కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sudheer Babu: సుధీర్‌ బాబు రెండు సినిమాల అప్‌డేట్స్ వచ్చాయ్..

ABN, First Publish Date - 2023-09-06T21:52:52+05:30

నైట్రో స్టార్ సుధీర్ బాబు నటిస్తున్న రెండు సినిమాల అప్‌డేట్స్ బుధవారం టాలీవుడ్‌లో సందడి చేశాయి. సుధీర్ బాబు హీరోగా ‘లూజర్’ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో చేస్తున్న యూనిక్ కంటెంట్ మూవీ ‘మా నాన్న సూపర్ హీరో’ షూటింగ్ పూర్తి చేసుకోగా.. త్రిపాత్రాభినయం చేస్తున్న ‘మామా మశ్చీంద్ర’ మూవీని అక్టోబర్ 6న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు.

Nitro Star Sudheer Babu

నైట్రో స్టార్ సుధీర్ బాబు (Nitro Star Sudheer Babu) నటిస్తున్న రెండు సినిమాల అప్‌డేట్స్ బుధవారం టాలీవుడ్‌లో సందడి చేశాయి. సుధీర్ బాబు హీరోగా ‘లూజర్’ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర (Abhilash Reddy Kankara) దర్శకత్వంలో చేస్తున్న యూనిక్ కంటెంట్ మూవీ ‘మా నాన్న సూపర్ హీరో’. CAM ఎంటర్‌టైన్‌మెంట్‌‌తో కలిసి వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మా నాన్న సూపర్ హీరో’ షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా చిత్ర యూనిట్‌తో ఉన్న సెల్ఫీస్, వీడియోని హీరో సుధీర్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Maa Nanna Superhero Shoot Wrapped Up)


షూటింగ్ పార్ట్ పూర్తి కావడంతో మేకర్స్ త్వరలోనే ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా ప్రారంభించాలని చూస్తున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన ఆర్ణ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించనున్నారు. ఇక ఈ నైట్రో స్టార్ చేస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘మామా మశ్చీంద్ర’. ఇందులో సుధీర్ బాబు త్రిపాత్రాభినయంతో అలరించబోతున్నారు. యాక్టర్ -ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ (Harshavardhan) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. ఇందులో దుర్గ- స్థూలకాయుడు, పరశురాం- ఓల్డ్ డాన్, డిజె.. ఇలా మూడు భిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు సుధీర్ బాబు. (Mama Mascheendra Movie Release Date)

‘మామా మశ్చీంద్ర’ సినిమా రిలీజ్ డేట్‌ని తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు. అక్టోబర్ 6న ఈ సినిమాని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో దుర్గ- ఓల్డ్ డాన్, డిజె.. ఈ మూడు లుక్స్‌లో సుధీర్ బాబు ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో మిర్నాళిని రవి, ఈషా రెబ్బా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌ సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Raghava Lawrence: ఆ స్వామి అనుగ్రహంతోనే ఈ అదృష్టం

*************************************

*Narayana and Co: ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ ఎంటర్‌టైనర్..

*************************************

*Ala Ninnu Cheri: నిన్నటి కంటే ఎక్కువగా నిను ప్రేమిస్తా.. క్రిష్ వదిలిన ప్రేమ సాంగ్

*************************************

*Rules Ranjann: ‘రూల్స్ రంజన్’ ట్రైలర్‌కు డేట్, టైమ్ ఫిక్స్

*************************************

*Skanda: ‘స్కంద’ వినాయక చవితికి రావట్లేదు.. ఎప్పుడో తెలుసా?

**************************************

Updated Date - 2023-09-06T21:52:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!