Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి మాసివ్ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్

ABN , First Publish Date - 2023-10-04T16:44:16+05:30 IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘దేవర’. ఈ సినిమాకు సంబంధించి తాజాగా మేకర్స్ ఓ మాసివ్ అప్‌డేట్‌ని వదిలారు. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా విడుదల అవుతుందని, మొదటి పార్ట్ 5 ఏప్రిల్, 2024న విడుదల చేయబోతున్నట్లుగా.. దర్శకుడు కొరటాల శివ అధికారికంగా తెలియజేశారు.

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి మాసివ్ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్
Koratala Siva and Devara Still

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘దేవర’ (Devara). ఈ సినిమాకు సంబంధించి తాజాగా మేకర్స్ ఓ మాసివ్ అప్‌డేట్‌ని వదిలారు. ఈ మధ్య కాలంలో రూపుదిద్దుకుంటోన్న స్టార్ హీరోల సినిమాలు కొన్ని రెండు పార్ట్‌లకు తెరకెక్కినట్టే.. ఈ సినిమా కూడా రెండు పార్ట్‌లుగా తెరకెక్కబోతోందని.. దర్శకుడు కొరటాల శివ అధికారికంగా తెలియజేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో ఈ సినిమాని ఎందుకు రెండు పార్ట్‌లుగా తీయాల్సి వస్తుందో ఆయన క్లారిటీగా చెప్పారు. ఈ సినిమాకున్న కాన్వాస్, రేంజ్ అలాంటిదని.. అందుకే ‘దేవర’ సినిమాని రెండు పార్ట్‌లుగా తెరకెక్కిస్తున్నామని కొరటాల చెప్పుకొచ్చారు. ‘దేవర పార్ట్ 1’ (Devara Part 1)ను 5 ఏప్రిల్, 2024న విడుదల చేయబోతున్నట్లుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు.

ఈ అప్‌డేట్‌తో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘నువ్వు ఎంత టైమ్ అయినా తీసుకో.. ఎన్ని పార్ట్‌లు కావాలంటే అన్ని పార్ట్‌లు తీసుకో.. బొమ్మ మాత్రం బద్దలైపోవాలి.. చరిత్ర తిరగరాయలి.. రికార్డులు షేకవ్వాలి..’ అంటూ కొరటాల వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. ‘బ్లాడ్ బాత్‌కి రెడీ అవ్వండి.. ఆకలి మీద ఉన్న ఫ్యాన్స్, డబుల్ ఆకలితో ఉన్న డైరెక్టర్.. ఆ ఆకలికి సరైన శాటిస్‌ఫ్యాక్షన్ ఇవ్వడానికి దాదాపు 5 ఏళ్ల తర్వాత సోలోగా మాస్ ఫిల్మ్‌తో అనిరుధ్ మ్యూజిక్‌తో ఎన్టీఆర్.. పాత రికార్డ్స్ అన్నింటికీ ఎక్స్‌పెయిరీ బోర్డ్ ఫిక్స్’ అంటూ మరికొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (Fans Reaction on Devara 2 Parts Announcement)


Koratala.jpg

ప్రస్తుతం కొరటాల నుంచి వచ్చిన ఈ అప్‌డేట్‌తో ‘దేవర’ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సముద్ర నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తారక్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ, శ్రీదేవి తనయ జాన్వీకపూర్‌ నటిస్తోంది. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

============================

*Sudheer Babu: ‘మామా మశ్చీంద్ర’.. మహేష్ బాబులా పరుగెడుతుంది

*********************************

*TNR Trailer: మగజాతి మొత్తం ఆడదాని కొలతలే చూస్తారు.. కాకపోతే బూతులు మాట్లాడతారు

***********************************

*Siddharth: తెలుగులో సిద్ధార్థ్ సినిమాని ఎవరు చూస్తారని అన్నారట.. సిద్ధార్థ్ ఏడ్చేసినంత పనిచేశాడు

**********************************

*Hi Nanna: ‘హాయ్ నాన్న’ సెకండ్ సింగిల్ గాజు బొమ్మ విడుదల ఎప్పుడంటే..


***********************************

*Swayam Siddha: హీరోయిన్‌పై దర్శకహీరో ఫైర్.. కారణం ఏమిటంటే?

**************************************

Updated Date - 2023-10-04T16:53:02+05:30 IST