Ala Ninnu Cheri: నిన్నటి కంటే ఎక్కువగా నిను ప్రేమిస్తా.. క్రిష్ వదిలిన ప్రేమ సాంగ్

ABN , First Publish Date - 2023-09-06T18:23:11+05:30 IST

దినేష్‌ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న చిత్రం ‘అలా నిన్ను చేరి’. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను తాజాగా డైరెక్టర్ క్రిష్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ సాహిత్యం అందించారు.

Ala Ninnu Cheri: నిన్నటి కంటే ఎక్కువగా నిను ప్రేమిస్తా.. క్రిష్ వదిలిన ప్రేమ సాంగ్
Ala Ninnu Cheri Still

దినేష్‌ తేజ్ (Dinesh Tej), హెబ్బా పటేల్ (Hebah Patel), పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna) లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న చిత్రం ‘అలా నిన్ను చేరి’. ప్రేక్షకులకు డిఫరెంట్ అనుభూతిని ఇచ్చేలా.. నేటితరం నచ్చే, మెచ్చే కంటెంట్‌తో.. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కుతోందీ చిత్రం. ఈ సినిమాతో మారేష్ శివన్ (Maresh Shivan) దర్శకుడిగా పరిచయమవుతుండగా.. కొమ్మాలపాటి సాయి సుధాకర్ (Kommalapati Sai Sudhakar) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా.. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా‌కు సంబంధించిన ప్రతీది మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి చేతుల మీదుగా టైటిల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.


సాంగ్ రిలీజ్ అనంతరం క్రిష్ మాట్లాడుతూ.. ఈ సాంగ్ చాలా బాగా వచ్చిందని, ఆడియన్స్ టేస్ట్‌కి తగ్గట్టు అద్భుతమైన విజువల్స్‌తో షూట్ చేసిన ఈ పాట అందరినీ మెప్పిస్తుందని అన్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ మొత్తానికి ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ పాటకు ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ లిరిక్స్ రాయగా.. సుభాష్‌ ఆనంద్ బాణీలు కట్టారు. ఆహ్లాదకరమైన లొకేషన్స్‌లో షూట్ చేసిన ఈ సాంగ్ విజువల్స్ ఆడియన్స్ మనసు దోచుకుంటున్నాయి. హీరో హీరోయిన్ దినేష్ తేజ్, పాయల్ రాధాకృష్ణ అద్భుతమైన కెమిస్ట్రీ ఈ పాటకు మేజర్ అట్రాక్షన్ అయింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పాటలో సుభాష్‌ ఆనంద్ బాణీలు ఎంతో మనోహరంగా ఉన్నాయి. (Ala Ninnu Cheri Title Song Out)

Krish.jpg

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘అలా నిన్ను చేరి’ సినిమా ఉంటుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మిస్తున్నాం. ఈ సినిమాలో అన్ని పాటలను ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ (Chandrabose) రాశారు. పేరున్న సాంకేతిక నిపుణులు, నటీనటులు ఈ సినిమాకు పనిచేశారు. పాట విడుదల చేసిన క్రిష్‌గారికి ధన్యవాదాలు. అతిత్వరలోనే మూవీ తేదీని ప్రకటిస్తామని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

============================

*Rules Ranjann: ‘రూల్స్ రంజన్’ ట్రైలర్‌కు డేట్, టైమ్ ఫిక్స్

*************************************

*Skanda: ‘స్కంద’ వినాయక చవితికి రావట్లేదు.. ఎప్పుడో తెలుసా?

**************************************

*MSMP Recipe Challenge: అనుష్క టు ప్రభాస్.. ప్రభాస్ టు రామ్ చరణ్

*************************************

Updated Date - 2023-09-06T18:23:11+05:30 IST