Rashmika Mandanna: నేషనల్ క్రష్‌ ఎలా అయిందో తెలుసా?

ABN , First Publish Date - 2023-04-05T10:22:25+05:30 IST

పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అనేలా.. ఆమెను కన్నడ ఇండస్ట్రీతో పాటు కొందరు యాంటీ ఫ్యాన్స్ నిత్యం ఆమెపై ఏదో ఒక రకంగా ట్రోల్ చేస్తూనే ఉంటారు. అందులో కొన్నింటికి సమాధానం ఇస్తూ..

Rashmika Mandanna: నేషనల్ క్రష్‌ ఎలా అయిందో తెలుసా?
Heroine Rashmika Mandanna

రష్మిక మందన్నా (Rashmika Mandanna).. దేశవ్యాప్తంగా ఈ పేరు ఎంత పెద్ద సంచలనమో తెలియంది కాదు. కన్నడ సినీ పరిశ్రమకు (Kannada Cine Industry) చెందిన ఈ బ్యూటీ.. పక్కా ప్లానింగ్‌తో ఈ రోజు పాన్ ఇండియా (Pan India) హీరోయిన్ స్థాయికి చేరింది. దీని వెనుక ఆమె కృషి, పట్టుదల ఎంతో ఉంది. ఎన్నింటినో జయించి, చివరికి పీటల మీద పెళ్లిని ఆపుకుని మరీ ఈ రోజు ఈ స్థాయికి చేరింది. 2016లో కన్నడ ‘కిరిక్ పార్టీ’ (Kirik Party)తో అరంగేట్రం చేసిన రష్మిక.. ఆ సినిమాతో హిట్ కొట్టడమే కాకుండా.. ఆ సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టి (Rakshit Shetty)ని ప్రేమించి, పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమైంది. కానీ ఏం జరిగిందో తెలియదు.. పీటల వరకు వెళ్లిన పెళ్లి ఆగిపోయింది. ఆ పెళ్లిని రష్మిక మందన్నానే కాదనుకుందనేలా ఆ తర్వాత వార్తలు వచ్చాయి కానీ.. అసలు విషయం ఏమిటనేది ఇప్పటి వరకు బయటికి రాలేదు. (Rashmika Mandanna Birthday Special)

Rashmika-3.jpg

అయితే అదే టైమ్‌లో ఆమెకు టాలీవుడ్‌లో వెంకీ కుడుమల (Venky Kudumula) దర్శకత్వంలో ‘ఛలో’ (Chalo) ఛాన్స్ రావడం.. ఆ మూవీ మంచి విజయం సాధించడంతో పాటు వరుస అవకాశాలు ఆమెను వరించడంతో.. ఇప్పుడప్పుడే పెళ్లి వద్దనుకుందని, అందుకే పెళ్లికి టాటా చెప్పి.. టాలీవుడ్‌లో స్థిరపడేందుకు సిద్ధమైందనేలా వార్తలు వచ్చాయి. నిజంగానే ‘ఛలో’ తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా (Star Heroine) ఆమె ఎలా మారిందో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ‘గీత గోవిందం’ (Geetha Govindham) చిత్రంతో ఆమె స్థాయి మారింది. స్టార్ హీరోయిన్ స్టేటస్ ఆమెకు వచ్చేసింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆమెకు వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అందునా స్టార్ హీరోల కళ్లన్నీ ఆమెపైనే పడటంతో.. ఒక్కసారిగా టాలీవుడ్‌లో టాప్‌ ఛైర్‌ని సొంతం చేసేసుకుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Icon Star Allu Arjun)తో చేసిన ‘పుష్ప’ (Pushpa), అందులోని ఆమె అభినయం, డ్యాన్స్.. ఒక్కసారిగా ఆమెను నేషనల్ క్రష్‌గా (National Crush of India) మార్చేసింది. ముఖ్యంగా ‘రారా సామి’ పాటకు ఆమె డ్యాన్స్ చేసిన విధానం అందరినీ ఆకర్షించింది. ఇప్పుడే ఫంక్షన్ జరిగినా.. ఆ పాట ఉండాల్సిందే. అంతలా ఆ పాట జనాల్లోకి రష్మికను చేర్చేసింది.

