Ashok Galla2: యాక్షన్‌లోకి దిగిన అశోక్ గల్లా.. మహేష్ బాబు ఏమన్నారంటే?

ABN , First Publish Date - 2023-04-05T13:26:38+05:30 IST

మొదటి సినిమాలో లవర్ బాయ్‌గా కనిపించిన ఈ ‘హీరో’.. ఈ సినిమాలో మీసాలు మెలేస్తూ.. మాస్ కోణాన్ని పరిచయం చేస్తున్నాడు. మరి ఇది ఎంత వరకు అతనికి

Ashok Galla2: యాక్షన్‌లోకి దిగిన అశోక్ గల్లా.. మహేష్ బాబు ఏమన్నారంటే?
Galla Ashok in His Second Film

‘హీరో’ చిత్రంతో హీరోగా సినీ అరంగేట్రం చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) మేనల్లుడు, సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) మనవడు అశోక్ గల్లా (Ashok Galla). ఆ చిత్రంతో ‘హీరో’ (Hero)గా మంచి పేరే తెచ్చుకున్న అశోక్ గల్లా.. ఇప్పుడు తన రెండవ ప్రాజెక్ట్‌తో (AshokGalla2) వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అశోక్ గల్లా హీరోగా.. ‘అ!, జాంబీ రెడ్డి’ చిత్రాలతో దర్శకుడిగా తనేంటో నిరూపించుకుని.. ఇప్పుడు పాన్ ఇండియా (Pan India) మూవీ ‘హను-మాన్’ (Hanu-Man)తో సెన్సేషన్‌ని క్రియేట్ చేయబోతోన్న క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ‘గుణ 369’ (Guna 369) ఫేమ్ అర్జున్ జంధ్యాల (Arjun Jandhyala) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లలితాంబిక ప్రొడక్షన్స్ (Lalithambika Productions) ప్రొడక్షన్ నెం 1గా.. ఎన్నారై (ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్) సోమినేని బాలకృష్ణ (Somineni Balakrishna) నిర్మిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం నుంచి తాజాగా ఓ వీడియో గ్లింప్స్‌‌ని మేకర్స్ విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ వీడియోని ట్విట్టర్ వేదికగా విడుదల చేసి.. టీజర్ ఆకట్టుకునేలా ఉందని తెలుపుతూ అశోక్ గల్లాకి పుట్టినరోజు (Ashok Galla Birthday) శుభాకాంక్షలు తెలిపారు.

Also Read-Where is Pushpa?: ‘పుష్పరాజ్’ ఎక్కడ?.. సమాధానం తెలిసేది ఎప్పుడంటే?

సూపర్ స్టార్ చెప్పినట్లుగా నిజంగానే ఈ వీడియో ఆకట్టుకునేలా ఉంది. ఈ వీడియో చూస్తుంటే.. తన రెండో సినిమాతోనే తనలోని మాస్‌ని అశోక్ పరిచయం చేయబోతున్నాడనేది తెలుస్తుంది. ఈ వీడియోలో భారీ ఆకారంతో ఉన్న విలన్స్‌ని అశోక్ ఎదిరిస్తున్నాడు. సినిమాలో ఇది ఎంట్రీ సీన్ అనేలా ఉంది. ఊరి జనం మధ్య, ఒక గుడిలో ఈ ఫైట్‌ని చిత్రీకరించినట్లుగా ఉంది. లొకేషన్ అంతా న్యాచురల్‌గా ఉంది. అలాగే శ్రీకృష్ణుని విగ్రహం చూపిస్తూ.. అశోక్ గల్లా యాక్షన్ లుక్‌ని పరిచయం చేశారు. మొత్తంగా చూస్తే.. మొదటి సినిమాలో లవర్ బాయ్‌గా కనిపించిన ఈ ‘హీరో’.. ఈ సినిమాలో మీసాలు మెలేస్తూ.. మాస్ కోణాన్ని పరిచయం చేస్తున్నాడు. మరి ఇది ఎంత వరకు అతనికి వర్కవుట్ అవుతుందో తెలియాల్సింది. (AshokGalla2 First Action Video)

Ashok-Galla.jpg

ఈ సినిమా గురించి దర్శకుడు అర్జున్ జంధ్యాల (Arjun Jandhyala about Ashok Galla 2 Film) మాట్లాడుతూ.. చాలా కొత్త కథ. ప్రశాంత్ వర్మ ఎంటర్‌టైనింగ్ స్క్రిప్ట్ అందించారు. సినిమా నెక్స్ట్ లెవల్‌లో వుంటుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇందులో అశోక్ గల్లాలోని న్యూ లుక్‌ని చూస్తారు. ఈ కథకు సాయి మాధవ్ బుర్రాగారు మాటలు రాయడం ఆనందంగా వుంది. మంచి కథ. అంతే చక్కని చిత్రీకరణతో ప్రేక్షకుల ముందుకు వస్తాం. భీమ్స్ బెస్ట్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రసాద్ మురెళ్ళ, తమ్మిరాజు గారు.. అందరం నెక్స్ట్ సినిమా చేయడానికి పని చేస్తున్నాం. నిర్మాత బాలకృష్ణ (Balakrishna)గారు నాకు ఎప్పటి నుంచో నాకు స్నేహితులు. సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత. ఆయన మొదటి సినిమాకి నేనే దర్శకుడు కావడం, ప్రశాంత్ వర్మ గారు కథ ఇవ్వడం.. ఇవన్నీ అద్భుతంగా కుదిరాయి’’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి:

*********************************

*Jr NTR: అఫీషియల్.. మరో యుద్ధానికి సిద్ధం

*Rashmika Mandanna: నేషనల్ క్రష్‌ ఎలా అయిందో తెలుసా?

*Srikanth Odela: హీరో కాదు.. ‘దసరా’ దర్శకుడికి నిర్మాత కాస్ట్‌లీ గిఫ్ట్

*Upasana: బెస్ట్ ఫ్రెండ్స్ సమక్షంలో బేబీ షవర్ పార్టీ.. పిక్స్ వైరల్

Updated Date - 2023-04-05T13:26:40+05:30 IST