిత్రం నుంచి సాహిత్య సాగ‌ర్ లిరిక్స్‌తో పాటు ట్యూన్ అందించిన మెలోడి సాంగ్‌ను విడుదల చేశారు.

Tenant: ‘నా క‌థ‌లో నువ్వున్నావా? నీ క‌థ‌నే నేను అయ్యానా?’ అంటోన్న సత్యం రాజేష్!
Tenant Movie Still

‘మా ఊరి పొలిమేర‌ 2’ (Maa Oori Polemera 2) సంచ‌ల‌న విజ‌యంతో న‌టుడిగా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్న క‌థానాయ‌కుడు స‌త్యం రాజేష్ (Satyam Rajesh) హీరోగా న‌టిస్తున్న మ‌రో చిత్రం ‘టెనెంట్‌’ (Tenant). మేఘా చౌద‌రి క‌థానాయిక‌. చంద‌న ప‌యావుల‌, భ‌ర‌త్ కాంత్‌, తేజ్ దిలీప్‌, అడుకలం న‌రేష్‌, ఎస్తేర్ నోరోన్హా త‌దిత‌రులు ముఖ్య‌పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వై.యుగంధ‌ర్ ద‌ర్శ‌కుడు. మ‌హాతేజ క్రియేష‌న్స్ ప‌తాకంపై మోగుళ్ళ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి నిర్మించారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్‌ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ చిత్రం నుంచి సాహిత్య సాగ‌ర్ లిరిక్స్‌తో పాటు ట్యూన్ అందించిన మెలోడి సాంగ్‌ను విడుదల చేశారు.


Tenant.jpg

‘నా క‌థ‌లో నువ్వున్నావా? నీ క‌థ‌నే నేను అయ్యానా? నా జ‌త‌గా రానున్న‌వా... నీ జ‌త‌నై ర‌మ్మంటావా?’ అనే లిరిక్స్‌ (Tenant Lyrical Song) సాగిన ఈ పాట ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఈ పాట విడుదల సందర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. చిత్రంలో భార్యాభ‌ర్త‌ల అనురాగాన్ని, అప్యాయ‌త‌ను తెలియ‌జేసే పాట ఇది. ఈ బ్యూటీఫుల్‌ మెలోడి సాంగ్ అంద‌రికీ న‌చ్చుతుంది. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైలర్‌కు మంచి స్పంద‌న వ‌స్తుంది. జీవితం ఆడే వైకుంఠ‌పాళిలో ఎంచుకున్న పాచిక‌ల్లాంటి ఆరు ముఖ్య‌పాత్రల‌కి మ‌ధ్య జ‌రిగే క‌థే ఈ చిత్రం. ప్ర‌స్తుతం అర్బన్‌ లైఫ్ స్ట‌యిల్‌ని ప్ర‌తిబింబిస్తూ మ‌హిళ‌లు ఎంత అప్ర‌మ‌త్తంగా వుండాలో చెబుతూ, వాళ్ల‌ని అల‌ర్ట్ చేసే విధంగా తీర్చిదిద్ద‌బ‌డ్డ ఈ క‌థ‌, క‌థ‌నం ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుందని అన్నారు. ధ‌నా బాల‌, చందు, అనురాగ్‌, ర‌మ్య పొందూరి, మేగ్న త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం, పాట‌లు సాహిత్య సాగ‌ర్‌ అందించారు.


ఇవి కూడా చదవండి:

====================

*Dunki: 2023 టాప్ గ్రాస‌ర్ క్ల‌బ్‌లో షారూక్ ‘డంకీ’... వ‌ర‌ల్డ్ వైడ్‌గా కలెక్షన్స్ ఎంతంటే?

***************************

*Saripodhaa Sanivaaram: మళ్లీ యాక్షన్‌లోకి న్యాచురల్ స్టార్..

****************************

*Naveen Medaram: ‘డెవిల్’ సినిమాపై ఎటువంటి చట్టపరమైన చర్యలకి వెళ్లడం లేదు

**************************

*Ravi Teja: ‘హను-మాన్’కి ‘ఈగల్’ సపోర్ట్

***************************

Updated Date - Dec 27 , 2023 | 11:01 PM