Read Also- Naresh and Pavitra: నరేష్, పవిత్రలను చూసేందుకు ఎగబడిన జనం.. ఎక్కడంటే?

Rashmika-1.jpg
టాలీవుడ్‌లో అగ్రస్థానంలో ఉండగానే బాలీవుడ్ (Bollywood), కోలీవుడ్ (Kollywood) అంటూ.. తన పరిధిని రష్మిక విస్తరించుకునే ప్రయత్నాలు మొదలెట్టింది. కోలీవుడ్‌లో కార్తీ (Karthi), విజయ్ (Vijay) వంటి వారి సరసన ఇప్పటికే నటించి హిట్ అందుకున్న ఈ భామ.. అక్కడ కూడా ఫేమస్ హీరోయిన్‌గా పేరొందింది. ఇక బాలీవుడ్‌లో అయితే ఇప్పటి వరకు సరైన హిట్ అందుకోలేదు కానీ.. అవకాశాలకు మాత్రం లోటులేకుండా.. అక్కడ కూడా బాగానే పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ హీరోయిన్‌గానే చలామణీ అవుతోంది. దర్శకుడు సందీప్ వంగా (Sundeep Vanga) తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ (Animal) కనుక హిట్ అయితే మాత్రం.. ఇక బాలీవుడ్‌లో తన చక్రం తిప్పడం రష్మికకు ఏమంత కష్టం కానే కాదు. రష్మిక‌ మందన్నాకు సంబంధించి ప్రతీది ఒక ప్లానింగ్‌తో ఉంటుంది. ఎక్కడ కన్నడ ఇండస్ట్రీ.. ఇప్పుడెక్కడ ఆమె ఉంది అనేది గమనిస్తే.. ఆమె ప్లానింగ్ ఏమిటో ఇట్టే అర్థమవుతుంది.

Rashmika-2.jpg

ఫేమస్, నేషనల్ క్రష్‌గానే కాకుండా.. నిత్యం ట్రోలింగ్ (Trolling) జరిగే హీరోయిన్‌గానూ రష్మికకు రికార్డ్ ఉంది. పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అనేలా.. ఆమెను కన్నడ ఇండస్ట్రీతో పాటు కొందరు యాంటీ ఫ్యాన్స్ నిత్యం ఆమెపై ఏదో ఒక రకంగా ట్రోల్ చేస్తూనే ఉంటారు. అందులో కొన్నింటికి సమాధానం ఇస్తూ.. కొన్నింటిని చూసి చూడనట్లు వదిలేస్తూ.. రష్మిక తన జర్నీని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తోంది. ఇంకా చెప్పాలంటే.. ట్రోలింగ్‌నే సక్సెస్‌గా మార్చుకుంటూ.. రష్మిక తన పరంపరను కొనసాగిస్తోంది. రాబోయే ఆమె చిత్రాల ఆర్డర్ చూస్తే మాత్రం.. పిచ్చిక్కిపోవాల్సిందే. ముఖ్యంగా ‘పుష్ప2’ (Pushpa 2) సినిమాలో ఆమె పాత్రకు మరింత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదే కనుక నిజమైతే.. ఈసారి నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్ క్రష్‌గా రష్మిక పేరొందడం ఖాయం. ఒకవైపు విజయాలు, మరోవైపు అవమానాలతో ధైర్యంగా ముందుకు సాగిపోతున్న రష్మిక మందన్నా బర్త్‌డే (Rashmika Mandanna Birthday) నేడు (ఏప్రిల్ 5). ఆమె మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుతూ.. హ్యాపీ బర్త్‌డే రష్మిక మందన్నా (#HBDRashmikaMandanna).

ఇవి కూడా చదవండి:

*********************************

*Srikanth Odela: హీరో కాదు.. ‘దసరా’ దర్శకుడికి నిర్మాత కాస్ట్‌లీ గిఫ్ట్

*Upasana: బెస్ట్ ఫ్రెండ్స్ సమక్షంలో బేబీ షవర్ పార్టీ.. పిక్స్ వైరల్

*SamanthaRuthPrabhu: నాగ చైతన్య, శోభిత డేటింగ్ వార్తల మీద క్లారిటీ ఇచ్చిన సమంత

Updated Date - 2023-04-05T10:28:38+05:30 IST