Japan: ‘జపాన్’లోని టచ్చింగ్ టచ్చింగ్ తెలుగు లిరికల్ సాంగ్

ABN, First Publish Date - 2023-10-24T20:45:43+05:30 IST

హీరో కార్తీ ప్రస్తుతం తన ల్యాండ్‌మార్క్ ఫిల్మ్ అయిన 25వ చిత్రం ‘జపాన్‌’‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. తాజాగా ఈ సినిమాలో టచ్చింగ్ టచ్చింగ్ అనే లిరికల్ వీడియోను మేకర్స్ వదిలారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించింది.