Honey Rose: పెళ్లి అంటే బాధ్యత.. అందుకే ప్రేమలో ఉన్నాను..

ABN , First Publish Date - 2023-03-25T19:18:45+05:30 IST

మలయాళంలో అనేక సూపర్ హిట్ సినిమాలు చేసిన ముద్దుగుమ్మ హనీ రోజ్ (Honey Rose). ఈ మధ్య టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ సరసన ‘వీరసింహా రెడ్డి’ (Veera Simha Reddy) లో నటించారు. ఈ చిత్రంలో రెండు పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.

Honey Rose: పెళ్లి అంటే బాధ్యత.. అందుకే ప్రేమలో ఉన్నాను..

మలయాళంలో అనేక సూపర్ హిట్ సినిమాలు చేసిన ముద్దుగుమ్మ హనీ రోజ్ (Honey Rose). ఈ మధ్య టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ సరసన ‘వీరసింహా రెడ్డి’ (Veera Simha Reddy) లో నటించారు. ఈ చిత్రంలో రెండు పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. హనీ రోజ్ తాజాగా భాగ్యనగరంలో సందడి చేశారు. హైదరాబాద్‌లోని మదీనా గూడలో జైలు థీమ్‌తో కూడిన జిస్మత్ మండీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆసక్తికర కబుర్లను పంచుకున్నారు.

Honey-Rose.jpg

హైదరాబాద్‌కు రావడం సంతోషకరంగా ఉందని హనీ రోజ్ చెప్పారు. ‘‘వీర‌సింహా రెడ్డిలో తన పాత్రకు సినీ ఇండస్ట్రీ, అభిమానుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. బాలకృష్ణ లాంటి లెజెండ్‌తో సినిమా చేసే అవకాశం రావడంతో కల నిజమైనట్టు ఉంది. సినిమాలు తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. ఇండస్ట్రీకి నేను 14ఏళ్ల వయసులోనే 2005లో ఎంట్రీ ఇచ్చాను. వీరసింహా రెడ్డి కోసం గోపీచంద్ మలినేని నాకు ఫోన్ కాల్ చేశారు. సినిమా గురించి క్లుప్తంగా వివరించారు. ఫోన్ రావడంతోనే నేను ఆశ్చర్యపోయాను. చిత్రంలో రెండు పాత్రల్లో కనిపించాల్సి వచ్చింది. నాక్కుడా అరుదైన అవకాశం. అందువల్ల బాగా కష్ట పడ్డాను. మూవీ సమయంలో బాలకృష్ణ సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఆయనతో నటించడంతో కొత్త అంశాలను నేర్చుకున్నాను.

Honey-Rose-2.jpg

సోషల్ మీడియాలో మంచి, చెడ్డ రెండు రకాల కామెంట్స్ వస్తాయి. ఆ రెండింటిని నేను బాగా ఎంజాయ్ చేస్తాను. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. కేరళ ఫుడ్ అంటే మరి పిచ్చి. హైదరాబాదీ బిర్యానీ, అన్నం, పెరుగు కూడా నచ్చింది. రొమాంటిక్ పాత్రలు చేయాలని ఉంది. అటువంటి పాత్రలో నటించే అవకాశం వస్తుందేమోనని చూస్తున్నాను. నా మీద ఇంత ప్రేమను చూపించినందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. పెళ్లి అంటే బాధ్యత. అందుకే ప్రతి అంశంతో ప్రేమలో ఉన్నాను’’ అని హనీ రోజ్ తెలిపారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-26T00:51:59+05:30 IST