Varalaxmi Sarathkumar: డ్రగ్స్ కేసు వ్యవహారంలో నా పేరు ఎందుకు హైలెట్ అయ్యిందంటే?

ABN , First Publish Date - 2023-10-04T18:46:23+05:30 IST

డ్రగ్స్ కేసు విషయంలో తనపై వినిపిస్తున్న వార్తలను వరలక్ష్మీ శరత్ కుమార్ మరోసారి ఖండించారు. నా దగ్గరకు ఫ్రీలాన్స్ మేనేజర్‌గా ఆదిలింగం అనే వ్యక్తి ఓ రెండు మూడు సినిమాలు తీసుకొచ్చారు. నేను ఆ సినిమాలు చేశాను.. అంతే, అయిపోయింది. దాని తర్వాత ఏం జరిగిందనేది నాకు తెలియదు. నాకేం సమన్లు రాలేదు.. ఎవరూ ఫోన్ కూడా చేయలేదు.. అని వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పుకొచ్చారు.

Varalaxmi Sarathkumar: డ్రగ్స్ కేసు వ్యవహారంలో నా పేరు ఎందుకు హైలెట్ అయ్యిందంటే?
Varalaxmi Sarathkumar

డ్రగ్స్ కేసు విషయంలో తనపై వినిపిస్తున్న వార్తలను వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) మరోసారి ఖండించారు. 2020లో కేరళలోని విల్లించాం తీర ప్రాంతంలో పోలీసులు సోదాలు చేయగా.. ఒక పడవలో డ్రగ్స్, రైఫిళ్లు, బుల్లెట్స్ వారికి లభించాయి. అప్పుడు 13మందిని అరెస్ట్ చేశారు. 14వ నిందితుడుగా ఉన్న ఆదిలింగం (Aadilingam) అనే వ్యక్తిని రీసెంట్‌గా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆదిలింగం అనే అతను గతంలో వరలక్ష్మీ శరత్ కుమార్ దగ్గర పనిచేశారు. దీంతో ఆమెకు ఏమైనా ఈ డ్రగ్స్ విషయంలో సంబంధాలు ఉన్నాయేమో అనేలా అధికారులు సందేహించినట్లుగా ఇటీవల వార్తలు వినిపించాయి. ఆమెకు సమన్లు ఇచ్చి ఎంక్వైరీ చేయబోతున్నట్లుగా కూడా వార్తలు వైరల్ అవడంతో.. వరలక్ష్మీ శరత్ కుమార్ పేరు బాగా వినబడింది. అయితే వెంటనే ఆమె ఈ వార్తలను ఖండిస్తూ.. ఓ వీడియోను విడుదల చేశారు. తాజాగా ఆమె మరోసారి తనపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. అసలు ఈ డ్రగ్స్ కేసులో తన పేరు ఎందుకు వచ్చిందో తెలుపుతూ.. ఈ కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు.

‘రాజు గారి గది’ (Raju Gari Gadhi) సిరీస్ సినిమాలతో ప్రేక్షకుల్ని హారర్ కామెడీతో ఆకట్టుకున్న దర్శకుడు ఓంకార్.. ఈసారి ‘మాన్షన్ 24’ (Mansion 24) అనే సరికొత్త హారర్ వెబ్ సిరీస్‌తో భయపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. హాట్ స్టార్ స్పెషల్స్‌గా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ‌ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వెబ్ సిరీస్‌లో కీలక పాత్రలో నటిస్తోన్న వరలక్ష్మీ శరత్‌ కుమార్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ కేసు విషయమై మీడియా ఆమెను ప్రశ్నించగా.. తనపై వస్తోన్న ఆరోపణలపై ఆమె క్లారిటీ ఇచ్చారు. (Mansion 24 Trailer Launch Event)


omkar1.jpg

‘‘డ్రగ్స్ కేసుకు, నాకు ఏ సంబంధం లేదు. నాకేం సమన్లు రాలేదు.. ఎవరూ ఫోన్ కూడా చేయలేదు. ‘సర్కార్’ అనే సినిమా టైమ్‌లో ఆది సార్ నా దగ్గర ఫ్రీలాన్స్ మేనేజర్‌గా చేశారు. ఆ సినిమా ఆయనే నా దగ్గరకు తీసుకువచ్చారు. నా దగ్గర వర్క్ చేసే వ్యక్తి.. వారి పర్సనల్ లైఫ్‌లో ఏం చేస్తారనే విషయం నాకు తెలియదు కదా. నా దగ్గరకు మాత్రం ఫ్రీలాన్స్ మేనేజర్‌గా ఓ రెండు మూడు సినిమాలు తీసుకొచ్చారు. నేను ఆ సినిమాలు చేశాను.. అంతే, అయిపోయింది. దాని తర్వాత ఏం జరిగిందనేది నాకు తెలియదు. ఆయన ఫేస్ వేసి న్యూస్ రాస్తే ఎవరూ చదవరు కదా.. వరలక్ష్మీ మేనేజర్ అంటే అంతా చూస్తారు.. అందుకే నా పేరును ఇందులోకి తీసుకొచ్చారు. నాకు, ఆ కేసుకు ఎటువంటి సంబంధం లేదు..’’ అని వరలక్ష్మీ చెప్పుకొచ్చింది. (Varalaxmi about Drugs Allegations)


ఇవి కూడా చదవండి:

============================

*Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి మాసివ్ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్

********************************

*Sudheer Babu: ‘మామా మశ్చీంద్ర’.. మహేష్ బాబులా పరుగెడుతుంది

*********************************

*TNR Trailer: మగజాతి మొత్తం ఆడదాని కొలతలే చూస్తారు.. కాకపోతే బూతులు మాట్లాడతారు

***********************************

*Siddharth: తెలుగులో సిద్ధార్థ్ సినిమాని ఎవరు చూస్తారని అన్నారట.. సిద్ధార్థ్ ఏడ్చేసినంత పనిచేశాడు

**********************************

*Hi Nanna: ‘హాయ్ నాన్న’ సెకండ్ సింగిల్ గాజు బొమ్మ విడుదల ఎప్పుడంటే..

Updated Date - 2023-10-04T18:46:28+05:30 IST