Bhumika Chawla: హీరోల వయసుపై భూమిక కామెంట్స్.. ఏం మారలేదు

ABN, First Publish Date - 2023-05-05T14:59:34+05:30

సినిమాల్లో హీరోలు (Heroes) తనకంటే సగం తక్కువ వయసున్న హీరోయిన్ల (Heroines)తో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని నిర్మాతలతో పాటు..

Bhumika Chawla: హీరోల వయసుపై భూమిక కామెంట్స్.. ఏం మారలేదు
Actress Bhumika Chawla
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలంతోపాటు సమాజంలో అనేక మార్పులు సంతరించుకుంటున్నప్పటికీ సినిమాల్లో మాత్రం హీరోయిన్ల పరిస్థితిలో మార్పు రావడం లేదని, ఫలితంగా నాటి నుంచి నేటి వరకు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు ప్రాధాన్యత లేదని సీనియర్‌ నటి భూమిక చావ్లా (Bhumika Chawla) ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలతో పోల్చుకుంటే.. వెబ్ సిరీస్‌లలో మాత్రం హీరోయిన్‌లకు మంచి ప్రాధాన్యతే దక్కుతుందని తాజాగా భూమిక చెప్పుకొచ్చారు.

ఈ అంశంపై ఆమె మాట్లాడుతూ.. ‘‘సినిమాల్లో హీరోలు (Heroes) తనకంటే సగం తక్కువ వయసున్న హీరోయిన్ల (Heroines)తో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని నిర్మాతలతో పాటు ప్రేక్షకులూ అంగీకరిస్తున్నారు. అలాగే, హీరోయిన్లు కూడా తమ కంటే పెద్దవారైన హీరోల సరసన నటించేందుకు సమ్మతిస్తున్నారు. ఈ విధానం ఇంకా కొనసాగుతూనే ఉంది. కాకపోతే వెబ్‌ సిరీస్‌ల విషయంలో మాత్రం హీరోయిన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ.. సినిమాల విషయంలో మాత్రం ఇంకా పాత విధానమే కొనసాగుతోంది’’ అని భూమిక ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న భూమిక.. ప్రస్తుతం అక్క, వదిన వంటి పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. (Bhumika Chawla Comments on Heroes Age)

Bhumika-Chawla.jpg

అయితే ఈ మధ్య హీరోయిన్లు అందరూ హీరోల వయసు (Heroes Age) గురించే మాట్లాడుతున్నారు. హీరోల వయసుతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద సినిమా సేల్ అవుతుంది కాబట్టే.. వారు ఇంకా రాణిస్తున్నారు. వారి సినిమాలకు బిజినెస్ జరుగుతుంది. హీరోయిన్లను చూసి సినిమాల బిజినెస్ జరగదు కాబట్టే.. వారిని నిర్మాతలు (Producers) పట్టించుకోవడం లేదనేలా భూమిక మాటలకు నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Takkar: చాలా రోజుల తర్వాత.. ఓన్లీ హీరోయిన్‌పైనే సాంగ్

*The Kerala Story: అది కాదు.. ఇది కదా అసలు స్టోరీ.. ఏఆర్ రెహమాన్ కూడా దండం పెట్టేశారు

*Ugram Twitter Review: సినిమా బాగుందంటున్నారు కానీ..

*Rama Banam Twitter Review: ఆ లిస్ట్‌లోకి ఇంకో సినిమా చేరినట్టే..

*Vanitha Vijay Kumar: రిలేషన్‌ మాత్రమే.. పెళ్ళి జరగలేదు.. దయచేసి అలా రాయవద్దు

*Parineeti and Raghav: క్రికెట్ స్టేడియంలో ప్రేమికులు హల్చల్

Updated Date - 2023-05-05T14:59:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!