Vaishnavi Chaitanya: ‘బేబి’ హీరోయిన్‌కు మరో ఛాన్స్.. హీరో ఎవరంటే?

ABN , Publish Date - Dec 28 , 2023 | 04:59 PM

సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బేబి’. ఈ సినిమాతో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ‘బేబి’ తర్వాత మరోసారి ఆనంద్ దేవరకొండతోనే ఆమె సినిమా చేస్తుంది. ఆ సినిమా కాకుండా ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఆశిష్ హీరోగా నటిస్తోన్న సినిమాలోనూ హీరోయిన్‌గా ఆమె ఫిక్సయింది.

Vaishnavi Chaitanya: ‘బేబి’ హీరోయిన్‌కు మరో ఛాన్స్.. హీరో ఎవరంటే?
Vaishnavi Chaitanya

సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బేబి’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో, యూత్‌లో ఎలాంటి క్రేజ్‌ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాగా విడుదలైన ‘బేబి’ (Baby) సినిమా రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి.. సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) నటన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగమ్మాయి ఎంతో చక్కగా నటించిందంటూ అందరి మన్ననలు అందుకుంది. ‘బేబి’ తర్వాత మరోసారి ఆనంద్ దేవరకొండతోనే ఆమె సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇప్పుడు వైష్ణవి చైతన్యకు మరో సినిమాలో ఛాన్స్ వరించింది. ఆ వివరాల్లోకి వెళితే..

వైవిధ్యమైన కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటంలో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు (Dil Raju), శిరీష్ (Shirish) ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలియంది కాదు. ఓ వైపు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే.. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డిఫరెంట్ సినిమాలను రూపొందిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థలో రూపొందిన ‘బలగం’ (Balagam) మూవీ ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌ను సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడీ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శిరీష్ సమర్పణలో ఆశిష్ (Ashish Reddy) హీరోగా.. అరుణ్ భీమవరపు (Arun Bhimavarapu) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో హీరోయిన్‌గా ‘బేబి’ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్యను ఫైనల్ చేశారు. తాజాగా ఆమె లుక్‌ని సైతం మేకర్స్ విడుదల చేశారు.


Baby-Heroine.jpg

ఈ లుక్‌లో ఆమె చాలా క్యూట్‌గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి (MM Keeravani) సంగీతాన్ని సమకూరుస్తుంటే, నేషనల్ అవార్డ్ విన్నర్ పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు.


ఇవి కూడా చదవండి:

====================

*Tenant: ‘నా క‌థ‌లో నువ్వున్నావా? నీ క‌థ‌నే నేను అయ్యానా?’ అంటోన్న సత్యం రాజేష్!

***************************

*Dunki: 2023 టాప్ గ్రాస‌ర్ క్ల‌బ్‌లో షారూక్ ‘డంకీ’... వ‌ర‌ల్డ్ వైడ్‌గా కలెక్షన్స్ ఎంతంటే?

***************************

*Saripodhaa Sanivaaram: మళ్లీ యాక్షన్‌లోకి న్యాచురల్ స్టార్..

****************************

*Naveen Medaram: ‘డెవిల్’ సినిమాపై ఎటువంటి చట్టపరమైన చర్యలకి వెళ్లడం లేదు

**************************

Updated Date - Dec 28 , 2023 | 04:59 PM