Rules Ranjann: ‘రూల్స్ రంజన్’ ట్రైలర్‌కు డేట్, టైమ్ ఫిక్స్

ABN , First Publish Date - 2023-09-06T16:24:23+05:30 IST

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రూల్స్ రంజన్’. సీనియర్ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 28న విడుదల కాబోతోన్న ఈ చిత్ర ట్రైలర్‌ను సెప్టెంబర్ 8న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

Rules Ranjann: ‘రూల్స్ రంజన్’ ట్రైలర్‌కు డేట్, టైమ్ ఫిక్స్
Rules Ranjann Movie Still

కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), నేహా శెట్టి (Neha Shetty) జంటగా రత్నం కృష్ణ (Rathinam Krishna) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రూల్స్ రంజన్’ (Rules Ranjann). సీనియర్ నిర్మాత ఏ.ఎం. రత్నం (AM Rathnam) సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యంగ్ హీరోహీరోయిన్లు కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కలయికలో వస్తున్న ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. మరీ ముఖ్యంగా ‘సమ్మోహనుడా’ సాంగ్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్.. ఇప్పుడు ట్రైలర్ విడుదల తేదీ, టైమ్‌ని అనౌన్స్ చేశారు. (Rules Ranjann Trailer Date)


ఈ సినిమాని సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నట్లుగా సోమవారం జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత ఏ.ఎం. రత్నం ప్రకటించారు. ఇప్పుడు ‘రూల్స్ రంజన్’ చిత్ర ట్రైలర్‌ను సెప్టెంబర్ 8న ఉదయం 11 గంటల 22 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ ఓ కొత్త పోస్టర్‌ను వదిలారు. ఈ పోస్టర్‌లో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. పాటలలో కిరణ్ అబ్బవరం-నేహా శెట్టి కెమిస్ట్రీ, విడుదల తేదీ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడిన మాటలు.. సినిమాపై రోజురోజుకి అంచనాలు పెంచేస్తుండగా.. రాబోయే ట్రైలర్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలో నెలకొంది. (Rules Ranjann Movie)

Rules.jpg

కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు, ఇమేజ్‌కు భిన్నంగా ఈ సినిమాలో కనిపిస్తున్నారు. భావోద్వేగాలు, ప్రేమ, హాస్యం, సంగీతం కలగలిసిన ఈ విందుభోజనం లాంటి చిత్రం కుటుంబ ప్రేక్షకులను, యువతను ఆకట్టుకుని ఘన విజయం సాధిస్తుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేసింది. వెన్నెల కిషోర్, హైపర్ ఆది, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్, సుబ్బరాజు, అజయ్, గోపరాజు రమణ‌లతో పాటు.. అన్నూ కపూర్, సిద్ధార్థ్ సేన్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, అభిమన్యు సింగ్ మరియు గుల్షన్ పాండే వంటి పలువురు హిందీ నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Skanda: ‘స్కంద’ వినాయక చవితికి రావట్లేదు.. ఎప్పుడో తెలుసా?

**************************************

*MSMP Recipe Challenge: అనుష్క టు ప్రభాస్.. ప్రభాస్ టు రామ్ చరణ్

*************************************

*Balagam: ‘బలగం’ పెద్దమనిషి ఇక లేరు..

************************************

*Sachin Tendulkar: మురళీధరన్ జీవితంలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలి

*************************************

Updated Date - 2023-09-06T16:25:05+05:30 IST