Yendira Ee Panchayithi: ‘ఏందిరా ఈ పంచాయితీ’కి సెన్సార్ ఏ సర్టిఫికేట్ జారీ చేసిందంటే..

ABN , First Publish Date - 2023-10-04T21:13:05+05:30 IST

గ్రామీణ నేపథ్యంలో, స్వచ్చమైన ప్రేమ కథ‌తో రూపుదిద్దుకున్న చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’. భరత్, విషికా లక్ష్మణ్‌ జంటగా ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మించారు. ఈ మూవీతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అక్టోబర్ 6న విడుదల కాబోతోన్న ఈ చిత్రం.. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. యు బై ఏ సర్టిఫికేట్‌ని పొందింది.

Yendira Ee Panchayithi: ‘ఏందిరా ఈ పంచాయితీ’కి సెన్సార్ ఏ సర్టిఫికేట్ జారీ చేసిందంటే..
Yendira Ee Panchayithi Movie Still

గ్రామీణ నేపథ్యంలో, స్వచ్చమైన ప్రేమ కథ‌తో రూపుదిద్దుకున్న చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’ (Yendira Ee Panchayithi). భరత్ (Bharath Bade), విషికా లక్ష్మణ్‌ (Vishika Laxman) జంటగా ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మించారు. ఈ మూవీతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అక్టోబర్ 6న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్లుగా మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకోగా.. రీసెంట్‌గా హీరో శ్రీకాంత్ రిలీజ్ చేసిన ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఎమోషనల్ లవ్ స్టోరీతో పాటు క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా ఈ చిత్రంలో ఉన్నట్లుగా ట్రైలర్ క్లారిటీ ఇచ్చింది. ఎమోషనల్ డైలాగ్స్, విజువల్స్ హైలెట్‌గా నిలిచిన ఈ ట్రైలర్‌తో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. (Yendira Ee Panchayithi Censor Details)

ఇక సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి.. సెన్సార్ నుంచి యు బై ఏ సర్టిఫికేట్ జారీ అయింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. సెన్సార్ సభ్యులు కూడా ఈ సినిమాపై పాజిటివ్‌గా స్పందించారని, మంచి సినిమా అని కితాబు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలని తెలుపుతూ.. ప్రేక్షకులు అక్టోబర్ 6న వస్తున్న ఈ చిత్రాన్ని థియేటర్స్ చూసి.. సినిమాని సక్సెస్ చేయాలని దర్శకనిర్మాతలు కోరారు. (Yendira Ee Panchayithi Movie)


Panchayithi.jpg

ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తించారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఈ చిత్రానికి మాటలు అందించారు. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.


ఇవి కూడా చదవండి:

============================

*Varalaxmi Sarathkumar: డ్రగ్స్ కేసు వ్యవహారంలో నా పేరు ఎందుకు హైలెట్ అయ్యిందంటే?

***********************************

*Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి మాసివ్ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్

********************************

*Sudheer Babu: ‘మామా మశ్చీంద్ర’.. మహేష్ బాబులా పరుగెడుతుంది

*********************************

*TNR Trailer: మగజాతి మొత్తం ఆడదాని కొలతలే చూస్తారు.. కాకపోతే బూతులు మాట్లాడతారు

***********************************

*Siddharth: తెలుగులో సిద్ధార్థ్ సినిమాని ఎవరు చూస్తారని అన్నారట.. సిద్ధార్థ్ ఏడ్చేసినంత పనిచేశాడు

**********************************

Updated Date - 2023-10-04T21:13:05+05:30 IST